మొటిమలు అంటే ఏమిటి?
మొటిమలనేవి ఓ సాధారణమైన చర్మ రుగ్మత. చర్మంపై పైకి తేలిన గాయాలుగా కనిపించే వీటినే “మొటిమలు” అంటారు. ఇవి నల్ల మచ్చలు (black heads) లేక తెల్లమచ్చలు (whiteheads) గా కూడా ఏర్పడవచ్చు, సామాన్యంగా ఇవి ముఖంపైన, భుజాలు, మెడ, వీపు మరియు రొమ్ముపైన రావచ్చు. మొటిమలు ఆరోగ్యానికి తీవ్రమైన ప్రమాదం కాకపోయినా, ఇవి మానిపోయాక చర్మంపైన శాశ్వతమైన మచ్చల్ని మిగిల్చుతాయి, తద్వారా చర్మం యొక్క బాహ్య సౌందర్యాన్ని చెడగొడుతాయి. మొటిమలు సాధారణంగా స్త్రీలకు, అందులోనూ యుక్త వయసు (టీనేజ్) ఆడపిల్లలకు, వస్తుంటాయి.
మొటిమల ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
మొటిమలు క్రింది రూపాలలో చర్మంపై స్పష్టంగా కనిపిస్తాయి:
- వైట్ హెడ్స్ లేదా బ్లాక్హెడ్స్ లేదా చిన్న వాపు (papules)
- ఒక చిన్న పొక్కు (pustules) లేదా చీముతో నిండిన మొటిమలు, వీటి అడుగున ఎరుపుదేలి ఉంటాయి.
- నొప్పికలిగిన గుండ్రని చిన్న గడ్డలు (నోడ్యూల్స్) చర్మంలో లోతుగా పట్టుకుని ఉంటాయివి మరియు ఇవి మచ్చలు కలిగిస్తాయి.
- కుహరం లేదా తిత్తులు (cysts) ప్రధానంగా చీముతో నిండి ఉంటాయి మరియు ఇవి మానిన తర్వాత చర్మంపై మచ్చల్ని మిగిల్చి పోతాయి.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
మోటిమలను కలిగించే వివిధ కారణాలు:
- బాక్టీరియా పి. అక్నెస్ యొక్క వేగవంతమైన పెరుగుదల.
- మగ (ఆన్డ్రోజెన్స్) మరియు స్త్రీ లైంగిక హార్మోన్ల (ఈస్ట్రోజెన్) లో మార్పులు, దీనివల్ల రోమకూపాలు లేక చర్మరంధ్రాల పూడుకుపోవడం మరియు వాపు కల్గుతుంది.
- కుటుంబ నియంత్రణ (birthcontrol) మాత్రలు (ప్రారంభము లేదా ఆపటం) వాడేటప్పుడు చేసే (మందుల) మార్పిడివల్ల హార్మోన్ల మార్పులు మరియు గర్భధారణ.
- పాలీసైస్టిక్ అండాశయ వ్యాధి (PCOD)
- వీటిలో జీవనశైలి కారకాలు:
ఇది ఎలా నిర్ధారించబడుతుంది?
- ప్రభావిత ప్రాంతాల పూర్తి పరీక్ష మోటిమలు నిర్ధారణలో సహాయపడుతుంది. కారణంతో బాటు మొటిమలను గుర్తించడానికి క్రింది పరీక్షలు సూచించబడ్డాయి:
- రక్త పరీక్షలు, అలాగే PCOS (Polycystic ovary syndrome) ను గుర్తించడానికి అల్ట్రాసౌండ్ స్కాన్లు ఉపయోగించబడతాయి.
మోటిమల చికిత్సకు దీర్ఘకాలం పడుతుంది, వీటిని నయం చేయడానికి సమయం పడుతుంది మరియు ముఖ్యంగా మంచి చర్మ సంరక్షణ అవసరం.
వైద్యులు సూచించిన కొన్ని ప్రభావవంతమైన మోటిమల నియంత్రణ పద్ధతులు:
- యాంటీబయాటిక్స్ యొక్క ఉపయోగం: నోటిద్వారా కడుపులోకి తీసుకునే మందులు లేదా పైపూతగా ఉపయోగించే మందులు (నేరుగా చర్మంపై పూసేవి ) ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీ (అంటే మంట, వాపును తగ్గించేవి) ప్రభావాన్ని కలిగి ఉంటాయి మరియు మోటిమలు కలిగించే బ్యాక్టీరియాను తగ్గించటానికి సహాయపడుతాయి.
- సాల్సిలిక్ యాసిడ్ మరియు బెంజాయిల్ పెరాక్సైడ్ లను పైపూతగా తేలికపాటి మోటిమల చికిత్సకు సాధారణంగా ఉపయోగిస్తారు.
- ఐసోట్రిటినోయిన్ మాత్రలు: వీటిని అత్యంత ప్రభావవంతమైన చికిత్సగా తీవ్రమైన మోటిమలకు వాడతారు, ఇవి చర్మ రంధ్రాల అడ్డంకులను అడ్డుకుంటాయి మరియు రంధ్రాలు పూడుకుపోవడాన్ని అడ్డుకుంటాయి, తద్వారా చమురుగుణం తగ్గుతుంది మరియు మృదువైన ప్రభావం చర్మానికి ఏర్పడుతుంది.
- బయోఫోటనిక్ చికిత్సను తేలికపాటి నుండి ఓ మోస్తరుగా వాపుదేలిన మోటిమల చికిత్సకు ఉపయోగిస్తారు.
- హార్మోన్-రెగ్యులేటింగ్ థెరపీ, ఇందులో తక్కువ లేదా అతి తక్కువ మోతాదు ఈస్ట్రోజెన్ మరియు యాంటిఆండ్రోజెన్ గర్భ నిరోధక మాత్రల్ని మహిళల్లో మోటిమలు చికిత్సకు ఉపయోగిస్తారు.
- ఉపరితల లేదా నోటిద్వారా కడుపులోకి తీసుకునే రెటీనాయిడ్స్ మందుల్ని చర్మ రంధ్రాల తెరిపిడికి (అన్బ్లాక్) అలాగే చర్మరంధ్రాలకు కొత్త అడ్డంకులు నివారించడానికి చికిత్సగా ఉపయోగిస్తారు.
- రెటినోయిడ్ (Retinoid) మరియు బెంజోయిల్ పెరాక్సైడ్ కలయిక చికిత్సను కూడా ఉపయోగించవచ్చు.
కొన్ని స్వీయ రక్షణ చిట్కాలు:
- తేలికపాటి 'సబ్బు రహిత' ద్రవరూప ముఖ ప్రక్షాళన్లతో (with liquid face cleansers) ప్రతిరోజూ రెండుసార్లు మొఖాన్ని శుభ్రపరుచుకోండి.
- లోతైన శుభ్రాలకు వాడే (గఱుకుగా ఉండే అబ్రాసివ్స్) కఠిన పదార్థాలు మరియు మద్యం లేని ముఖం ప్రక్షాళనను ఎంచుకోండి.
- మీరుపయోగించే ముఖ ప్రక్షాళన క్రీము యొక్క pH బాగా సమతుల్యంగా ఉండాలి.
- మీరుపయోగించే ప్రోడక్ట్ చర్మంలో చిన్న చిన్న రంధ్రాలను పూడ్చకుండా ఉండేదయ్యేట్లు చూసుకోండి. ప్రయత్నించి-పరీక్షింపబడిన (tried and tested) ప్రోడక్ట్ నే వాడండి.