నులిపురుగుల అంటువ్యాధి (పిన్వార్మ్ ఇన్ఫెక్షన్) అంటే ఏమిటి?
నులిపురుగులు పరాన్నజీవులు. నులిపురుగులు మానవుడి పేగుల్లో లేదా పురీషనాళంలో నివసించగలవు. ఈ పురుగుల్ని ‘పిన్వార్మ్స్’ అని,’ థ్రెడ్వార్మ్స్’ అని ఆంగ్లంలో పిలువబడతాయి. వైద్యపరంగా,నులిపురుగులు సంక్రమణాన్ని ‘ఎంటెరోబియాసిస్’ గా సూచిస్తారు. ఈ పురుగులు మానవ శరీరాన్ని తమ మనుగడకు మరియు సంతానోత్పత్తికి ఉపయోగించుకుంటాయి కాని ఇతర జంతువులకు రోగమంతించి బాధించలేవు. వ్యక్తి నులిపురుగులతో అంటు (infection) సోకిన తర్వాత ఈ పురుగులు ప్రేగులలో పరిపక్వం (mature) చెందుతాయి మరియు తరువాత పునరుత్పత్తి కొరకు పురీషనాళం ప్రాంతంలో గుడ్లు పెడతాయి.
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
నులిపురుగులతో కూడిన సంక్రమణ లేదా అంటువ్యాధికి సంబంధించిన అత్యంత సాధారణ లక్షణాలు:
- పురీషనాళం దురద.
- ఈ దురద కారణంగా నిద్ర ఆటంకాలు.
- తేలికపాటి వికారం.
- ఆకలి తగ్గిపోతుంది.
- పునరావృతమయ్యే కడుపు నొప్పి.
- బరువు నష్టం.
- చిరాకు, మంట.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
నులిపురుగుల అంటువ్యాధి సూక్ష్మమైన ఈపురుగు గుడ్లుతో కూడిన అంటు (contact) ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ పురుగు గుడ్లు కంటితో చూడలేని చిన్నవిగా ఉంటాయి. అంటువ్యాధి సోకిన వ్యక్తి పరిశుభ్రతలోపం కారణంగా, ఆ వ్యక్తి ఆసన ప్రాంతం నుండి గుడ్లు ఇతర ఉపరితల ప్రదేశాలకు బదిలీ చేయబడవచ్చు, అప్పుడు ఇతరులు ఆ ఉపరితల ప్రదేశాలని తాకినపుడు అక్కడున్న నులిపురుగు గుడ్లు అంటుకోవచ్చు. ఈ నులిపురుగులతో కూడిన అంటు సోకిన తర్వాత నోటిలో వేళ్లు పెట్టుకోవడంద్వారా నులిపురుగు గుడ్లు కడుపులోకి చేరి సంక్రమణ సంభవిస్తుంది.
నులిపురుగు గుడ్లు ఈ అంటువ్యాధి సోకిన వ్యక్తి యొక్క వ్యక్తిగతవస్తువులపై కనుక్కోవచ్చు.
అరుదైన సందర్భాల్లో, నులిపురుగు గుడ్లుతో కూడిన గాలిని వ్యక్తి శ్వాస ద్వారా పీల్చుకోవడం ద్వారా ఈ అంటువ్యాధిని శోకించుకునే అవకాశం ఉంది.
నులిపురుగు అంటువ్యాధిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
కొన్ని సందర్భాల్లో, అంటువ్యాధి సోకిన వ్యక్తి యొక్క లోదుస్తుల మీద నులిపురుగుల్ని సులభంగా చూడవచ్చు. ఆడ నులిపురుగు రాత్రిపూటనే గుడ్లు పెడుతుందిగనుక ఈ నులిపురుగుల్ని వ్యక్తి యొక్క లోదుస్తులు లేదా టాయిలెట్ లో చేసే అవకాశాలు ఎక్కువ. నులిపురుగులు తెలుపు రంగులో ఉండి దారాల్లాగా కనిపిస్తాయి.
డాక్టర్ వ్యక్తి పురీషనాళం ప్రాంతంలోని తేమను సూక్ష్మదర్శిని క్రింద పరిశీలించేందుకు పత్తిమూట (cotton swab) నమూనాను ఉపయోగించి తీసుకుంటారు.
టేప్ పరీక్షలో, శుభ్రమైన ఓ టేపును ఉపయోగించి పురీషనాళం ప్రాంతం నుండి నమూనాను సేకరిస్తారు, అటుపై సేకరించిన నమూనాను సూక్ష్మదర్శిని క్రింద నులిపురుగులు గుడ్లను గుర్తించడానికి ఉపయోగించవచ్చు.
నులిపురుగులు అంటువ్యాధిని వదిలించుకోవడానికి వివిధ మందుల్ని చికిత్సలో ఉపయోగిస్తారు. ఈ మందులు కింది విధంగా పని చేస్తాయి:
- నులిపురుగుకు దాని మనుగడ కోసం గ్లూకోజ్ను గ్రహించేశక్తిని లేకుండా నిరోధించడం.
- పురుగులను పక్షవాతానికి గురిచేయడం.
సంక్రమణ వ్యాప్తిని నివారించడానికి మీ చేతుల్ని శుభ్రంగా ఉంచుకుని సరైన శరీర పరిశుభ్రతను పాటించండి.