పాయిజన్ ఐవీ, ఓక్ మరియు సుమాక్ అలెర్జీలు అంటే ఏమిటి?
పాయిజన్ ఐవీ, ఓక్ మరియు సుమాక్ జాతి మొక్కల (వృక్షాల్లో) అన్ని భాగాల్లోను అనగా ఆకులు, వేర్లు (మూలాలు), మరియు కాండాల్లో ‘ఉరుషియోల్’ అని పిలువబడే ఒక పదార్ధం ఉంటుంది. ఈ మొక్కలు లేదా వాటి భాగాలతో నేరుగా లేదా పరోక్ష స్పర్శ కారణంగా ఏర్పడిన చర్మం యొక్క అలెర్జీ ప్రతిస్పందనల్నే “పాయిజన్ ఐవీ, ఓక్ మరియు సుమాక్ ల దుష్ప్రభావాలు” అని పిలుస్తారు. చనిపోయిన మొక్క కూడా దుష్ప్రభావాన్ని (allergy) కలిగించ గలదు. ‘ఉరుషియోల్తో అంటు (contact) సోకిన తరువాత కొన్ని గంటల నుండి ఐదు రోజుల లోపల ఉరుషియోల్ దుష్ప్రభావం యొక్క ప్రతిస్పందన కనబడుతుంది.
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
దీని సంకేతాలు మరియు లక్షణాలు ఇతర చర్మ అలెర్జీలతో సరిసమానంగా ఉంటాయి మరియు క్రింది లక్షణాల్ని కలిగి ఉంటాయి:
- అలెర్జీకి బహిర్గతమైన శరీర భాగంపైన దురద.
- వాపు.
- శ్వాసలో సమస్య.
- మింగడం లో కఠినత.
- చిన్న లేదా పెద్ద బొబ్బల కారణంగా ఎర్రటి బొబ్బలు వస్తాయి.
- చర్మం ఎరుపుదేలుతుంది.
- ఎర్రని దద్దుర్లు.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
పేర్కొన్న మొక్కలతో ప్రత్యక్షంగా లేదా పరోక్ష స్పర్శ (అంటు) కారణంగా ఈ దుష్ప్రభావాలు (అలెర్జీలు) సంభవించవచ్చు. ప్రత్యక్ష స్పర్శలో మొక్క లేదా మొక్క భాగాలు చర్మానికి సోకడం జరుగుతుంది. పరోక్ష స్పర్శలో ఇంతకుముందు ఈ మొక్కతో సంబంధం ఉన్న లేదా పేర్కొన్న మొక్కల్ని తాకిన వస్తువులను తాకడం, ముట్టుకోవడం, స్పర్శించడం కలిగి ఉంటుంది, ఉదా. క్యాంపింగ్ పదార్థాలు, గార్డెనింగ్ ఉపకరణాలు మరియు జంతువుల బొచ్చు కూడా కావచ్చు.
పేర్కొన్న మొక్కలు లేదా మొక్కల భాగాలు కాలుతున్నపుడు ఉరిశియోల్ (urushiol) ను పీల్చడంవల్ల నాశికాద్వారాలు (ముక్కుపుటాలు), ఊపిరితిత్తులు, మరియు గొంతు దెబ్బ తినొచ్చు
దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
చర్మవ్యాధి నిపుణుడు ఈ మొక్కల దుష్ప్రభావంవల్ల దెబ్బతిన్న చర్మం భాగాలను భౌతిక పరీక్ష చేసి ఈ అలెర్జీ ప్రతిచర్యను నిర్ధారిస్తారు, అటుపై చికిత్స ప్రారంభిస్తారు. యాంటిబయోటిక్స్ మరియు ప్రిడ్నిసోన్ వంటి ప్రిస్క్రిప్షన్ మందులు సూచించబడ్డాయి. అలెర్జీ సోకిన భాగాల్లో పూతకోసం స్టెరాయిడ్ క్రీమ్లు సూచించబడతాయి. అలెర్జీ దద్దురు పైన సంభవించే అంటువ్యాధుల్ని నివారించడానికి మరియు నిర్వహించడానికి యాంటీబయాటిక్స్ ఇవ్వబడతాయి.
ఈ దుష్ప్రభావాల (అలెర్జీలు)ను కిందివాటి ద్వారా నివారించవచ్చు:
- మీ శరీరాన్ని పూర్తిగా కప్పే ఫుల్ స్లీవ్ చొక్కాలు మరియు పొడవాటి ప్యాంటు వంటి దుస్తులను ధరించడం.
- మీ తోటలో గనుక పేర్కొన్న మొక్కలు లేక వృక్షాలు పెరుగుతుంటే వాటిని తొలగించడం.
- పేర్కొన్న మొక్కల్ని లేదా వాటి భాగాలతో స్పర్శ ఏర్పడ్డప్పుడు, స్పర్శ తగిలిన మన చర్మం ఉపరితలాన్ని పూర్తి కడగడం మరియు బట్టల్ని బాగా ఉతకడం.
- దద్దుర్లు వచ్చే ప్రమాదాన్ని తగ్గించేందుకు చర్మ సారాంశాలు (skin creams) మరియు లోషన్లను వాడడం.