పాలిమయోసైటిస్ అంటే ఏమిటి?
పాలిమయోసైటిస్ అనేది అరుదైన వాపును కలిగించే పరిస్థితుల సమూహం, కండరాలపై ప్రభావం చూపుతుంది కండరాల మరియు వాటితో ముడిపడి ఉండే ఉన్న కణజాలాలు రక్త నాళాలు వంటివాటి, బలహీనతకు దారితీస్తుంది. ఇది తుంటి భాగం, తొడలు మరియు భుజాల వంటి పలు కండరాలను ప్రభావితం చేస్తుంది. ఇది అన్ని వయస్సుల వారిని ప్రభావితం చేస్తుంది అయితే, 30 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సులో ఉన్న స్త్రీలలో దీనిని ఎక్కువగా గమనించవచ్చు.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
ఈ క్రింది లక్షణాలను కొన్ని వారాలు లేదా నెలల్లో గమనించవచ్చు:
- కండరాలు బలహీనపడటం
- శరీరలోని ప్రభావిత భాగాలలో నొప్పి మరియు సున్నితత్వం (తాకితేనే నొప్పి కలగడం)
- మోకాలు చాపడంలో కఠినత
- మేడ మెట్లు ఎక్కడం మరియు దిగడంలో సమస్య
- ఏవైనా బరువులు పైకి ఎత్తడంలో కఠినత
- పైకి ఉన్న అరల/అటక మీద ఏవైనా వస్తువులు పెట్టడంలో సమస్య
- పడుకుని ఉన్నపుడు తల పైకి ఎత్తడంలో సమస్య
- శ్వాస తీసుకోవడం మరియు మ్రింగుటలో సమస్యలు
- ఆర్థరైటిస్
- అలసట
- క్రమములో లేని (అరిథమిక్ ) హృదయ స్పందనలు (Arrhythmic heartbeats)
దీని ప్రధాన కారణం ఏమిటి?
పాలిమయోసైటిస్ యొక్క ఖచ్చితమైన కారణం ఇంకా తెలియదు, కానీ ఈ క్రింది పరిస్థితులతో ముడిపడి ఉన్నట్లు గుర్తించబడింది, అవి ఈ సమస్య సంభవించడానికి కారణం కావచ్చు:
- ఆటో ఇమ్యూన్ వ్యాధి
- వంశపారంపర్యంగా
- హ్యూమన్ ఇమ్మ్యూనోడెఫిషియన్సీ వైరస్ (హెచ్.ఐ.వి) / అక్వైర్డ్ ఇమ్మ్యూనోడెఫిషియన్సీ సిండ్రోమ్ (ఎయిడ్స్) వంటి వైరల్ ఇన్ఫెక్షన్లు
- రోగనిరోధక వ్యవస్థ యొక్క సమస్యలు
- శ్వాసను ప్రభావితం చేసే వ్యాధులు
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
పాలిమయోసైటిస్ యొక్క లక్షణాలను చూపించే వ్యక్తులలో రోగ నిర్దారణ కోసం వైద్యులు ఈ క్రింది పరీక్షలను ఆదేశిస్తారు:
- రక్త పరీక్ష: ఆల్డోలేస్ (aldolase) స్థాయిలు మరియు క్రియాటిన్ కైనేస్ (creatine kinase) స్థాయిలు వంటి వివిధ ఎంజైమ్ల స్థాయిలను గుర్తించడంలో ఇది సహాయపడుతుంది. రోగనిరోధక వ్యవస్థ యొక్క వ్యాధుల కారణంగా ఏర్పడే యాంటీబాడీల ఉనికిని గుర్తించడానికి కూడా ఇది సహాయపడుతుంది.
- కండరములు మరియు నరములు యొక్క ఆరోగ్యాన్ని పరిశీలించడానికి ఎలెక్ట్రోమయోగ్రఫీ (Electromyography).
- కండరాలను క్షుణ్ణంగా పరిశీలించడానికి మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ మరియు ఆల్ట్రాసౌండ్ ఇమేజింగ్ వంటి ఇమేజింగ్ పరీక్షలు.
- కండరాల సంక్రమణను మరియు నష్టాన్ని నిర్దారించడానికి కండరాల జీవాణు పరీక్ష (బయాప్సీ).
చికిత్స లక్షణాల నిర్వహణలో ఉంటుంది:
- కండరాలను బలోపేతం చేయడానికి మరియు కండరాల వంగే గుణాన్ని (flexibility) మెరుగుపర్చడానికి భౌతిక చికిత్స (Physical therapy).
- మ్రింగడంలో కఠినతను మరియు మాట్లాడడంలో ఇబ్బందులను నిర్వహించడానికి స్పీచ్ థెరపీ (Speech therapy).
- ఇమ్యునోసప్రెస్సంట్లు (immunosuppressants) మరియు కోర్టికోస్టెరాయిడ్స్ (corticosteroids) వంటి మందులు.
- ఆటో-యాంటీబాడీలను (auto-antibodies) చంపడానికి ఇంట్రావెనస్ ఇమ్యునోగ్లోబులిన్ (Intravenous immunoglobulin).