జ్ఞాపకశక్తి తగ్గిపోవడం అంటే ఏమిటి?
సమాచారాన్ని భద్రపరచడం మరియు గుర్తుచేసుకోవడంలో మెదడు సమస్యను ఎదుర్కుంటుంటే దానిని జ్ఞాపక తగ్గిపోవడం అని అంటారు. వ్యక్తి అప్పుడప్పుడు తాళం చెవుల యొక్క స్థానాన్ని లేదా బిల్లులను చెల్లించారా లేదా అనే దానిని మరచిపోవటం సాధారణం. ఒక వ్యక్తికి తన జీవితమంతా ఉండే సంపూర్ణ (పూర్తి) జ్ఞాపకాలు సహజంగానే గుర్తు ఉండవు. వయస్సు-సంబంధ జ్ఞాపకశక్తి నష్టం సాధారణం. కానీ ఒక వ్యక్తి తన వాహనం నడిపే సామర్థ్యం, తను చాలా కాలం ఉన్న ఇంటికి వెళ్ళే దారి వంటి మొదలైన విషయాలు మర్చిపోతే, వైద్యులని వెంటనే సంప్రదించాలి ఎందుకంటే అటువంటి జ్ఞాపక శక్తి తగ్గుదల అంతర్లీన అనారోగ్యాన్ని సూచిస్తుంది.
దాని ప్రధాన సంబంధిత సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
వయసు పెరగడంతో (వృద్ధాప్యంతో) పాటు జ్ఞాపక శక్తి తగ్గిపోవడం అనేది ఒక సాధారణ విషయం, కానీ ఈ క్రింద ఉన్న సంకేతాలు మరియు లక్షణాలు అంతర్లీన మేధాశక్తి వ్యాధి యొక్క ఉనికిని సూచిస్తాయి:
- ఒకే ప్రశ్నను మళ్ళి మళ్ళి అడగడం.
- సూచనలును పాటించడంలో సమస్య.
- తెలిసిన వ్యక్తులు మరియు ప్రదేశాలు గురించి గందరగోళానికి గురికావడం.
- బాగా తెలిసిన ప్రదేశానికి/చోటుకి కూడా దారిని మర్చిపోవడం.
- సాధారణ సంభాషణను సాగించడంలో కూడా సమస్య ఎదుర్కోవడం.
- చాలా ముఖ్యమైన సమావేశాలు మరియు వ్యవహారాలకు హాజరు కావడం/ వెళ్లడం మర్చిపోవడం.
- అదే వయస్సులో ఉన్న ఇతర వ్యక్తులతో పోలిస్తే ఎక్కువ జ్ఞాపకశక్తి సమస్యలను ఎదుర్కోవడం.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
జ్ఞాపకశక్తి తగ్గిపోవడానికి కారణాలు ఈ క్రింది విధంగా ఉంటాయి:
- వయసు పెరగడం (వృద్ధాప్యం), ఇది సాధారణమైనది.
- అల్జీమర్స్ వ్యాధి మరియు ఇతర రకాల చిత్తవైకల్యం.
- స్ట్రోక్.
- మెదడులో కణితులు.
- కుంగుబాటు (డిప్రెషన్).
- తలకు గాయాలు కావడం.
- యాంటీ యాంజైటీ (antianxiety) మందులు, యాంటీడిప్రస్సంట్స్ (antidepressants), యాంటిసిజ్యూర్ (antiseizure) మందులు, కొలెస్ట్రాల్-తగ్గించే మందులు వంటి కొన్ని రకాల మందులు.
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
రోగనిర్ధారణలో జ్ఞాపక శక్తి తగ్గిపోవడం వెనుక ఉన్న కారణాన్ని గుర్తించడం జరుగుతుంది. సూచించబడే నిర్దారణ పరీక్షలు:
- ఆరోగ్య చరిత్ర తీసుకోవడం.
- శారీరక పరిక్ష.
- ప్రయోగశాల పరీక్షలు.
- సైకియాట్రిక్ ఎవాల్యూయేషన్ పరీక్షలను (psychiatric evaluation tests) ఉపయోగించి ఆలోచనలలో మార్పులను గుర్తించడం.
- మెదడు యొక్క ఎక్స్- రే, సిటి (CT) స్కాన్ మరియు ఎంఆర్ఐ (MRI).
ఈ పరీక్షలు జ్ఞాపక శక్తి తగ్గిపోవడం అనేది వృద్ధాప్యం వల్లనా లేదా కొన్ని అంతర్లీన రోగాల ఫలితంగానా అనే విషయాన్ని నిర్ధారించడానికి సహాయం చేస్తాయి.
చికిత్స పూర్తిగా జ్ఞాపకశక్తి తగ్గిపోవడానికి గల కారణం మీద ఆధారాపడి ఉంటుంది. చాల వరకు చిత్తవైకల్యాలకు ఎటువంటి నివారణ కలిగి ఉండదు మరియు దోనిపెజైల్ (donepezil), రివాస్టీగ్మైన్ (rivastigmine), మెమంటైన్ (memantine) మరియు గేలంటమైన్ (galantamine) వంటి మందులు తాత్కాలికంగా లక్షణాల ఉపశమనము కోసం సూచించబడతాయి.
ఆలోచనా సామర్థ్యాన్ని ప్రోత్సహించే/ప్రేరేపించే నాన్-డ్రగ్ థెరపీలు (మందులు లేని చికిత్సలు) కూడా ఉపయోగకరంగా ఉంటాయి. ఈ చికిత్సలు ఎక్కువగా సమూహ చికిత్స (group therapy) మరియు మెదడుకు చిక్కుప్రశ్నలు వేసే ఆటలను (brain-teaser games) కలిగి ఉంటాయి.