ప్రోటీన్ లోపం అంటే ఏమిటి?
ప్రోటీన్ (మాంసకృతులు) మానవ శరీరం యొక్క నిర్మాణానికి ఉపకరించే ఇటుకదిమ్మల (బిల్డింగ్ బ్లాక్స్) వంటివి. మాంసకృత్తుల లోపం అనేది చాలా సాధారణ రుగ్మత, ముఖ్యంగా శాఖాహారులకు ఇది సంభవిస్తుంది. లక్షలాదిమంది పెద్దలు మరియు పిల్లలు వారి రోజువారీ ఆహారంలో తగినంతగా మాంసకృత్తులు (ప్రోటీన్లు) తీసుకోకపోవడంవల్ల ఈ మాంసకృత్తుల లోపం రుగ్మతతో బాధపడుతున్నారని ఓ అంచనా. క్వాషియోర్కర్ (Kwashiorkor) అనేది ప్రోటీన్ లోపం యొక్క తీవ్రమైన రుగ్మతరకం మరియు పిల్లల్లో ఇది చాలా సాధారణం.
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
హార్మోన్లు మరియు ఎంజైముల ఉత్పత్తికి మరియు కణజాలం నిర్మాణం కోసం మానవ శరీరానికి అవసరమైన అతి ముఖ్యమైన పోషకాలలో మాంసకృత్తులు (ప్రోటీన్లు) ఒకటి. మాంసకృత్తులు లేకపోవడంవల్ల శిశువులు మరియు పిల్లల్లో పెరుగుదల కుంటుపడుతుంది. ఈ రుగ్మతకు సంబంధించిన కొన్ని సాధారణ చిహ్నాలు మరియు లక్షణాలు:
- చర్మం కింద ద్రవం జమైపోయి వ్యక్తి వాపుదేలినట్లు లేదా ఉబ్బినట్లు కనబడేట్టు చేస్తుంది. ఇది ఈ రుగ్మత యొక్క ‘క్వాశియోర్కర్’ (kwashiorkor) రకం యొక్క నిర్దిష్ట సంకేతం.
- అవసరమైన మాంసకృత్తుల్ని ఆహారంలో తీసుకోకపోవడం కూడా శరీరంలో కొవ్వు రవాణాకు ఉపయోగపడే లిపోప్రొటీన్ల ఉత్పత్తి పడిపోవడానికి కారణమవుతుంది. ఇటువంటి పరిస్థితి ఊబకాయానికి దారి తీస్తుంది, మరియు తరచుగా కొవ్వు కాలేయంలో జమవడానికి దారితీస్తుంది, దీనివల్ల తీవ్రమైన దశల్లో, కాలేయ వైఫల్యం సంభవిస్తుంది.
- ప్రోటీన్లు చర్మం, జుట్టు మరియు గోళ్ళ నిర్మాణంలో అంతర్భాగమైనవి. మాంసకృత్తుల లోపం జుట్టు నష్టం మరియు చర్మం పొడిబారి పొలుసులు తేలడానికి కారణం కావచ్చు. గోళ్లు తెల్లబడటం లేదా గోళ్ళపై చీలికలు (ఎగుడు దిగుడు చాళ్ల లాగా) ఏర్పడడం కూడా మాంసకృత్తుల (ప్రోటీన్) లోపాన్ని సూచిస్తాయి.
- అలసట.
- కండరాల నొప్పి మరియు కీళ్ళ నొప్పి.
- కండరాల వృధా.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
మాంసకృత్తుల లోపం అనేది అసమతుల్య ఆహారం నుండి లేదా శరీరంలోని కొన్ని రుగ్మతల వలన ప్రోటీన్ యొక్క తగినంత తీసుకోవడం వలన కావచ్చు, ఇది ప్రోటీన్లను సరిగా సంశ్లేషణ లేదా సరిగా వినియోగించకపోవచ్చు.మాంసకృత్తుల లోపంలేదా హైపోప్రోటీనెమియా ప్రధాన కారణాలు క్రింద ఇవ్వబడ్డాయి:
- పోషకాహారలోపం
అభివృద్ధి చెందుతున్న దేశాలు లేదా అభివృద్ధి చెందని దేశాలలో మాంసకృత్తుల లోపం యొక్క ముఖ్య కారణం పోషకాహార లోపం. ఈ దేశాల్లో వ్యక్తులు తీసుకునే ఆహారం శరీరానికి కావాల్సిన మాంసకృత్తుల్ని కల్గి ఉండడం లేదని నివేదించబడింది. - మూత్రపిండాలు పనిచేయకపోవడం
మూత్రపిండాలు పనిచేయకపోవడమనే వ్యాధి కూడా మాంసకృత్తులు శరీరం నుండి మూత్రం ద్వారా విసర్జింపబడటంవల్ల సంభవించేది, దీనివల్ల మూత్రపిండాల యొక్క నెఫ్రోన్లనేవి దెబ్బతింటాయి, తద్వారా మాంసకృత్తుల్ని మూత్రం ద్వారా విసర్జించబడటాన్ని నిరోధించడంలో ఇవి విఫలమవుతాయి. - అంతర్లీన వైద్య పరిస్థితులు
అల్సీరేటివ్ కొలైటిస్ లేదా క్రోన్స్ వ్యాధి వంటి ఇన్ఫ్లమేటరీ బౌల్ వ్యాధుల వల్ల ప్రేగులు దెబ్బతినడం, దానివల్ల ప్రోటీన్ల శోషణ జరక్కపోవడం జరుగుతుంది.
దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
వ్యక్తిలో లోమాంసకృత్తుల లోపంయొక్క సంకేతాలను చూసినప్పుడు, వైద్యుడు శరీరంలో ప్రోటీన్ స్థాయిని అంచనా వేయడానికి రక్త పరీక్షను చేయవచ్చు, కాలేయం మరియు మూత్రపిండాల పనితీరు పరీక్షలను కూడా చేయించవచ్చు.
శరీరానికి అవసరమైన ప్రోటీన్లను తిరిగి పొందడానికి సమతుల్య ఆహారం తీసుకోవడమనేది మొదటి దశలోనే చేయాల్సిన చర్యల్లో ఒకటి. వ్యక్తి యొక్క బరువు మరియు పరిస్థితి యొక్క తీవ్రత ప్రకారం ఒక ఆహారం పట్టిక (చార్ట్) తయారు చేయబడుతుంది. ఈ పట్టికలో రోజువారీగా వ్యక్తి తినడానికి అవసరమైన ఆహారపదార్థాలను జాబితా లెక్కన సూచిస్తుంది. ఎరుపు మాంసం మాంసాహారులకు లభించే మాంసకృత్తుల (ప్రోటీన్) యొక్క గొప్ప మూలం. శాకాహారులకు గింజలు, ఎండు గింజలు, సోయా, కాయధాన్యాలు మరియు బీన్స్ వంటివి వారి శాకాహార ఆహారంలో చేర్చబడతాయి. రుగ్మతయొక్క తీవ్రమైన కేసులకు కొన్ని అనుబంధకాహారాలు మరియు మందులు కూడా సూచించబడతాయి.
ఒక అంతర్లీన వ్యాధి మాంసకృత్తుల లోపానికి కారణమైన సందర్భాలలో, ప్రోటీన్ల భర్తీతో పాటు ఆ వ్యాధిని సరిచేయడం అనేది చికిత్స ఎంపికలో భాగమే.