సీటకోసిస్ ఏమిటి?
సీటకోసిస్ లేదా చిలుక జ్వరం అనేది క్లమీడియా సిట్టసి (chlamydia psittaci) అనే బ్యాక్టీరియా వలన సంభవించే ఒక రకమైన సంక్రమణ/ఇన్ఫెక్షన్. ఈ బాక్టీరియా పక్షులు, ముఖ్యంగా చిలుకలు, కోళ్లు, టర్కీ కోళ్లు, రామ చిలుకలు, పావురాలు, కోకటైల్ (cockatiel) చిలుకలు మరియు ఇతర ఎగిరే పక్షులుకు సోకుతుంది/ సంక్రమిస్తుంది. వ్యాధి సోకిన పక్షితో మానవులు సాన్నిహిత్యంలోకి వచ్చినట్లైతే మానవులకు కూడా ఈ సంక్రమణ వ్యాపిస్తుంది.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
కొంతమంది సంక్రమణ సోకిన వ్యక్తులు ఏటువంటి సంకేతాలు లేదా లక్షణాలను చూపించకపోవచ్చు; అయినప్పటికీ, ఇంక్యూబేషన్ (incubation) సమయం తర్వాత, కనిపించే సాధారణ లక్షణాలు:
- జ్వరం మరియు ఫ్లూ వంటి లక్షణాలతో కూడిన చలి
- వికారం మరియు వాంతులు
- అతిసారం
- అలసట మరియు బలహీనత
- జాయింట్ల మరియు కండరాల నొప్పి
సీటకోసిస్ సాధారణంగా ఫ్లూ వంటి లక్షణాలను కలిగిస్తుంది, కానీ ఈ లక్షణాలు, పైన పేర్కొన్న ఏవైనా పక్షులకు బహిర్గతం అయిన 9-15 రోజుల్లో ప్రారంభమవుతాయని గుర్తుంచుకోవాలి.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
ప్రధానమైన, లేదా ప్రత్యేక కారణం ఏమిటంటే, ఎవరికైనా సీటకోసిస్ సంభవించిందంటే దానికి కారణం వ్యాధి సోకిన లేదా జబ్బుపడిన పక్షితో సంబంధం కలిగి (పక్షిని తాకడం లేదా ఎక్కువ సమయం దానితో గడపడం వంటివి) ఉండడం. ఒక పక్షికి క్లమిడియా సిట్టసి సోకినట్లయితే, దానిలో ఈ సంకేతాలను గమనించవచ్చు:
- దాని కళ్ళు మరియు ముక్కు నుండి స్రవాలు కారడం.
- నీరసంగా ఉంటుంది, నిద్రపోదు.
- తక్కువ తింటుంది లేదా పూర్తిగా తినడం నిలిపివేస్తుంది.
- రంగు మారిపోయిన (వివిధ ఆకుపచ్చ రంగులలో) మూత్రం లేదా మలం.
- విరేచనాలు.
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
సీటకోసిస్ నిర్ధారణ అంత సాధారణమైనది కాదు, మరియు ప్రభావిత వ్యక్తి సంక్రమణ సోకిన పక్షితో తన ఇటీవలి సంబంధం గురించి వైద్యులకి చెప్పడం అవసరం. సీటకోసిస్ నిర్ధారణకు జరిపే పరీక్షలు సాధారణ రక్త పరీక్షలు మరియు సూక్ష్మజీవుల కోసం కఫ సాగు వంటివి.
బాక్టీరియాకు వ్యతిరేకంగా శరీరం ఉత్పత్తి చేసిన యాంటీబాడీల ఉనికిని గుర్తించి వ్యాధిని నిర్ధారించేందుకు యాంటీబాడీ టైటర్ పరీక్ష(antibody titre test) కూడా ఆదేశించబడుతుంది. రోగనిరోధక వ్యవస్థ శరీరంలో బాక్టీరియా వంటి ఒక విదేశీ పదార్ధాన్ని (యాంటిజెన్) గుర్తించినప్పుడు యాంటీబాడీలను ఉత్పత్తి చేయడం మొదలుపెడుతుంది. మానవ శరీరంలోని యాంటీబాడీ యొక్క రకం మరియు దాని స్థాయిలలో మార్పులు కూడా సీటకోసిస్ యొక్క నిర్ధారణను ధృవీకరిస్తాయి.
డోక్సీసైక్లిన్ (doxycycline) మరియు టెట్రాసైక్లైన్ (tetracycline) వంటి యాంటీబయాటిక్స్ తో చికిత్స ఉంటుంది, ఇవి రెండు సీటకోసిస్ చికిత్సకు ఉపయోగించే సాధారణ మందులు. జ్వరము తగ్గిపోయిన తరువాత కూడా యాంటీబయాటిక్ కోర్సు చాలా కాలం వరకు కొనసాగుతుంది. నయం కావడానికి చాలా కాలం పడుతుంది కానీ పూర్తిగా నయం అవుతుంది.