పల్మనరీ హైపర్టెన్షన్ అంటే ఏమిటి?
రక్తనాళాలు మందమై ఇరుకుగా మారడం వలన ఊపిరితిత్తుల ధమనులలో (ఆర్టరిలలో) రక్తపోటు పెరిగిపోయే పరిస్థితిని పల్మోనరీ హైపెర్టెన్షన్ అని అంటారు. అందుచేత, ఊపిరితిత్తులకు మరియు శరీర మిగిలిన భాగాలకు కావలసినంత రక్తాన్ని గుండె సరఫరా చెయ్యడం కష్టం అవుతుంది. గుండె నిరంతరాయంగా రక్తాన్ని గట్టిగా/కఠినంగా సరఫరా చేస్తుంటే, అది చివరకు బలహీనంగా మారిపోతుంది మరియు చివరికి గుండె వైఫల్యానికి దారితీస్తుంది.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
పల్మోనరీ హైపర్టెన్షన్తో బాధపడుతున్న వ్యక్తి సాధారణంగా అలసటను అనుభవిస్తాడు మరియు పెద్ద (శ్రమతో కూడిన) పనులు లేదా వ్యాయామాలను చేయడంలో ఇబ్బందులు ఎదుర్కుంటాడు. ఈ పరిస్థితి యొక్క అత్యవసర శ్రద్ధ అవసరమైన ఇతర సంకేతాలు మరియు లక్షణాలు:
- స్థిరమైన తక్కువ/అల్ప రక్తపోటు.
- ఛాతీ ప్రాంతంలో ఒత్తిడి అనుభూతి.
- దీర్ఘకాలిక దగ్గు.
- ఊపిరి ఆడకపోవడం మరియు గుండె స్పందన రేటు మారుతూ ఉండడం.
- కాళ్ళు, చీలమండలు, పాదములు లేదా ఉదరం యొక్క వాపు.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
పల్మనరీ హైపర్టెన్షన్ అభివృద్ధి చెందడానికి ప్రధాన కారణము ఊపిరితిత్తులకు సంభందించిన ఆర్టరీల యొక్క గోడలు గట్టిపడటం/మందం అవ్వడం, ఇది రక్తం ప్రవహించే దారిని సన్నగా చేస్తుంది మరియు రక్త ప్రసరణను కష్టతరం చేస్తుంది, ఫలితంగా పల్మనరీ ఆర్టరీల మీద రక్త(పోటు) ఒత్తిడి పెరుగుతుంది. పల్మోనరీ హైపర్ టెన్షన్ను కలిగించే ఇతర పరిస్థితులు/కారణాలు:
- గుండె కవాట (వాల్వ్) లోపాలు, అయోర్టిక్ స్టెనోసిస్ (aortic stenosis) మరియు ఇతర పరిస్థితుల వంటి గుండె జబ్బులు.
- క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ వ్యాధి మరియు వీనస్ (సిరల/నరముల) ఒక్స్నుషన్ (occlusion, సిరల దారి మూసుకుపోవడం) లేదా నిరోధం (obstruction) కలిగించే వ్యాధులు వంటి ఊపిరితిత్తుల వ్యాధులు.
- హెచ్ఐవి (HIV) సంక్రమణ.
- మందుల దుర్వినియోగం.
- థైరాయిడ్ గ్రంధి రుగ్మత.
- స్క్లెరోడెర్మా (ఒక రకమైన ఆటోఇమ్యూన్ చర్మ వ్యాధి)
- ఊపిరితిత్తుల ధమనులను (ఆర్టరీలను) అడ్డుకునే రక్త గడ్డలు లేదా కణితులు.
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
వైద్యులు భౌతిక పరీక్షను నిర్వహిస్తారు, ముఖ్యంగా గుండె మరియు ఊపిరితిత్తులకు. కుటుంబ చరిత్ర మరియు ఔషధ చరిత్ర సహా వ్యక్తి యొక్క ఆరోగ్య చరిత్రను తెలుసుకుంటారు. భౌతిక పరీక్షలో పల్మనరీ హైపర్టెన్షన్ అనుమానం కలిగినట్లయితే, వైద్యులు మరింత ఖచ్చితమైన పరీక్షలను సూచించవచ్చు, అవి ఈ కింది విధంగా ఉంటాయి:
- ఛాతీ ఎక్స్-రే.
- 2డి ఎకోకార్డియోగ్రామ్ (2D Echocardiogram).
- పల్మనరీ ఆర్టరీలలో రక్తపోటు కొలిచేందుకు కుడి గుండె కాథెటర్రైజేషన్ (Right heart catheterisation).
- గుండె యొక్క లయ మరియు పనితీరును తనిఖీ చేసేందుకు ఒక ఎలెక్ట్రొకార్డియోగ్రామ్ (ECG, electrocardiogram) కూడా సూచించబడుతుంది.
- ఈ పరిస్థితికి కారణం అయ్యే చేసే ఇతర సమస్యలను గుర్తించేందుకు రక్త పరీక్షలు.
ప్రారంభ దశలలోనే నిర్ధారణ అయినప్పుడు, మందులు అందుబాటులో ఉన్నాయి, అవి ఇది పల్మనరీ ఆర్టరీల యొక్క సంకుచితతను/ఇరుకును పరిష్కరించడానికి లేదా గడ్డలను కరిగించడానికి సహాయపడుతాయి. ప్రారంభ దశలలో ఉపయోగించిన మందులు:
- వార్ఫరిన్ (Warfarin) ను సూచించవచ్చు, ఇది రక్తాన్ని పల్చబరచడానికి సహాయపడుతుంది మరియు గడ్డ నిర్మాణాన్ని నిరోధిస్తుంది.
- డైయూరేటిక్స్ (Diuretics), అవి శరీరంలోని అదనపు ద్రవాలను తొలగిస్తాయి.
- కాల్షియం ఛానల్ బ్లాకర్స్ (Calcium channel blockers), రక్తపోటును నియంత్రిస్తాయి.
- డైగోక్సిన్ (Digoxin) గుండె పనితీరు మెరుగుపరుస్తుంది.
పల్మనరీ హైపర్టెన్షన్ యొక్క చివరి దశలలో, స్టెమ్ సెల్ థెరపీ లేదా ఊపిరితిత్తుల మార్పిడి చేయబడవచ్చు.