చీము పట్టడం అంటే ఏమిటి?
చనిపోయిన కండరకణజాలం, తెల్ల రక్త కణాలు మరియు బ్యాక్టీరియాల కలయికతో కూడినదే “చీము” పట్టిన పరిస్థితి. శరీరంలోకి ప్రవేశించే బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా తెల్ల రక్త కణాలు పోరాటం చేస్తాయి, శరీరంలో ప్రవేశించే బాక్టీరియా సూక్ష్మజీవులు సమీప కండర కణజాల మరణానికి దారితీస్తుంది, అటుపై సూక్ష్మజీవులు చీముతో నిండిన ఒక కుహరాన్ని సృష్టించుకుంటాయి, ఈ కుహరాన్నే “వ్రణం” లేదా “పుండు” అని పిలుస్తారు. శరీరంలోని ఏభాగంలోనైనా లేదా అవయవంలోనైనా చీము పట్టడమనేది లేదా చీముతో కూడిన పుండు సంభవించవచ్చు.
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
చీము పట్టిన భాగాన్ని బట్టి అనుబంధ లక్షణాలు మారవచ్చు. చీముకు సంబంధించిన సాధారణ లక్షణాలు:
- నొప్పి
- జ్వరం (ఫీవర్)
- చలి
- చీము బాధిత భాగంలో గుబ్బదేలడం
- వాపు మరియు మంట
- చీము బాధిత భాగం మీద ఎరుపుదేలి ఉండడం మరియు ఉష్ణతను కల్గి ఉండడం
ప్రభావితమైన భాగాన్ని బట్టి, ఆ కణజాలం లేదా ఆ అవయవ చర్యను దెబ్బతీయవచ్చు.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
చీము పట్టడమనేది క్రింది కారణాలవల్ల సంభవించవచ్చు:
- బ్యాక్టీరియా ఏదోరకంగా చర్మంలోకి ప్రవేశించినపుడు చర్మకురుపులు సంభవించొచ్చు, అటుపై తాపజనక ప్రతిస్పందనను (నొప్పిని, బాధను) కలుగజేయవచ్చు. ప్రారంభించినప్పుడు స్కిన్ గడ్డలు సంభవించవచ్చు. ఇది సాధారణంగా జననాళాలు, చంకలలో, చేతులు మరియు కాళ్ళు, పిరుదులు మరియు ట్రంక్లలో సంభవిస్తుంది. బ్యాక్టీరియా తెగినగాయాలు (కట్స్), గాయాలు (పుండ్లు) లేదా తేలికగా పైచర్మం గాయమైనపుడు ఏర్పడే (grazes) చిన్నగాయాలు లేదా పొక్కుల ద్వారా ప్రవేశించవచ్చు. చమురు లేదా స్వేద గ్రంధిని నిరోధించినట్లయితే చర్మంకురుపుల కారణంగా కూడా చీము పట్టడం సంభవించవచ్చు.
- శస్త్రచికిత్స, గాయం లేదా సంక్రమణం కారణంగా శరీరంలో అంతర్గత చీము అభివృద్ధి చెందుతుంది, ఇది సమీపంలోని కణజాలాల నుండి వ్యాపిస్తుంది.
దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
వైద్యుడు ప్రభావిత ప్రాంతాన్ని పూర్తిగా పరిశీలిస్తాడు మరియు చీము యొక్క కారణాన్ని విశ్లేషించడానికి మరియు సరైన చికిత్సను ఇవ్వడానికి పరీక్షలను సిఫార్సు చేస్తాడు. క్రింది విశ్లేషణ చర్యల్ని వైద్యులు ఉపయోగిస్తారు:
- ఏదైనా సూక్ష్మజీవి (బ్యాక్టీరియల్) దాడికి శరీర స్పందనను తనిఖీ చేయడానికి మరియు సంక్రమణ యొక్క నిర్దిష్ట వివరాలను గుర్తించడానికి రక్త పరీక్షలు
- బయాప్సి పరీక్ష
- మధుమేహం యొక్క చిహ్నమైన గ్లూకోజ్ ఉనికిని తనిఖీ చేయడానికి మూత్ర పరీక్ష
- అంతర్గత వ్రణం ఉన్న వ్యక్తులకు, ఎక్స్-రే తో బాధిత ప్రాంతం యొక్క స్పష్టమైన చిత్రాన్ని పొందాలని వైద్యుడిచే ఆదేశించబడుతుంది
చీముకు చేసే చికిత్స దానికారణం మీద ఆధారపడి ఉంటుంది. చర్మం మీద ఏర్పడే చిన్న కురుపులకు ఎలాంటి చికిత్స అవసరం లేదు. వెచ్చని సంపీడనాలు చిన్న చిన్న చీము కురపులకు ఉపయోగపడతాయి. చీము కారణాన్ని బట్టి క్రింది చికిత్స ఎంపికల్ని డాక్టర్ సిఫారసు చేయవచ్చు:
- సంక్రమణ చికిత్సకు యాంటీబయాటిక్స్
- ఒక కోత ద్వారా చీము పూర్తిగా తొలగించడానికి ఒక పారుదల విధానం
- శస్త్రచికిత్స: అంతర్గత అవయవాల్లో చీము పట్టి ఉంటే దాని చికిత్సకు శస్త్రచికిత్స సిఫార్సు చేయబడుతుంది.