రెస్పిరేటరీ డిప్రెషన్ అంటే ఏమిటి?
రెస్పిరేటరీ డిప్రెషన్ అనేది హైపోవెన్టిలేషన్ (hypoventilation) గా కూడా పిలువబడుతుంది, నెమ్మదైన మరియు అసమర్థమైన శ్వాస/ఊపిరి కారణంగా శరీరంలో కార్బన్ డయాక్సైడ్ అధిక స్థాయికి మరియు ఆక్సిజన్ తక్కువ స్థాయికి చేరే ఒక శ్వాసకోశ రుగ్మత.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
సంకేతాలు మరియు లక్షణాలు పరిస్థితి యొక్క తీవ్రత మీద ఆధారపడి ఉంటాయి. తేలికపాటి నుండి మధ్యస్థ పరిస్థితిలో కనిపించే అత్యంత సాధారణ లక్షణాలు:
- శ్వాస ఆడకపోవుట.
- అలసట లేదా నీరసం.
- రోజంతా నిద్రమత్తుగా అనిపించడం.
- నెమ్మదైన మరియు నిస్సారమైన (లోతులేని లేదా పైపైన) శ్వాస (వేగవంతమైన శ్వాస అరుదుగా కనిపిస్తుంది).
- కుంగుబాటు (డిప్రెషన్).
పరిస్థితి తీవ్రంగా మారినప్పుడు కార్బన్ డయాక్సైడ్ శాతం ఎక్కువైపోతోంది అప్పుడు ఈ కింది లక్షణాలను గమనించవచ్చు.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
రెస్పిరేటరీ డిప్రెషన్ ప్రధానంగా ఈ కింది వాటివలన కలుగుతుంది
- ఊబకాయం లేదా అధిక బరువు ఉండడం, వీటి వలన శ్వాస కోసం అధిక ప్రయత్నాలు అవసరమవుతాయి.
- నిద్రించే సమయంలో శ్వాస మార్గాలు ముడుచుకుపోవడం, ఇది అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా అని కూడా పిలువబడుతుంది.
- ఛాతీ గోడకు సంబంధించి కొన్ని వైకల్యాలు/లోపాలు, ఇవి ఊపిరి తీసుకునే సామర్థ్యాన్ని తగ్గిస్తాయి.
- శ్వాస మార్గాల నిరోధానికి దారితీసే కొన్ని దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులు [ఉదా., క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD), సిస్టిక్ ఫైబ్రోసిస్]
- మెదడుకి గాయం కారణంగా శ్వాస తీసుకోవడం వంటి ప్రాథమిక/ముఖ్య విధులను నిర్వహించడంలో అసంతుల్యతలు ఏర్పడడం.
- నరాల వ్యాధుల కారణంగా శ్వాసను నియంత్రించే కండరాలు బలహీనపడడం.
- ఓపియాయిడ్స్ (opioids), మత్తుమందులు (sedatives), బార్బిబరేట్స్ (barbiturates), బెంజోడియాజిపైన్స్ (benzodiazepines) లేదా సెంట్రల్ నెర్వస్ సిస్టం డిప్రెసెంట్ (central nervous system depressant) మందులు వంటి మందులను అధిక మోతాదులో ఉపయోగించడం.
- అధిక మద్య వినియోగం.
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
వైద్యులు క్షుణ్ణమైన శారీరక పరీక్షను నిర్వహించిన తరువాత లక్షణాల యొక్క పూర్తి చరిత్రను తెలుసుకుంటారు; కారణాన్ని నిర్దారించడానికి ఈ క్రింది పరీక్షలు సలహా ఇవ్వబడతాయి:
- రక్త పరీక్షలు
- రక్త ప్రవాహంలో ఆక్సిజన్ స్థాయిని తనిఖీ చేయడానికి పల్స్ ఆక్సిమేటరీ (Pulse oximetry) పరీక్ష.
- రక్తంలో ఆక్సిజన్-వాహక కణాల (oxygen-carrying cells) స్థాయిని తనిఖీ చేయడానికి హెమటోక్రిట్ (Haematocrit) మరియు హేమోగ్లోబిన్ (haemoglobin) అంచనా.
- రక్తం యొక్క యాసిడ్ / బేస్ సంతులనంతో పాటు కార్బన్ డయాక్సైడ్ మరియు ఆక్సిజన్ స్థాయిల తనిఖీ కోసం రక్త వాయువు పరీక్ష (Blood gas test).
- అసాధారణతల సంభావ్యతను నిర్ములించడానికి ఛాతీ ఎక్స్- రే.
- ఊపిరితిత్తుల పనితీరు పరీక్ష (Lung function test).
- నిద్ర-సంబంధిత రుగ్మతలు (స్లీప్ అప్నియా) సంభావ్యతను నిర్ములించడానికి నిద్ర అధ్యయనం/పరిశీలన (స్లీప్ స్టడీ).
రెస్పిరేటరీ డిప్రెషన్ యొక్క చికిత్స దాని కారణం మీద ఆధారపడుతుంది. కొన్ని చికిత్సా విధానాలు ఈ క్రింద పేర్కొనబడ్డాయి:
- అధిక బరువు లేదా ఊబకాయం ఉన్నవారు బరువును తగ్గించుకోవడం.
- శస్త్రచికిత్సతో ఛాతీ వైకల్యానికి/లోపానికి చికిత్స.
- సమర్థవంతమైన శ్వాస కోసం ఆక్సిజన్ థెరపీ.
- దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధుల కోసం చికిత్స.
- శ్వాస మార్గాల నిరోధాన్ని తొలగించడానికి మందులు.
- ట్రిగ్గర్లుగా (ప్రేరేపకాలుగా) పనిచేసే మందుల నివారణ.
- శ్వాస మార్గాల యొక్క దారిని సరిగ్గా (నిరోధాలు లేకుండా) నిర్వహించడానికి కంటిన్యూస్ పాజిటివ్ ఎయిర్వే ప్రెషర్ (CPAP) లేదా బైలేవెల్ పాజిటివ్ ఎయిర్వే ప్రెషర్ (BiPAP) యంత్రం.