రికెట్సియల్ ఇన్ఫెక్షన్ అంటే ఏమిటి?
పురుగులు, కీటకాలు లేదా పేలు వంటి జీవుల యొక్క కాటు (అవి కొరకడం వలన) ద్వారా మానవులకు వ్యాపించగల రికెట్సియా అని పిలవబడే బ్యాక్టీరియా సమూహం కారణంగా ఈ ఇన్ఫెక్షన్ సంభవిస్తుంది. మానవ శరీరం మీద ఉండే పేలు రికెట్సియా ప్రోవాజేకి (Rickettsia prowazekii) జాతులను (ఇవి ఎపిడెమిక్ టైఫస్ [తీవ్ర విషజ్వరం] ను కలిగిస్తాయి) కలిగివుంటే అవి రికెట్సియల్ ఇన్ఫెక్షన్ మానవులకు వ్యాపించేలా చేస్తాయి. వ్యక్తి-నుండి-వ్యక్తికి (Person-to-person transmission) ఈ అంటువ్యాధి/ఇన్ఫెక్షన్ సంక్రమించదు.
మానవులలో సంక్రమణ/ఇనెఫెక్షన్ కలిగించే రికెట్సియా జాతులు (అరుదైనవి) మరియు అవి ఆస్ట్రేలియాలో కనుగొనబడినవి:
- రికెట్సియా టైఫి (Rickettsia typhi) - మ్యురైన్ టైఫస్
- రికెట్సియా ఆస్ట్రాలిస్ (Rickettsia australis) - క్వీన్స్ ల్యాండ్ టిక్ టైఫస్
- రికెట్సియా హొనెయ్ (Rickettsia honei) - ఫ్లిన్డర్స్ ఐలాండ్ స్పాటెడ్ జ్వరం (
- Flinders Island spotted fever)
- ఓరియెషియా సుట్సుగాముషి (Orientia tsutsugamushi) - టైఫస్ స్క్రబ్
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
ఈ సంక్రమణ/ఇన్ఫెక్షన్ యొక్క లక్షణాలు మరియు తీవ్రత ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికీ మారుతూ ఉంటాయి. సాధారణంగా మరియు అధికంగా సంభవించే/కనిపించే లక్షణాలు:
- సంక్రమణ ప్రారంభమైన స్థానంలో (కాటు జరిగిన ప్రదేశం), ఒక చిన్న, గట్టి, నల్లని పుండు (బొబ్బ) కనిపిస్తుంది
- దగ్గు
- తలనొప్పి
- జ్వరం
- బొబ్బలు
- కండరాల నొప్పి
- శోషరస కణుపుల (లింఫ్ నోడ్ల) వాపు
అరుదుగా, శ్వాసలో ఇబ్బందులు మరియు గందరగోళం వంటివి కూడా కనిపిస్తాయి.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
రికెట్సియల్ ఇన్ఫెక్షన్/సంక్రమణకు ప్రధాన కారణాలు:
- పేలు మరియు పురుగులు మానవులను కుట్టి వారి రక్తం తాగుతాయి, అవి కుట్టినప్పుడు వాటి లాలాజలం నేరుగా మానవ శరీరం లోపకి వెళ్లి సంక్రమణ వ్యాపించేలా చేస్తుంది.
- ఫ్లీస్ (fleas) విషయంలో, కాటు యొక్క స్థానం మలముతో కలుషితమవుతుంది
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
రికెట్సియల్ అంటువ్యాధులు చాలా అసాధారణమైనవి మరియు అరుదైనవి కాబట్టి, అనేక సార్లు, వాటి నిర్ధారణ కష్టం అవుతుంది. వైద్యులు సంకేతాలు మరియు లక్షణాల యొక్క వివరణాత్మక చరిత్రను గురించి తెలుసుకుంటారు, ఇది రోగ నిర్ధారణకు దోహదపడుతుంది. కచ్చితమైన నిర్ధారణకు వైద్యులు ఈ కింది పరీక్షలను ఆదేశించవచ్చు:
- రక్త పరీక్ష
- పురుగు చర్మాన్ని కుట్టిన ప్రదేశం నుండి చర్మం నమూనాను సేకరించి చేసే చర్మ జీవనుపరీక్ష (బయాప్సీ)
రికెట్సియల్ ఇన్ఫెక్షన్ యొక్క చికిత్స ఈ కింది వాటిని కలిగి ఉంటుంది:
- పురుగుల కాటు కోసం చర్మాన్ని పరిశీలించడం (ప్రత్యేకంగా గజ్జ ప్రాంతం, చంకలు, చెవులు లేదా మోకాలు వెనుక, తల వెనుక) తద్వారా వాటిని నిర్వహించడానికి మరియు పికారిడిన్ (picaridin) వంటి కీటక వికర్షకాల (repellents)తో లేదా పొడవైన చేతులు ఉండే రక్షిత దుస్తులతో నిండిన శరీరాన్ని కప్పుకోవడం మరియు విస్తారమైన/పెద్ద అంచులు ఉండే టోపీని పెట్టుకోవడం వంటి నివారణ చర్యలు చెయ్యాలి.
- నివారణ కోసం టీకామందు (vaccine) లేదు, సంక్రమణ యొక్క వ్యవధి మరియు తీవ్రతను తగ్గించడానికి, టెట్రాసైక్లిన్ (tetracycline)లేదా డొక్సీసిసైక్లిన్ (doxycycline) వంటి యాంటీబయాటిక్స్ సూచించబడతాయి.
- బహిరంగ ప్రదేశాల (రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాలు) నుండి ప్రభావిత వ్యక్తిని వేరుగా ఉంచాలి.