షింగల్స్ అంటే ఏమిటి?
షింగల్స్ అనేది వైరస్ వలన సంభవించే ఒక సంక్రమణం, ఇది చర్మం మీద బొబ్బలు లేదా దద్దుర్లకు దారితీస్తుంది. ఇది వరిసెల్లా జోస్టర్ వైరస్ (varicella zoster virus) వల్ల కలుగుతుంది ఇదే వైరస్ చికెన్ ఫాక్స్ (పొంగు చల్లడం/అమ్మవారు) ను కూడా కలిగిస్తుంది. అంతర్లీన వ్యాధి వైరస్ వలన మళ్ళీ ప్రేరేపింపబడితే (reactivation) అది షింగల్స్ ను కలిగిస్తుంది. చికెన్ ఫాక్స్ నుండి ఒక వ్యక్తి కోలుకున్న తర్వాత కూడా, వైరస్ నరాల కణజాలంలో క్రియా రహితంగా (inactive) ఉంటుంది, షింగల్స్ లో మళ్లీ కొన్ని రోజులకి క్రియాశీలకంగా (reactivate) మారుతుంది.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
ప్రారంభదశ సంకేతాలు మరియు లక్షణాలు:
తర్వాతి దశ సంకేతాలు మరియు లక్షణాలు:
- ఎర్రని దదుర్లు ఒకే భాగంలో లేదా శరీరంలో ఒకే వైపున ఏర్పడతాయి (సాధారణంగా, దద్దుర్లు శరీరంలో ఒక వైపున ఏర్పడతాయి . బలహీనమైన రోగనిరోధక శక్తి ఉండే కొంత మంది వ్యక్తులలో మాత్రమే శరీరమంతా ఈ దద్దుర్లు ఏర్పడతాయి ).
- సమూహాలుగా ఉండే చిన్న చిన్న ద్రవం నిండి బొబ్బలు పగిలి తెరుచుకుని క్రమంగా మచ్చలలా ఏర్పడతాయి.
ఇతర లక్షణాలు:
- జ్వరం
- స్పర్శకు మరియు కాంతికి సున్నితత్వం
- తలనొప్పి
- అలసట
- చలి
- కడుపు నొప్పి
- షింగల్స్ సాధారణంగా నడుము లేదా ఛాతీ మీద గుంపుగా ఏర్పడతాయి
రోగనిరోధక శక్తి క్షిణించిన కారణంగా తీవ్రమైన లక్షణాలు సంభవించవచ్చు, అవి:
- చికెన్ ఫాక్స్ మాదిరిగానే విస్తృతముగా వ్యాపించిన దద్దుర్లు మరియు బొబ్బలు
- కన్ను కూడా ప్రభావితం కావచ్చు, ఫలితంగా దృష్టి/చూపు లోపం కలుగవచ్చు
- బాక్టీరియల్ చర్మ అంటువ్యాధులు కలుగవచ్చు
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
హెర్పిస్ వైరస్లు అని పిలువబడే వైరస్ల బృందంలో ఉండే వరిసెల్లా జోస్టర్ (varicella zoster) అనే వైరస్ వల్ల షింగల్స్ వస్తుంది.
గతంలో చికెన్ ఫాక్స్ నుండి కోలుకున్న వ్యక్తికి షింగల్స్ సంభవిస్తుంది. వైరస్ నరాలలో క్రియారహితంగా ఉండి, కొన్ని సంవత్సరాల తర్వాత వ్యక్తి యొక్క రోగనిరోధక శక్తి తగ్గిన సంధర్భాలలో క్రియాశీలకంగా మారవచ్చు అప్పుడు షింగల్స్ సంభవిస్తుంది.
రోగనిరోధక వ్యవస్థ యొక్క శక్తి తగ్గిన వారిలో షింగిల్స్ సర్వసాధారణంగా కనిపిస్తుంది. వృద్ధులు, హెచ్ఐవి లేదా క్యాన్సర్తో బాధపడుతున్నవారు లేదా సుదీర్ఘకాలం పాటు కొన్నిరకాల స్టెరాయిడ్ మందులను వాడినటువంటి వారిలో షింగిల్స్ అభివృద్ధి చెందవచ్చు.
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
షింగిల్స్ ను ఆరోగ్య చరిత్ర మరియు ఖచ్చితమైన శారీరక పరీక్ష ఆధారంగా నిర్ధారిస్తారు.
పరీక్ష కోసం కణజాలం యొక్క స్క్రాప్ (చిన్న తునక) లేదా బొబ్బ నుండి తీసిన స్వబును వైరస్ కోసం సాగు చేస్తారు.
షింగిల్స్ సాధారణంగా కొన్ని వారాలలో సహజంగానే తగ్గిపోతుంది. షింగిల్స్ టీకా (vaccine) కూడా అందుబాటులో ఉంది సంక్రమణను నిరోధించడానికి దానిని రోగి యొక్క సంరక్షకులకు మరియు రోగికి దగ్గరలో ఉండే చిన్న పిల్లలకు సలహా ఇవ్వబడుతుంది.
మందులు: లక్షణాలను తగ్గించడం కోసం మరియు వేగవంతమైన స్వస్థతకు యాంటీవైరల్ ఏజెంట్లు సూచించబడవచ్చు. ఓపియాయిడ్ ఉత్పన్నాలు (opioid derivatives), పారాసెటమాల్, ఐబుప్రోఫెన్ (ibuprofen) మరియు స్టెరాయిడ్స్ వంటి నొప్పి నివారణ మందులను కూడా సూచించవచ్చు.
స్వీయ రక్షణ:
- చన్నీటి కాపడం
- కాలామైన్ లోషన్ (calamine lotion)ను ఉపయోగించడం
- వోట్మీల్ స్నానాలు (Oatmeal baths)
- జోస్టర్ వైరస్ సంక్రమించిన వ్యక్తులలు దూరంగా ఉండాలి, ఎందుకంటే చికెన్ ఫాక్స్ వ్యాపించే/సంక్రమించే అవకాశం ఉంటుంది.