అఘాతం లేక షాక్ అంటే ఏమిటి?
ప్రియమైన వ్యక్తిని కోల్పోవడం వంటి అఘాతకరమైన, కలతపెట్టేటువంటి లేదా భయపెట్టే బాధాకరమైన సంఘటనలను అనుభవించిన్నపుడు వ్యక్తి ఒక మానసిక షాక్ కు లేదా అఘాతానికి గురవుతాడు. ఇలా అఘాతానికి (షాక్లో ఉన్న వ్యక్తి) గురైనవ్యక్తి గత స్మృతి జ్ఞాపకాలు, అనూహ్యమైన భావోద్వేగాలు, దెబ్బతిన్న సంబంధాల వంటి దీర్ఘకాలిక ప్రతిచర్యల (reactions)ను అనుభవిస్తాడు.
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
అఘాతం లేక షాక్ యొక్క ప్రధాన చిహ్నాలు మరియు లక్షణాలు:
- జ్ఞాపకశక్తిని కోల్పోవడం (మెమరీ నష్టం)
- సులభంగా భయపడిపోవడం
- తీవ్రమైన చురుకుదనం మరియు సంభావ్య ప్రమాద హెచ్చరికల కోసం ఎదురు చూడ్డం
- భయం దాడులు
- నిద్రపోవడం కష్టమవడం
- భావోద్వేగపరంగా స్తబ్దత అనుభూతి
- మనసు కేంద్రీకరించడంలో కష్టం
- కోపం
- కుంగుబాటు (డిప్రెషన్)
- అవిశ్వాసం
- గందరగోళం
- భయంకరమైన జ్ఞాపకాలు
- చిరాకు
- చెడు కలలు
- మానసిక కల్లోలం
- లైంగిక అసమర్థత
- నిరాకరణ
- సామర్ధ్యంలో మార్పులు
- సంఘటన (ఈవెంట్) యొక్క దృశ్యాలు (విజువల్ చిత్రాలు)
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
మానసిక అఘాతం (షాక్) యొక్క ప్రధాన కారణాలు:
- ప్రకృతి వైపరీత్యాలు
- గృహ మరియు కార్యాలయ హింస
- భయోత్పాతం (టెర్రరిజం)
- మరణాన్ని చూడటం లేదా ఇతర బాధాకరమైన సంఘటనను ప్రత్యక్షంగా చూడ్డం
- కారాగారవాసం
- తీవ్రమైన గాయం లేదా అనారోగ్యం
దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
మానసిక ఆరోగ్య వైద్యుడు వ్యక్తి శారీరక పరీక్షను నిర్వహిస్తాడు, అఘాతానికి గురైనవ్యక్తి వైద్య చరిత్రను మరియు ఆ వ్యక్తిలోని వ్యాధిలక్షణ గమనికలను గమనిస్తాడు.
క్రింది చికిత్సల్ని మానసిక అఘాతం (షాక్) చికిత్సకు ఉపయోగిస్తారు:
- మేధో పునర్నిర్మాణం (కాగ్నిటివ్ రీస్ట్రక్చర్): ఈ చికిత్స వ్యక్తి అవమానం మరియు అపరాధం యొక్క భావాలను పారద్రోలడానికి చెడు జ్ఞాపకాలను అంగీకరించి, మర్చిపోవడానికి సహాయపడుతుంది.
- మానసిక చికిత్స (సైకోథెరపీ): ‘టాక్ థెరపీ’ అని కూడా పిలిచే ఈ మానసిక చికిత్సలో 6 నుండి 12 వారాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు ఉండే బహుళ సమావేశాలు (సెషన్లు) ఉంటాయి. ఈ సెషన్లు ఒక మానసిక ఆరోగ్య ప్రదాత సమక్షంలో నిర్వహించబడతాయి. ఈ చికిత్స సహాయంతో స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల మద్దతు పొందడమనేది కీలకం. ఈ చికిత్స అఘాతానికి గురైనవ్యక్తిలో ఆత్మవిశ్వాసం, నమ్మకం మరియు భావోద్వేగాలను ప్రేరేపించడంలో సహాయపడుతుంది.
- ఎక్స్పోజర్ థెరపీ: ఈ చికిత్స వ్యక్తి భయాలు మరియు బాధలను నియంత్రించడానికి సహాయపడుతుంది. ఈ చికిత్సలో ఉపయోగించే కొన్ని ఉపకరణాలేవంటే రాయడం మరియు భావనా కల్పన.
మందులు:
- కుంగుబాటు నివారణ (యాంటీడిప్రెస్సెంట్స్) మందులు కోపం నిగ్రహానికి, చింతలు, విచారం మరియు భావోద్వేగ తిమ్మిరిని నియంత్రించడానికి.
- ఆందోళన నివారణా మందులు
- రిలాక్సేషన్ టెక్నిక్స్: శ్వాస వ్యాయామాలు వంటి పద్ధతులు, ధ్యానం మరియు యోగ సాధన, మరియు దిననిత్య క్రమ వ్యాయామాన్ని పాటించడంవల్ల మానసిక అఘాతానికి (షాక్ కు) గురైన వ్యక్తికి మానసిక సడలింపు మరియు మానసిక ప్రశాంతత లభిస్తుంది.