సారాంశం
భుజము, స్నాయువులు లేదా మృదులాస్థిని రూపొందించే మూడు ఎముకలలో ఏదైనా ఒకటి పాడైనచో, భుజం నొప్పి ఏర్పడవచ్చు. భుజం నొప్పి యొక్క అత్యంత సాధారణ కారణాలు రొటేటర్ కఫ్ వ్యాధులు, భుజం విరుగుట, భుజము స్థానభ్రంశం కలుగుట, మరియు స్తంభించిన భుజం. భుజం నొప్పికి సంబంధించిన ప్రమాద కారకాలు వృద్ధాప్యం, ఒత్తిడి వలన భుజాలకు గాయమగుట, అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు మరియు మధుమేహం, ధూమపానం, మరియు కొన్ని ఔషధాల ఉపయోగం వంటి గుండె వ్యాధుల ప్రమాద కారకాలు. సరైన శరీర భంగిమ, భాగాలను సాగదీయుట మరియు బలపరిచే వ్యాయామాలతో చాలా వరకు భుజాల సమస్యలు నిరోధించడంలో సహాయపడతాయి. భుజం నొప్పి చికిత్స సంబంధిత కారణం మరియు పరిస్థితి యొక్క తీవ్రతను బట్టి ఉంటుంది. భుజం యొక్క చాలా సమస్యలు మందులు, విశ్రాంతి, మరియు వ్యాయామాలు కలయికతో చికిత్స పొందవచ్చు; పగుళ్ళు వంటి ఇతరములకు శస్త్రచికిత్స అవసరమవుతుంది. సరియైన రోగ నిర్ధారణ మరియు పరిస్థితి యొక్క తక్షణ చికిత్స మంచి రోగ నిరూపణకు మార్గం. భుజపు నొప్పి ప్రామాణిక చికిత్స పద్ధతులకు బాగా స్పందిస్తుంది మరియు ఎక్కువ మంది ప్రజలు కొన్ని వారాలు లేదా నెలల్లో ఉపశమనం పొందుతారు. భుజం నొప్పి యొక్క సమస్యలు చాలా అరుదుగా ఉంటాయి మరియు సాధారణంగా శారీరక గాయం నుండి కలుగుతుంది. ఏమైనప్పటికీ, అత్యంత సంక్లిష్ట కేసులలో కూడా శస్త్రచికిత్స చాలా వరకు విజయవంతమయ్యింది. అరుదైన సందర్భాలలో, భుజం నొప్పి గుండె జబ్బుల వంటి మరొక తీవ్రమైన పరిస్థితిని సూచిస్తుంది, దీనికి తక్షణ వైద్యపరిమైన శ్రద్ధ తీసుకోవాలి.