టాక్సిక్ ఎపిడెర్మల్ నెక్రోలైసిస్ (టిఈఎన్) అంటే ఏమిటి?
టాక్సిక్ ఎపిడెర్మల్ నెక్రోసిస్ (టిఈఎన్) అనేది ఒక అరుదైన మరియు ప్రాణాంతక ఇమ్యునోలాజికల్ డిజార్డర్ (రోగనిరోధక వ్యవస్థకు సంబంధించిన రుగ్మత), ఇది కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు/సంక్రమణలు లేదా కొన్ని రకాల మందుల యొక్క వినియోగం వల్ల సంభవిస్తుంది దీనిలో చర్మం పై పొర ఊడిపోవడం/రాలిపోవడం మొదలవుతుంది.. ఇది అన్ని వయస్సుల వారిని ప్రభావితం చేస్తుంది, అయితే, పెద్ద వయసు వారికి (వృద్ధాప్యంలో ఉన్న వారు) మరియు బలహీనమైన రోగనిరోధక శక్తి కలిగిన వ్యక్తులకు దీని ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా, పురుషుల కంటే మహిళల్లో టిఈఎన్ ఎక్కువగా కనిపిస్తుంది. ఈ పరిస్థితి నిర్వహించడానికి తక్షణ వైద్య శ్రద్ధ అవసరం.
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
టిఈఎన్ యొక్క లక్షణాలను ఈ కింది విధంగా వర్గీకరించవచ్చు
ప్రారంభ లక్షణాలు
తర్వాతి లక్షణాలు
- ముఖంతో పాటుగా శరీరం అంతా ఊదారంగు లేదా ఎరుపు రంగు దద్దుర్లు
- ముఖం మరియు నాలుక యొక్క వాపు
- నోరు, కళ్ళు చుట్టూ మరియు యోని ప్రాంతంలో బొబ్బలు
- చర్మం పై పొర రాలిపోవడం/ఊడిపోవడం వలన చర్మం కాలిపోయినట్టు కనిపిస్తుంది
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
సాధారణంగా, టిఈఎన్ సంభవించడానికి కారణం అయ్యే మందులు
- సల్ఫోనమైడ్లు (Sulphonamides)
- అల్లోప్యూరినాల్(Allopurinol)
- నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ మందులు (Non-steroidal anti-inflammatory drugs)
- ఫినిటోయిన్ (phenytoin), లామోట్రిజైన్ (lamotrigine), మరియు కార్బమాజిపైన్ (carbamazepine) వంటి యాంటి ఎపిలెప్టిక్ మందులు
హ్యూమన్ ఇమ్మ్యూనోడెఫిసియన్సీ వైరస్ (HIV) మరియు హెర్పిస్ సింప్లెక్స్ వంటి ఇతర వ్యాధులు కూడా టిఈఎన్ కు దారి తీయవచ్చు.
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
రోగి యొక్క సంపూర్ణ భౌతిక పరీక్ష టిఈఎన్ నిర్ధారణకు మొదటి దశ. స్టీవెన్స్-జాన్సన్ సిండ్రోమ్ (SJS, Stevens-Johnson syndrome) యొక్క సంభావ్యతను తొలగించడానికి, శరీరంలో అసాధారణత ఉన్న చర్మం యొక్క పరిధిని తనిఖీ చేస్తారు. ఆ పరిధి శరీర చర్మ వైశాల్యంలో 30% కంటే ఎక్కువగా ఉంటే, స్టీవెన్స్-జాన్సన్ సిండ్రోమ్ తొలగించబడుతుంది. చర్మపు జీవాణుపరీక్ష (బయాప్సీ) మరియు చర్మం యొక్క హిస్టోపాథలాజికల్ (histopathologic) అధ్యయనాలను రోగ నిర్దారణను ధృవీకరించడానికి నిర్వహిస్తారు.
ఈ పరిస్థితి నిర్వహణ యొక్క తక్షణ చర్య ఇటీవల/కొత్తగా ఉపయోగించడం మొదలు పెట్టిన మందులను నిలిపివేయడం. ఇతర నిర్వహణ చర్యలు వీటిని కలిగి ఉంటాయి
- నిపుణుల నుండి సహాయక చర్యలు తీసుకోవడం
- ప్రభావిత స్థానాలకు జిగురుగా లేని కట్టులు కట్టడం (Non-sticky dressings)
- నొప్పి నివారణ మందులు
- అంటువ్యాధులను/సంక్రమణలను నివారించడానికి ఇంట్రావీనస్ (నరాల ద్వారా ఎక్కించే) యాంటీబయాటిక్స్
- సైటోటాక్సిక్ ప్రక్రియను (cytotoxic process) ఆపడానికి ఇంట్రావెనస్ ఇమ్యునోగ్లోబులిన్లు
- సమయోచిత ఎమోలియాంట్ (మెత్తపరచే) క్రీమ్లు (Topical emollient creams).