ట్రైకోమోనియాసిస్ - Trichomoniasis in Telugu

Dr. Ajay Mohan (AIIMS)MBBS

January 12, 2019

March 06, 2020

ట్రైకోమోనియాసిస్
ట్రైకోమోనియాసిస్

ట్రైకోమోనియాసిస్ అంటే ఏమిటి?

ట్రైకోమోనియాసిస్ అనేది ఒక లైంగిక సంక్రమణ వ్యాధి మరియు ప్రధానంగా పరాన్నజీవి సంక్రమణ వలన కలుగుతుంది. ఈ వ్యాధి పురుషులు కంటే మహిళల్లోనే చాలా సాధారణం మరియు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ట్రైకోమోనియాసిస్ చాలా సాధారణంగా కన్పిస్తుంది.

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

కొందరు వ్యక్తుల్లో, ఎక్కువగా మహిళల్లో, వ్యాధి ఎలాంటి రోగలక్షణాలను ఉత్పత్తి చేయకపోవచ్చు. ఇలా వ్యాధి లక్షణాలు పొడజూపకపోవడమనేది వ్యాధి నిర్ధారణలో ఆలస్యానికి దారి తీయవచ్చు. మహిళల్లో ట్రైకోమోనియాసిస్ యొక్క అత్యంత సాధారణ లక్షణాలు:

 • జననేంద్రియ ప్రాంతంలో మంట లేదా దురద
 • నురుగుతో కూడిన ఆకుపచ్చ లేదా పసుపురంగులో ఉండే యోని ఉత్సర్గ
 • యోని నుండి చెడు వాసన
 • లైంగిక సంభోగం సమయంలో అసౌకర్యం
 • మూత్రవిసర్జనలో సమస్య
 • పొత్తికడుపులో నొప్పి

పురుషులలో, వ్యాధి లక్షణాలు ఈ క్రింది విధంగా ఉండవచ్చు:

 • జననేంద్రియ ప్రాంతంలో మందినట్లుండే నొప్పి
 • మూత్రవిసర్జన లేదా స్ఖలనం తర్వాత అసౌకర్యం
 • పురుషాంగం నుండి అసాధారణ ఉత్సర్గ
 • సంక్రమణ సోకిన 5 నుండి 28 రోజులలోగా ఈ వ్యాధి లక్షణాలు  కనిపిస్తాయి

చికిత్స చేయకుండా వదిలేస్తే, ట్రైకోమోనియాసిస్ వ్యాధి  హ్యూమన్ ఇమ్మ్యూనో డెఫిసియన్సీ వైరస్ (HIV) అంటు సోకే  ప్రమాదాన్ని పెంచుతుంది.

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

ట్రైకోమోనియాసిస్ వ్యాధికి పరాన్నజీవి “ట్రిఖోమోనాస్ వెజినాలిసిస్” అనేది ప్రధానంగా కారణమవుతుంది. ఈ అంటువ్యాధి లైంగిక సంబంధం ద్వారా వ్యాపిస్తుంది (యోని, పాయువు లేక ఆసన సంబంధమైన లేదా మౌఖికమైన లైంగిక క్రియల మూలంగా).

ఈ సంక్రమణను పొందే ప్రమాదం ఒకరి కంటే ఎక్కువమంది లైంగిక  భాగస్వాములను కలిగి ఉండే వ్యక్తులలో ఎక్కువగా ఉంటుంది.

దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

ట్రైకోమోనియాసిస్ వ్యాధిని నిర్ధారించడానికి, డాక్టర్ క్రింది పరీక్షలను నిర్వహిస్తారు:

 • కటిభాగపు (పెల్విక్) పరీక్ష
 • ద్రవ నమూనా యొక్క ప్రయోగశాల పరీక్ష
 • మూత్ర పరీక్ష

శరీరం నుండి పరాన్నజీవుల్ని (parasites) తొలగించడంలో సహాయపడే యాంటీబయాటిక్స్ సహాయంతో ఈ వ్యాధికి సులభంగా చికిత్స చేయగలరు. పునఃసంక్రమణ అవకాశాలను తొలగించడానికి లైంగిక భాగస్వాములు ఇద్దరిచేతా మందుల్ని సేవింపజేయాలి.

లైంగికంగా బదిలీ అయ్యే వ్యాధుల్ని (STD) నివారించే ఏకైక మార్గం సురక్షితమైన లైంగిక పద్ధతిని పాటించడమే. ఇంకా, చాలామంది లైంగిక భాగస్వాములను లేకుండా ఉండడం. కండోమ్లను ఉపయోగించడంవల్ల వ్యాధిని పొందే ప్రమాదాన్ని తగ్గిస్తుంది, కానీ అంటువ్యాధి సోకే ప్రమాదాన్ని పూర్తిగా తొలగించదు.

లైంగిక సంపర్కంలో పాల్గొనేటపుడు లైంగికంగా బదిలీ అయ్యే వ్యాధు (STD) ల యొక్క పూర్వ చరిత్ర మరియు ప్రమాదం గురించి చర్చించడం అనేది సహాయకర చర్యగా ఉండగలదు.



వనరులు

 1. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; Trichomoniasis - CDC Fact Sheet.
 2. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Trichomoniasis.
 3. Office on Women's Health [Internet] U.S. Department of Health and Human Services; Trichomoniasis.
 4. Patricia Kissinger. Trichomonas vaginalis: a review of epidemiologic, clinical and treatment issues. BMC Infect Dis. 2015; 15: 307. PMID: 26242185
 5. Jane R. Schwebke,Donald Burgess. Trichomoniasis. Clin Microbiol Rev. 2004 Oct; 17(4): 794–803. PMID: 15489349

ట్రైకోమోనియాసిస్ వైద్యులు

Dr Rahul Gam Dr Rahul Gam Infectious Disease
8 Years of Experience
Dr. Arun R Dr. Arun R Infectious Disease
5 Years of Experience
Dr. Neha Gupta Dr. Neha Gupta Infectious Disease
16 Years of Experience
Dr. Anupama Kumar Dr. Anupama Kumar Infectious Disease
ఆడియో కొద్దిగా ఆలస్యం కావచ్చు