ఎగువ శ్వాసకోశ మార్గ సంక్రమణ (యు.ఆర్.టి.ఐ [upper respiratory tract infection]) అంటే ఏమిటి?
బాక్టీరియా, ఫంగస్ లేదా వైరస్ల వలన ఒక ఎగువ శ్వాసకోశ మార్గంలో ఉండే గొంతు, ముక్కు మరియు స్వరపేటిక (వాయిస్ బాక్స్) లకు సంక్రమణ సంభవించడాన్ని ఎగువ శ్వాసకోశ మార్గ సంక్రమణ (URTI) అని పిలుస్తారు. కొన్ని సాధారణంగా సంభవించే యు.ఆర్.టి.ఐలు సైనసైటిస్, రినైటిస్, లారింజైటిస్, మరియు ఫారింజైటిస్ వంటివి. చాలామంది యు.ఆర్.టి.ఐలు తేలికపటివి, కానీ కొన్నియు.ఆర్.టి.ఐ కేసులకు వైద్యపరమైన సహాయం అవసరం మరియు చికిత్స చేయకుండా వదిలేస్తే అవి తీవ్ర ఇన్ఫెక్షన్లుగా పురోగమించగలవు. శ్వాసకోశ మార్గం అంటువ్యాధులకు/సంక్రమణలకు ఒక సాధారణమైన మరియు తేలికపాటి కేంద్రంగా ఉంటుంది, ఎందుకంటే ఇది గాలి ద్వారా వ్యాపించే సూక్ష్మజీవులతో నిరంతరం నేరుగా సంబంధం కలిగి ఉంటుంది.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
యు.ఆర్.టి.ఐల యొక్క ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు సంక్రమణ కలిగించిన వైరస్ లేదా బ్యాక్టీరియా యొక్క రకానికి బట్టి ఉంటాయి. యు.ఆర్.టి.ఐలలో సాధారణంగా కనిపించే కొన్ని లక్షణాలు ఈ కింది విధంగా ఉంటాయి:
- తలనొప్పి
- శ్వాసతీసుకోవడానికి కష్టంగా ఉండే ముక్కు లేదా ముక్కు కారడం
- శరీర నొప్పి
- జ్వరం
- అలసట
- కఫం (phlegm) ఉత్పత్తితో లేదా లేకుండా దగ్గు
- నిద్రించడంలో సమస్య
- తుమ్ములు
- గొంతు మంట
- అరుదైన సందర్భాల్లో ఛాతీ నొప్పి
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
యు.ఆర్.టి.ఐ ల యొక్క ప్రధాన కారణాలు ఈ క్రింది విధంగా ఉంటాయి:
- ఫ్లూ
- సాధారణ జలుబు
- సీజనల్ (ఋతువు సంబంధమైన) అలెర్జీలు లేదా వాతావరణ మార్పులు
- యు.ఆర్.టి.ఐ ఉన్న వ్యక్తితో ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉండడం (దగ్గరగా ఉండడం)
- ఇన్ఫ్లుఎంజా వైరస్ (influenza virus), రినోవైరస్లు (rhinoviruses), కరోనావైరస్ (coronavirus) వంటి వైరస్లు ఉన్న తుమ్ము లేదా దగ్గు నుండి వచ్చిన బిందువులను పీల్చడం.
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
చాలా యు.ఆర్.టి.ఐలు రోగి నివేదించిన/తెలిపిన లక్షణాలు ఆధారంగా నిర్ధారణ చేయబడతాయి. రాపిడ్ యాంటిజెన్ డిటెక్షన్ టెస్ట్ (RADT), హెటిరోఫిల్ యాంటీబాడీ టెస్ట్ (Heterophil Antibody test), మరియు IgM యాంటిబాడీ టెస్ట్ (IgM antibody test) వంటి పరీక్షలు వైరస్ లేదా బ్యాక్టీరియాను గుర్తించటానికి ఆదేశించబడతాయి.
యు.ఆర్.టి.ఐ లకు సూచించే సాధారణ చికిత్సలు:
- ముక్కు కారడాన్ని మరియు తుమ్ములు తగ్గించడానికి యాంటిహిస్టామైన్లు (Antihistamines) మరియు డీకన్స్టాంటెంట్లు (decongestants) సూచించబడతాయి.
- గొంతు మంట ఉపశమనానికి సెలైన్ గార్గిల్స్ (పుక్కలించేవి) సూచించబడతాయి.
- వైరస్ లేదా బ్యాక్టీరియా కారణంగా సంభవించే ఫారింజైటిస్ వంటి యు.ఆర్.టి.ఐ ల చికిత్స కోసం యాంటీబయాటిక్స్ మరియు యాంటీవైరల్లు (antivirals) సూచించబడతాయి.
- లాజెంజెస్ (lozenges) మరియు నాసల్ సెలైన్ డ్రాప్స్ వంటి ఓవర్ ది కౌంటర్ మందులు (మందుల షాపులో సులభంగా దొరికేవి) మరియు నీటిని ఉపయోగించి సైనసిటిస్ నుండి ఉపశమనం పొందవచ్చు.
- టీ మరియు సూప్ వంటి వేడి పానీయాలు గొంతుమంటను తగ్గిస్తాయి.
- ఎసిటామినోఫెన్ (acetaminophen) వంటి నొప్పి నివారణలు కూడా నొప్పి ఉపశమనం కోసం సూచించబడతాయి.