చర్మంపై దురద, నల్ల దద్దుర్లు (యుర్టికెరియా పిగ్మెంటోసా) - Urticaria Pigmentosa in Telugu

Dr. Ayush PandeyMBBS,PG Diploma

January 14, 2019

March 06, 2020

చర్మంపై దురద, నల్ల దద్దుర్లు
చర్మంపై దురద, నల్ల దద్దుర్లు

చర్మంపై దురద, నల్ల దద్దుర్లు (యుర్టికెరియా పిగ్మెంటోసా) అంటే ఏమిటి?

యుర్టికేరియా పిగ్మెంటోసా (చర్మంపై దురద, నల్ల దద్దుర్లు) అనేది ఓ చర్మ రుగ్మత. ఇది తీవ్రమైన దురదను మరియు చర్మంపై నల్ల మచ్చలను కలిగి ఉంటుంది. చర్మంపై రుద్దినపుడు ఎరుపు రంగుతో కూడిన బొబ్బలు లేస్తాయి. పెరిగిన గడ్డలు ఇవి దద్దుర్లు, అభివృద్ధి ధోరణి ఉంది. సాధారణంగా ఈ రుగ్మత పిల్లల్లో కనిపిస్తుంది, కానీ, పెద్దలక్కూడా  సంభవిస్తుందిది.

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

లక్షణాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారినప్పటికీ, చర్మంపై గోధుమరంగు  మచ్చలు (పాచ్ లు) ప్రధాన లక్షణం. ఈ గోధుమరంగు బొబ్బలు (మచ్చలు) హిస్టామిన్లను కల్గిఉన్నందున, రోగ కారకాలు వీటిని ఎర్రని బొబ్బలుగా మారుస్తాయి. పిల్లలలో అయితే చర్మంపై గోకడంవల్ల ఒక రకమైన ద్రవంతో నిండిన పొక్కులతో కూడిన బొబ్బల్ని చూడవచ్చు. వ్యాధి సోకిన వ్యక్తుల ముఖం త్వరితగతిలో ఎరుపెక్కడాన్ని కూడా మనం గమనించొచ్చు.

తీవ్రమైన కేసుల లక్షణాలు ఇలా ఉంటాయి

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

చర్మంపై దురద, నల్ల దద్దుర్లు (యుర్టికేరియా పిగ్మెంటోసా) రుగ్మతకు ముఖ్య కారకం తాపజనక కణాలు. (రోగనిరోధక వ్యవస్థ కణాలు చర్మం లో హిస్టామిన్ తయారు చేయడం మరియు విడుదల చేయడం ద్వారా మన శరీరం సంక్రమణల విరుద్ధంగా పోరాడటానికి సహాయపడుతుంది) ఈ తాపజనక కణాలు చర్మంలో అధికంగా ఉంటాయి. కణజాలం యొక్క వాపు హిస్టమైన్ల ప్రభావం వలన సంభవిస్తుంది. హిస్టామైన్లు కిందివాటి ద్వారా ప్రేరేపించబడతాయి:

  • వ్యాయామం
  • ఎండకు లేదా అతిచల్లదనానికి గురికావడం
  • మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారాల్ని, వేడి ద్రవాల్ని లేదా మద్యం  సేవించడం
  • చర్మాన్ని  రుద్దడం
  • అంటువ్యాధులు
  • డ్రగ్స్, స్టెరాయిడ్లుకాని యాంటీ-ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ (యాస్పిరిన్), మత్తుమందులు (అనస్తీటిక్స్ డ్రగ్స్), మద్యం

దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

వైద్యుడు చర్మం యొక్క పూర్తి పరీక్షను నిర్వహిస్తారు మరియు డార్యర్ యొక్క సంకేతం (సైన్) కోసం తనిఖీ చేస్తాడు. దీని తరువాత పరీక్షలు చేయవచ్చు:

  • రక్త పరీక్షలు
  • పూర్తి రక్త గణనలు
  • బ్లడ్ ట్రీప్టెస్ (blood tryptase - మాస్ట్ కణాలలో ఉండే ఎంజైమ్) స్థాయిలు
  • మూత్రం హిస్టామిన్లు
  • మాస్ట్ కణాల సంఖ్యను పరిశీలించడానికి స్కిన్ బయాప్సీ

యుర్టికేరియా పిగ్మెంటోసా నిర్వహణ క్రింది చికిత్సను కలిగి ఉంటుంది:

  • దురద మరియు ఎరుపుదేలడమనే వ్యాధి లక్షణాల్ని వదిలించుకోవటం కోసం వైద్యుని యొక్క ప్రిస్క్రిప్షన్ ప్రకారం యాంటిహిస్టమిక్ మందులసేవనం
  • చర్మంపై పైపూతగా కార్టికోస్టెరాయిడ్స్ మందులు
  • మాస్ట్ కణాలను అస్థిరపరిచేందుకు డెస్టోడియమ్ క్రోమోగ్లికేట్ల యొక్క మౌఖికసేవన, నిర్వహణ, ఈ మందులు చివరికి హిస్టామైన్లను తగ్గించి వాటిని విడుదలకు తోడ్పడతాయి.
  • కాంతి లేదా లేజర్ చికిత్స.



వనరులు

  1. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Urticaria pigmentosa
  2. British Association of Dermatologists. Urticaria pigmentosa. [Internet] Skin Support
  3. Macri A, Cook C. Urticaria Pigmentosa (Cutaneous Mastocytosis). [Updated 2019 Apr 11]. In: StatPearls [Internet]. Treasure Island (FL): StatPearls Publishing; 2019 Jan-.
  4. British Association of Dermatologists. URTICARIA PIGMENTOSA. [Internet]
  5. National Health Portal [Internet] India; Urticaria

చర్మంపై దురద, నల్ల దద్దుర్లు (యుర్టికెరియా పిగ్మెంటోసా) కొరకు మందులు

Medicines listed below are available for చర్మంపై దురద, నల్ల దద్దుర్లు (యుర్టికెరియా పిగ్మెంటోసా). Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.