వైరల్ జ్వరము అంటే ఏమిటి?
జ్వరం అనేది శరీర ఉష్ణోగ్రత సాధారణ కంటే ఎక్కువగా ఉండే ఒక అనారోగ్యానికి సంకేతం. సాధారణంగా, శరీరంలో ప్రవేశించిన ఒక బయటి జీవికి వ్యతిరేకంగా శరీర జరిపే పోరాటాన్ని జ్వరం సూచిస్తుంది. ఈ బయటి జీవి వైరస్ అయితే, దానిని వైరల్ జ్వరము అని అంటారు. అనేక వైరల్ ఇన్ఫెక్షన్లు జ్వరాన్ని కలిగిస్తాయి, ఉదా., సాధారణ జలుబు, డెంగ్యూ మరియు శ్వాసకోశ సంక్రమణలకు కారణమయ్యే వైరస్లు మొదలైనవి.
దాని ప్రధాన సంబంధిత సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
వైరస్ జ్వరం ఉన్న వ్యక్తి ఈ కింది సంకేతాలు మరియు లక్షణాలను అనుభవించవచ్చు:
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
జ్వరం కలిగించే సాధారణ వైరల్ ఇన్ఫెక్షన్లు ఈ క్రింద ఇవ్వబడ్డాయి:
- డెంగ్యూ జ్వరం
- రెస్పిరేటరీ సిన్సిషియాల్ వైరస్ సంక్రమణ (Respiratory syncytial virus infection)
- హెచ్ఐవి (HIV)
- మధ్య చెవి సంక్రమణం
- స్వైన్ ఫ్లూ
- చికెన్ ఫాక్స్
- మీసల్స్
- హెర్పెస్ సింప్లెక్స్
- హెపటైటిస్
- షింగల్స్
వైరస్ తో కలుషితమైన ఆహార వినియోగం కూడా ఆహార విషప్రక్రియ (ఫుడ్ పోయిజనింగ్) వలన వైరల్ జ్వరానికి దారితీయవచ్చు. వ్యాధి సోకిన వ్యక్తి ద్వారా ఏర్పడే వైరస్ కలుషిత నేసల్ బిందువులని (nasal droplets) కలిగి ఉండే గాలిని పీల్చడం అనేది వైరస్ వ్యాప్తి యొక్క సాధారణ మార్గం. దోమల వంటి కీటకాల ద్వారా డెంగ్యూ వంటి వైరస్లు వ్యాపిస్తాయి.
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
వైద్యులు పెరిగిన శరీర ఉష్ణోగ్రత మరియు జ్వరం యొక్క ఇతర లక్షణాలను గుర్తించడానికి భౌతిక పరీక్ష నిర్వహిస్తారు. వైద్యులు వైరల్ యాంటీబాడీలను (వివిధ వైరల్ ఇన్ఫెక్షన్ల వలన ఏర్పడిన యాంటీబాడీలు) తనిఖీ చేయడానికి మరియు జ్వరం యొక్క ఖచ్చితమైన కారణాన్ని గుర్తించడానికి రక్త పరీక్షలను ఆదేశిస్తారు. వైరస్ను గుర్తించడానికి అల్ట్రాసౌండ్ మరియు ఛాతీ ఎక్స్-రే వంటి ఇమేజింగ్ పరీక్షలతో పాటుగా ఇతర నిర్దిష్ట పరీక్షలను కూడా నిర్వహించవచ్చు.
వైరల్ జ్వరం యొక్క నిర్దిష్టమైన చికిత్స కారణం మీద ఆధారపడి ఉంటుంది. వైద్యులు ఈ క్రింది చికిత్సలను సిఫారసు చేయవచ్చు:
- నొప్పి తగ్గించడానికి నొప్పి నివారిణులు
- జ్వరం తగ్గించడానికి యాంటీ-పైరటిక్ (Anti-pyretic) మందులు
- వైరస్ సంక్రమణ చికిత్సకు యాంటీ వైరల్ మందులు
ఈ కింది జీవనశైలి విధానాలు వైరల్ జ్వరమును నివారించటానికి మరియు చికిత్స చేయటానికి సహాయపడతాయి:
- ఒత్తిడిని తగ్గించడం
- ఆరోగ్యకరమైన మరియు సమతుల్య ఆహారం తీసుకోవడం
- క్రమమైన వ్యాయామం
- తగినంత విశ్రాంతి
- మంచి హైడ్రేషన్ (Good hydration).