వైరల్ ఇన్ఫెక్షన్ అంటే ఏమిటి?
వైరస్లు శరీరంలోని ఆరోగ్యకరమైన కణాల మీద దాడి చేసి మరియు ఆ కణాలలో అవి వృద్ధి చెందినప్పుడు/పెరిగినప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్లు సంభవిస్తాయి. ఈ వైరస్లు ఆరోగ్యకరమైన కణాలకు హాని/నష్టం కలిగిస్తాయి, వాటిని మార్చివేస్తాయి లేదా కొన్నిసార్లు ఆరోగ్య కణాలను చంపేస్తాయి మరియు తద్వారా వ్యక్తిని సులభంగా జబ్బు పడేలా చేస్తాయి, కానీ వ్యక్తికి వైరస్ తో పోరాడే బలమైన రోగ నిరోధక వ్యవస్థ ఉంటే కనుక, వైరల్ ఇన్ఫెక్షన్లు సులభంగా సంభవించలేవు. సాధారణంగా కాలేయం, శ్వాసకోశ మార్గము మరియు రక్తం వైరస్లతో సంక్రమించబడతాయి. కొన్ని వైరస్లు ఎబోలా (Ebola) మరియు మశూచి (స్మాల్ ఫాక్స్) వంటి తీవ్రమైన అనారోగ్యాలకు దారితీయవచ్చు.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
వైరల్ సంక్రమణ/ఇన్ఫెక్షన్ యొక్క సంకేతాలు మరియు లక్షణాలు:
వైరస్ ఇన్ఫెక్షన్ యొక్క సంకేతాలు మరియు లక్షణాలు సంక్రమణకు కారణమైన వైరస్ రకాన్ని బట్టి మారవచ్చు.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
వైరల్ ఇన్ఫెక్షన్ యొక్క కారణాలు:
- వైరస్ సోకిన వ్యక్తి తుమ్మినప్పుడు లేదా దగ్గినప్పుడు వచ్చిన బిందువులను పీల్చడం
- అనారోగ్యానికి గురైన వ్యక్తి చేతులను నేరుగా తాకడం లేదా ఆ వ్యక్తి ఉపయోగించిన బట్టలు, వస్తువులు మొదలైన వాటిని పంచుకోవడం
- మలంతో కలుషితమైన పదార్థాలతో సంబంధం కలిగి ఉండడం
- నాపీలు, టాయిలెట్ హ్యాండిల్స్, బొమ్మలు మరియు కుళాయిలు వంటి కలుషితమైన ఉపరితలాలతో పరోక్ష సంబంధం కలిగి ఉండడం
- కలుషితమైన నీరు లేదా ఆహారం తీసుకోవడం
- హైపో డెర్మిక్ సూదులను (hypodermic needles) పంచుకోవడం లేదా లైంగిక సంబంధాల వంటి వాటి ద్వారా వ్యాధి సోకిన వ్యక్తుల యొక్క శరీర ద్రవాలకు బహిర్గతం కావడం/గురికావడం
- వ్యాధి సోకిన కీటకాలు లేదా జంతువులు కాటుకు గురికావడం (కొరకడం)
- ధూమపానం, మద్యపానం మరియు మాదక ద్రవ్యాలు తీసుకోవడం, ఈ అలవాట్లు రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తాయి
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
ఇమ్యునోగ్లోబులిన్ రక్త పరీక్ష (immunoglobulin blood test) ను నిర్వహించడం ద్వారా వైరల్ ఇన్ఫెక్షన్లను నిర్దారిస్తారు. ఈ పరీక్ష నిర్దిష్ట ఇమ్యూనోగ్లోబులిన్ల స్థాయిలను కొలుస్తుంది, అవి: IgG, IgM మరియు IgA.
సాధారణంగా వైరల్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న వారు పుష్కలంగా ద్రవాలను సేవించాలని మరియు విశ్రాంతి తీసుకోవాలని సూచించబడతారు. లక్షణాలు నుండి ఉపశమనం కలిగించడానికి వైద్యులు పారాసెటమాల్ లేదా ఆస్పిరిన్ (aspirin) వంటి వాటిని సూచించవచ్చు. ఇన్ఫ్లుఎంజా వంటి కొన్ని అంటువ్యాధులకు యాంటీవైరల్ మందులు సూచించబడ్డాయి. వైరల్ సంక్రమణకు కొన్ని సార్లు యాంటిబయోటిక్స్ కూడా సూచించబడవచ్చు; అయితే, అవి వైరల్ ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా సమర్థవంతంగా పనిచేయలేవు.