కళ్ళ నుండి నీళ్లు కారడం ఏమిటి?
కళ్ళ నుండి నీళ్లు కారడం అనేది సాధారణంగా అంతర్లీన సమస్య యొక్క లక్షణం. ఇది చాలా అధికంగా కన్నీరు ఉత్పత్తి కావడం వలన లేదా కన్నీరు సరిగా ఇంకక పోవడం (not drained) వలన సంభవిస్తుంది. కళ్ళ నుండి దుమ్ము వంటి బయటి పదార్దాలను తొలగించడంలో కన్నీళ్లు సహాయం చేస్తాయి మరియు మన కళ్లను తేమగా ఉంచుతాయి. అయితే, కంటి నుండి అధిక మరియు అనియంత్రిత నీరు కారడం అనేది కొన్ని కంటి సమస్యల లేదా అలెర్జీల వల్ల కావచ్చు. కన్ను శరీరం యొక్క ఒక సున్నితమైన మరియు కీలకమైన/ముఖ్యమైన భాగం అందువల్ల ఇటువంటి సమస్య ఏర్పడిన సందర్భంలో వెంటనే ఒక వైద్యుణ్ణి సంప్రదించడం సరైన మార్గం.
దాని ప్రధాన సంబంధిత సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
కళ్ళ నుండి నీళ్లు కారడానికి సంబంధించిన లక్షణాలు:
- కనురెప్పల అంచుల వాపు
- కళ్ళు ఎర్రబారడం
- కళ్ళ దురద
- కంటిలో ఒక ఏదో నలక ఉన్న భావన
- కంటిలో చికాకు
- కంటిలో నొప్పి
- మసకగా కనిపించడం
- తలనొప్పి
- ప్రకాశవంతమైన కాంతికి సున్నితత్వం
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
అత్యంత సాధారణ కారణం కళ్ళు పొడిబారడం, ఎందుకంటే కళ్ళు పొడిబారడం వలన అది దురదను కలిగిస్తుంది ఆ దురదను తగ్గించడానికి కళ్ళు నీళ్లను అధికంగా ఉత్పత్తి చేస్తాయి. ఇతర కారణాలు:
- కండ్లకలక
- ఇన్ఫెక్షన్
- కన్నీటి వాహిక (tear duct) నిరోధించబడడం
- కనురెప్పలు లోపలికి లేదా బయటికి తిరిగిపోవడం
- దుమ్ము మరియు బూజు వలన అలెర్జీ
- ప్రకాశవంతమైన వెలుతురు
- కంటిలో ధూళి బయటి పదార్థం ఉండడం
- చికాకు లేదా గాయం
- కనురెప్ప వెంట్రుకలు లోపలి దిశలో పెరగడం
- చుట్టుప్రక్కల రసాయనాల యొక్క ఉనికి
కొన్నిసార్లు నవ్వడం, ఆవలింతలు, వాంతులు మరియు కళ్ళు ఒత్తిడికి గురైనప్పుడు కూడా కళ్ళ నుండి నీళ్లు అధికంగా కారుతాయి.
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
వైద్యులు కొన్ని లక్షణాల సంబంధిత ప్రశ్నలను అడగడం మరియు కంటి పరీక్షను నిర్వహించడం ద్వారా కళ్ళ నుండి నీళ్లు కారడానికి గల కారణాన్ని విశ్లేషిస్తారు. కంటికి మరియు చుట్టూ ఉన్న మృదు కణజాలాల (soft tissues)ను తనిఖీ చేయటానికి వైద్యులు కంటికి పెన్ లైట్ (penlight) పరీక్షను నిర్వహిస్తారు. రోగ నిర్ధారణను ధ్రువీకరించడానికి వైద్యులు కొన్ని నిర్దిష్ట కంటి పరీక్షలను కూడా సిఫారసు చేయవచ్చు.
చికిత్స పూర్తిగా కళ్ళ నుండి నీళ్లు కారడం యొక్క కారణం మీద ఆధారపడి ఉంటుంది. నీళ్ళు కారడం కొన్ని కంటి సమస్యల వలన ఐతే, చాలా వాటి చికిత్సకు ప్రస్తుతం వివిధ ఆధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కారణం ఒక అలెర్జీ ప్రతిచర్య ఐతే, అలెర్జీకి చికిత్స చేయడం అనేది నీళ్ళు కారడాన్ని తగ్గిస్తుంది.
కంటిలోని ఏదైనా బయటి వస్తువు (నలక) ఉండిపోతే నేత్ర వైద్యులు దానిని తొలగించవచ్చు. పొడి కళ్ళకు లూబ్రికెంట్ కంటి చుక్కలు (Lubricant eyedrops) సూచించబడతాయి. బాక్టీరియల్ సంక్రమణ కోసం యాంటిబయోటిక్ కంటి చుక్కలు ఇవ్వవచ్చు. నిరోధించబడిన కన్నీటి వాహిక మరియు కనురెప్పల సమస్యలు వంటి వాటి కోసం శస్త్రచికిత్స అవసరం కావచ్చు.