బహిరంగ పుండు అంటే ఏమిటి?
చర్మం మీద చీలిక/పగులు ఏర్పడి అంతర్లీన కణజాలాలు బయటకి బహిర్గతం అయ్యే రకమైన పుండ్లను బహిరంగ పుండ్లు అని పిలుస్తారు. దీని ఫలితంగా, పుండ్లు రక్తస్రావం మరియు అంటురోగాలకు సులభంగా గురవుతాయి. చాలా బహిరంగ పుండ్లు చర్మపు ఉపరితలంపై (పై పొర) మాత్రమే సంభవిస్తాయి మరియు అవి తేలికపాటివి. కానీ కొన్ని పుండ్లు తీవ్రంగా ఉంటాయి మరియు నరములు, రక్త నాళాలు మరియు కండరములు వంటి లోపలి కణజాలాలను ప్రభావితం చేస్తాయి.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
బహిరంగ పుండ్ల ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు:
- నొప్పితో కూడిన చర్మ (కమిలిన) గాయము
- తక్కువ లేదా తీవ్రమైన రక్తస్రావం
- చర్మం గాయపడిన ప్రాంతాల చుట్టూ వ్యాపించే నీలం లేదా ఎరుపుదనం
- ప్రభావిత ప్రాంతం దాని విధిని నష్టపోవడం
- వాపు
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
బహిరంగ పుండు మరియు అటువంటి గాయాల ప్రధాన కారణాలు ఈ కింది విధంగా ఉంటాయి:
- ఏదైనా గరుకు ఉపరితలం మీద చర్మం రాకుకుంటే లేదా గీరుకుంటే, రాపిడి గాయం (abrasion) అని పిలిచే ఒక లోతులేని గాయం ఏర్పడుతుంది.
- ఆకస్మిక గాయం లేదా ప్రమాదాల వలన ఏదైనా వస్తువుకు గట్టిగా గుద్దుకోవడం వలన సంభవించే లోతైన గాయాన్ని చీలిన గాయం (laceration) అని పిలుస్తారు.
- ఒక కత్తి వంటి పదునైన వస్తువు వలన చర్మం తెగితే, ఒక గీత వంటి గాయం ఏర్పడుతుంది దానిని కోత/గాటు (incision) అని పిలుస్తారు.
- గోళ్ళు, సూదులు లేదా దంతాలు (మానవులు లేదా జంతువులు కొరకడం వలన) వంటి మొనలు పదునుగా ఉండే వస్తువుల వలన పుండు ఏర్పడితే దానిని పంక్చర్ గాయం (puncture wound) అని పిలుస్తారు.
- బుల్లెట్ వంటి బలమైన వస్తువులు చర్మాన్ని చీల్చి గాయాన్ని ఏర్పరిస్తే, దానిని చొచ్చుకొనిపోయే రకమైన (penetrating type) బహిరంగ పుండు అంటారు.
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
బహిరంగ పుండు యొక్క భౌతిక పరీక్ష వైద్యులకు గాయాన్ని అంచనా వేయడానికి మరియు సరైన చికిత్సను అందిచడానికి సహాయపడుతుంది.
బహిరంగ పుండ్ల చికిత్స కోసం ఈ క్రింది పద్ధతులను ఉపయోగిస్తారు:
- పుండు/గాయం నుండి రక్తస్రావం అవుతుంటే, శుభ్రమైన బ్యాండేజ్ ను ఉపయోగించి సున్నితమైన ఒత్తిడిని/పీడనాన్ని కలిగించడం ద్వారా రక్తస్రావాన్ని ఆపివేయవచ్చు.
- గాయాన్ని కలిగించిన వస్తువులను తొలగించి నీటిలో గాయాన్ని శుభ్రంగా కడగడము మరియు ఏవైన వ్యర్థ పదార్దాలు ఉంటే వాటిని తొలగించటానికి ఒక స్టెరైల్ సొల్యూషన్ శుభ్రం చెయ్యడం ద్వారా ఇన్ఫెక్షన్ అవకాశాలను తగ్గించవచ్చు
- గాయం మీద యాంటీబయోటిక్ ఆయింట్మెంట్ ను పలచని పొరలా పూయాలి/రాయాలి.
- స్టేపుల్స్, స్టెరైల్బ్యాండేజ్లు, కుట్లు లేదా చర్మానికి అంటుకునే బ్యాండ్లను (skin adhesive bands) ఉపయోగించి పుండ్లను కప్పవచ్చు.
- మునుపటి టీకామందు (vaccine) తీసుకుని నుండి ఐదు సంవత్సరాలకు పైగా అయితే, టేటానాస్ షాట్ (tetanus shot) ఇవ్వబడుతుంది, ఇది ముఖ్యంగా ఇంఫెక్షన్ అవకాశం ఉండే గాయాలు లేదా జంతువు లేదా మానవ కాటు సంభవించిన సందర్భంలో ఇవ్వబడుతుంది.