ఎల్లో ఫీవర్ అంటే ఏమిటి?
ఎల్లో ఫీవర్ ‘ఏడీస్ ఈజిప్టి’ (Aedes aegypti) రకం దోమల ద్వారా వ్యాపించే ఓ తీవ్రమైన వైరల్ సంక్రమణం (అతిసూక్ష్మజీవుల కారకంతో సంభవించే రుగ్మత). సాధారణంగా, ఆఫ్రికాలో మరియు మధ్య అమెరికా మరియు దక్షిణ అమెరికాలో ఈ ఎల్లో ఫీవర్ ఉనికిని కనుక్కోబడింది. ఎల్లో ఫీవర్నే “ఎల్లో జాక్” లేదా “ఎల్లో ప్లేగు” అని కూడా పిలుస్తారు. ఎల్లో ఫీవర్ వైరస్తో సంక్రమించిన దోమలు కుడితేనే ఎల్లో ఫీవర్ సంభవించవచ్చు. కొందరు వ్యక్తులు కామెర్లు వ్యాధిలో లాగా చర్మం మరియు కళ్ళలోని తెల్లని భాగం పసుపుపచ్చగా మారిపోవడం ఈ ఎల్లోఫీవర్ లక్షణం గనుక ఈ వ్యాధి పేరులో ఎల్లో (‘'పసుపు') అనే పదం చోటు చేసుకుంది.
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
ఎల్లో ఫీవర్ యొక్క దశ ఆధారంగా ఆవ్యాధి లక్షణాలను వర్గీకరించవచ్చు:
- ఆకలి లేకపోవడం, జ్వరం, కామెర్లు, ఎర్రబారటం, తలనొప్పి , కీళ్ళ నొప్పి, కండరాల నొప్పి మరియు వాంతులు లాంటివి 1వ దశలో ఎదుర్కొనే సాధారణ వ్యాధి లక్షణాలు.
- 1వ దశ యొక్క వ్యాధిలక్షణాలు అదృశ్యమైపోతాయి మరియు చాలా మంది వ్యక్తులు స్వస్థత చేకూర్చుకుని తిరిగి ఆరోగ్యవంతులవుతారు. కానీ కొన్ని సందర్భాల్లో, లక్షణాలు 24 గంటల తర్వాత మళ్లీ కనిపిస్తాయి.
- కాలేయం, గుండె, మరియు మూత్రపిండాల సమస్యలు; రక్తస్రావం లోపాలు; కోమా; మలంలో రక్తం పడటం; సన్నిపాతం; ముక్కు, కళ్ళు మరియు నోటిలో నుండి రక్తస్రావం అనేవి 3వ దశలో కనిపించే తీవ్రమైన వ్యాధిలక్షణాలు.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
అంటువ్యాధి సోకిన దోమ కాటువల్ల ఎల్లో ఫీవర్ వస్తుంది. ఇలా దోమ కాటుకు గురైన మూడు నుండి ఆరు రోజుల తర్వాత నుండి ఎల్లో ఫీవర్ వ్యాధి లక్షణాలు కానరావడం ప్రారంభమవుతుంది.
దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
రోగనిర్ధారణ సాధారణంగా వ్యక్తి యొక్క వ్యాధిలక్షణాల ఉనికిని తెలుసుకునేందుకు భౌతిక పరీక్ష ఉంటుంది. మీకు ఎల్లో ఫీవర్ యొక్క ఏవైనా ఇతర లక్షణాలను కలిగి ఉన్నారా అని తనిఖీ చేసేందుకు డాక్టర్ మిమ్మల్ని వివిధ ప్రశ్నలను అడగవచ్చు. వైద్యుడు మీకు ఎల్లో ఫీవర్ ఉందని అనుమానించినట్లయితే, రోగ నిర్ధారణను ధృవీకరించేందుకు అతడు లేక ఆమె రక్త పరీక్షను ఆదేశిస్తారు. రక్త పరీక్ష కూడా కాలేయం మరియు మూత్రపిండాల వంటి అవయవాలు వైఫల్యాన్ని బహిర్గతం చేయవచ్చు.
ఈ వ్యాధికి నిర్దిష్ట చికిత్స అందుబాటులో లేదు, కానీ వ్యాధి లక్షణాలకు చికిత్స పద్ధతులు సాధారణంగా సూచించబడతాయి:
- తీవ్రమైన రక్త స్రావం విషయంలో రక్తం మరియు రక్త ఉత్పత్తి మార్పిడి
- మూత్రపిండ వైఫల్యం విషయంలో డయాలసిస్
- నిర్జలీకరణాన్ని (డీహైడ్రేషన్) నివారించడానికి లేదా ద్రవ నష్టపరిహారాన్ని శరీరానికి కల్పించేందుకు ఇంట్రావెనస్ ద్రవాలు ఇవ్వబడతాయి.
ఎల్లొఫీవర్ వ్యాధికి గురైన ప్రదేశానికి వెళ్లడానికి ముందు టీకాలు వేయించుకోవడం ద్వారా ఎల్లొఫీవర్ ని నిరోధించవచ్చు.