myUpchar Call

సురక్షితమైన సంభోగం అనేది సంభోగ చర్యకు ముందు మరియు సంభోగం జరిపే సమయంలోను కూడా తీసుకోవాల్సిన పలు జాగ్రత్త చర్యల అభ్యాసాన్ని సూచిస్తుంది. ఇది మిమ్మల్ని మరియు మీ భాగస్వామిని సుఖవ్యాధులు (లేక లైంగికంగా సంక్రమించే వ్యాధులు-STDs) మరియు సంబంధిత అంటురోగాల (STIs) నుండి రక్షించడంలో సహాయపడుతుంది. సురక్షితమైన సంభోగం మీ ఆరోగ్యాన్ని,  ఆయుస్సును కూడా మెరుగుపరుస్తుంది మరియు మీ లైంగిక అనుభవాన్ని పెంచుతుంది. అలా కాకుండా సంభోగంలో జాగ్రత్త చర్యల అభ్యాసాన్ని పాటించకపోతే, అసురక్షిత సంభోగంవల్ల, లైంగికచర్యల ద్వారా వ్యాపించే వ్యాధుల (STDs) చేత బాధించబడే అవకాశం ఉంది. అత్యంత సాధారణమైన లైంగికచర్యల ద్వారా వ్యాపించే వ్యాధులు (STDs) మరియు లైంగికచర్యల ద్వారా వ్యాపించే అంటువ్యాధులు  (STIs):

సంభోగంలో పాల్గొన్నపుడల్లా సుఖవ్యాధుల (STDs) గురించిన ప్రమాదం మదిలో మెదుల్తుంది. అయితే సురక్షితమైన సంభోగాన్ని పాటించడం ద్వారా ఈ సుఖవ్యాధుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. ఒక భాగస్వామితో సంభోగాన్ని (లైంగిక సంబంధం) కలిగి ఉండటం సురక్షితం అని సూచించబడింది, ఎందుకంటే చాలామంది సంభోగ భాగస్వాముల్ని కలిగివున్న వ్యక్తులలో సుఖవ్యాధుల (ఎస్.డి.డిల). యొక్క ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ, ఎవరైనా చాలామంది సంభోగ భాగస్వాముల్ని కల్గినవారితో సంభోగాన్ని జరపాల్సివస్తే సంభోగం సమయంలో రక్షణను (కండోమ్స్ వంటివి) ఉపయోగించడం చాలా అగత్యం.

సుఖవ్యాధులు లేదా లైంగిక సంక్రమణ వ్యాధులు (STDs) యోని సంభోగంలోనే వ్యాపిస్తాయి ఇతర (యోనేతర) సంభోగచర్యల కార్యకలాపాలలో వ్యాపించవు అనే నమ్మకానికి విరుద్ధంగా, ఈ లైంగిక వ్యాధులలో అధికభాగం తరచూ పాయువుమార్గం ద్వారానే వ్యాపిస్తాయని గమనించండి. మౌఖిక సంభోగం (oral sex) లేదా నోటి సెక్స్ ద్వారా కూడా గనేరియా (Gonorrhea) వంటి సుఖవ్యాధులు వ్యాపిస్తాయి. కాబట్టి, ఏ విధమైన సంభోగం (అంటే యోని, పాయువు లేదా నోటితో చేసే సంభోగం) చేసినా రక్షణను ఉపయోగించడం చాలా అవసరం.

సంభోగ  సమయంలో కండోమ్స్ లేదా ఆడ కండోమ్లు (ఫెమిడోమ్స్) వంటి గర్భనిరోధక పరికరాలను ఉపయోగించడం అత్యంత సాధారణ మరియు సమర్థవంతమైన రక్షణా పద్ధతి. సురక్షితమైన సంభోగానికి ఇతర పద్ధతులు, చిట్కాలు, (కండోమ్ల వంటి) పరికరాలతోపాటు గర్భనిరోధకాల ఉపయోగం గురించి ఈ వ్యాసంలో చర్చించబడింది.

  1. సురక్షిత సంభోగం కోసం కండోమ్లు - Condoms for safe sex in Telugu
  2. సురక్షితమైన సంభోగాన్ని పొందడమెలా? - How to have safe sex in Telugu
  3. సురక్షిత మరియు అసురక్షిత లైంగిక చర్యల జాబితా - List of safe and unsafe sexual activities in Telugu
  4. మీ అంతట మీరే తీవ్ర ప్రమాదానికి ఎలా గురవుతారు? - How do you put yourself at a greater risk in Telugu
  5. మీరు అసురక్షిత సంభోగం చేస్తే ఏమిచేయాలి? - What to do if you had unsafe sex in Telugu
సురక్షితమైన సంభోగాన్ని పొందడమెలా? వైద్యులు

సురక్షిత సంభోగం జరపడానికి కండోమ్లవాడకం అత్యంత ప్రభావవంతమైన మార్గం మరియు అవి జేబులో సులభంగా ఇమడతాయి కూడా. వాస్తవానికి, భారత ప్రభుత్వం యొక్క ఒక కొత్త చొరవ ప్రకారం, ఒక కండోమ్ ప్యాక్ను ఉచితంగా పొందవచ్చు. కండోమ్ ను తీసుకువెళ్ళడం, ఉపయోగించడం మరియు దాన్ని తొలగించివేయడం కూడా చాలా సులభం, మరియు స్త్రీ-పురుషులు ఇద్దరూ కూడా వీటిని సంభోగంలో రక్షణగా జననేంద్రియాలపై ధరించవచ్చు. అయితే, కండోమ్ల గరిష్ట ప్రభావాన్ని పొందేందుకు క్రింది అంశాలు (పాయింట్లు) గమనించాలి:

  • లైంగిక కార్యకలాపాలు ప్రారంభించటానికి ముందు ఎల్లప్పుడూ కండోమ్ ఉండేలా చూసుకోండి. దీన్నిపురుషాంగానికి స్థిరంగా ధరింపజేయాలి మరియు క్రిందికి జారకుండా, కండోమ్ కు మరియు పురుషాంగానికి మధ్య ఖాళీ గాని, గాలి గాని లేకుండా చూసుకోవాలి.
  • ఒకవేళ, మీరు గనుక ఆడ కండోమ్ (femidom) వాడుతుంటే, యోని మరియు దాని ద్వారభాగం ఆడ కండోమ్ తో పూర్తిగా కప్పబడి ఉండేలా చూసుకోండి, మరియు పురుషాంగం కండోమ్తో కప్పబడ్డ యోనిలోకి దూరేలాగున చూసుకోండి. ఆడకండోమ్ యొక్క అంచులు యోని మధ్య ప్రాంతంలో ఇరుక్కుపోకుండా చూసుకోండి.
  • సంభోగం అయిన తర్వాత కండోమ్ సరిగ్గా తొలగించబడేలా చూసుకోండి. కండోమ్  ను తొలగించేటపుడు కండోమ్ నుండి వీర్యం ఒలికి మీ భాగస్వామి యొక్క యోని, దాని  చొట్టూపక్కల పడకుండా ఉండేట్లు జాగ్రత్త తీసుకోవాలి. ఆడ కండోమ్ ను ఉపయోగించినప్పుడు హెచ్చరికతో కూడిన అదనపు జాగ్రత్త అవసరం, యోని నుండి ఆడకండోమ్ ను తొలగించేటపుడు అందులోని వీర్యం యోని లోపల ఒలికిపోకుండా చూసుకోవాలి.
  • సంభోగంలో కండోమ్ చిరిగిపోయిందని లేక పగిలిపోయిందని మీకనిపిస్తే సంభోగక్రియను ఆపివేసి మరో కండోమ్ ను ఉపయోగించడం చాలా అవసరం.
  • ఒకే ఆవృతిలో (in a cycle) ఎవరైనా రెండుసార్లు సంభోగం జరుపుతున్నట్లైతే, ఆ రెండు సార్లకూ ప్రత్యేక కండోమ్ లను వేర్వేరుగా ఉపయోగించాలని సిఫార్సు చేయబడింది, దీనివల్ల కండోమ్ చిరిగిపోవడమో లేక పగిలిపోయే ప్రమాదం లేకుండా ఉంటుంది.
  • మగవాళ్ళ కండోమ్ మరియు ఆడవాళ్ళ కండోమ్ రెండూ సమానమైన రక్షణను అందిస్తాయి. భాగస్వాముల్లో ఎవరో ఒకరు మాత్రం ధరిస్తే చాలు, ఇద్దరూ ధరించకూడదు, అల్లా భాగస్వాములిద్దరూ కండోమ్లు ధరించడంవల్ల సంభోగంలో ఏర్పడే ఘర్షణకు కండోమ్లు  విచ్ఛిన్నం కావచ్చు.
  • స్పెర్మిసైడ్ (గర్భాన్ని నిరోధించడానికి సంభోగానికి ముందుగానే యోనిలోకి ప్రవేశపెట్టే స్పెర్మిసైడ్ రసాయనాలు. ఈ రసాయనాలు పురుషవీర్యం ఆడగుడ్డుతో కలవకుండా నిరోధిస్తాయి) ను కండోమ్ తో పాటు ఉపయోగించడం HIV సోకె ప్రమాదాన్ని పెంచుతుంది కనుక కండోమ్తో పాటుగా స్పెర్మ్సైడ్లను ఉపయోగించకూడదు. ఇలా స్పెర్మిసైడ్-కండోమ్ రెండూ ఉపయోగించడంవల్ల హెచైవి ఎందుకు సోకుతుందనేదాన్ని అర్ధం చేసుకోవడానికి తదుపరి అధ్యయనాలు అవసరం.
  • సంభోగంలో కండోమ్ చిరిగిపోకుండా ఉండేందుకు కందెనలు (lubricants)  ఉపయోగించడం సిఫార్సు చేయబడింది, అయితే ఆ కందెనలు నీటి ఆధారితమైన వాటిని మాత్రమే వాడండి. ఎందుకంటే చమురు-ఆధారిత కందెనలు సంభోగ సమయంలో చిరిగిపోవడానికి అధిక అవకాశాలు ఉన్నాయి. కొంతమంది నిపుణులు పాలియురేతేన్ కండోమ్స్ వాడకాన్ని సిఫార్సు చేస్తారు, ఎందుకంటే లేటెక్స్ కండోమ్ల కంటే పాలియురేతేన్ కండోమ్స్ ఎక్కువ నిరోధకతను కలిగి ఉంటాయి.
  • అన్ని రకాలైన సంభోగాలకూ కండోమ్ ను ఉపయోగించడం బహుముఖ్యం.యోని సంభోగం, నోటి సంభోగం, పాయువు సంభోగం లేదా హంపింగ్ వంటి ఇతర కార్యక్రమాలలోను, జననేంద్రియాలను తాకినప్పుడు కూడా కండోమ్ ఉపయోగించడం చాలా ముఖ్యమైనది. భాగస్వాములిరువురూ నోటితో చేసే సంభోగం  విషయంలో, వివిధ రకాలైన సింథెటిక్ ఫ్లేవర్లతో చేసిన ఫ్లేవర్ కండోమ్లు, అందుబాటులో ఉంటాయి.
  • అదనంగా, మీరు సంభోగం జరిపేటపుడు మంచి నాణ్యత కల్గిన కండోమ్ ను ఉపయోగించటం చాలా అవసరం. కండోమ్ గడువు తేదీని పరిశీలించడం మరియు అవసరమైనంత గది ఉష్ణోగ్రత వద్ద కండోమ్లను నిల్వ ఉంచడం అనేవి కండోమ్ను ఉపయోగించటానికి ముందు తీసుకోవలసిన కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు.

సంభోగసమయంలో కండోమ్లను క్రమంగా వాడటంవల్ల సుఖరోగాలు సోకె ప్రమాదాన్ని తగ్గిస్తుంది.కాండోమ్ని తగినవిధంగా వాడితే దానిప్రభావం వ్మరింత మెరుగ్గా ఉంటుంది. పైన పేర్కొన్న చిట్కాలను అనుసరించడం ద్వారా కండోమ్ల యొక్క 98% ప్రభావాన్ని పొందగలరని ఆశించవచ్చు.

(మరింత చదువు: కండోమ్ ను ఎలా ఉపయోగించాలి)

Delay Spray For Men
₹249  ₹499  50% OFF
BUY NOW

సురక్షితమైన సంభోగం అనుభవాన్ని పొందడానికి కండోమ్ ప్రాథమికమైన అగత్య సాధనం. దీనితోపాటు, సురక్షితమైన సంభోగాన్ని పొందడానికి మరికొన్ని ఇతర మార్గోపాయాలున్నాయి. గర్భవతి కావాలనుకుంటున్న వారు కండోమ్స్ ఉపయోగించి గర్భం పొందలేరు, అది అసాధ్యం, ఎందుకంటే కండోమ్లు గర్భనిరోధక చర్యను కల్గిస్తాయి కాబట్టి.. అయినప్పటికీ, మీరు గర్భవతి కావాలనుకుని సంభోగం పొందాలనుకుంటే, సంభోగసమయంలో రక్షణ ను కల్పించుకోవడం అవసరం. అలాంటి రక్షణను కల్పించేందుకు క్రింద పేర్కొన్న చిట్కాలు సహాయపడతాయి.

  • మీ భాగస్వామితో అతని/ఆమె సంభోగ అనుభవాలు మరియు చరిత్ర గురించి ఒక ఆరోగ్యకరమైన సంభాషణను ప్రారంభించండి, ఏవైనా అంటువ్యాధుల చరిత్ర ఉన్నట్లయితే దాన్ని అర్థం చేసుకోవడంలో ఈ సంభాషణ మీకు సహాయపడవచ్చు .
  • మిమ్మల్ని మీరు మరియు మీ భాగస్వామిని వైద్యకీయంగా పరీక్షించండి, మీ ఇద్దరిలోను, అలాగే మీ శిశువులో సంభోగ-పర అంటురోగాల (STD) లను నిరోధించడంలో సహాయపడుతుంది.
  • మీ వైద్యుడిని సంప్రదించి, HPV (మానవ పాపిల్లోమావైరస్) టీకాను పొందండి. ఈ టీకా మందు సాధారణంగా స్త్రీ పురుషుల్లో వచ్చే సంభోగ అంటువ్యాధుల (STDs) మరియు కొన్ని రకాల క్యాన్సర్ల  ప్రమాదానికి సంబంధించినది. ఈ టీకామందు ఉత్తమ ప్రభావాల్ని పొందడానికి సంభోగానికి ముందుగా, లేదా గర్భధారణకు ముందుగా ఈ టీకాను తీసుకోవల్సిందిగా సిఫార్సు చేయబడింది. అయితే ఈ టీకా మందును గర్భిణీ స్త్రీలు తీసుకోకూడదు. (మరింత సమాచారం: గర్భవతి కావడం ఎలా?)
  • సంభోగపర అంటురోగాలు మీకు సోకకుండా ఉండేందుకు మరియు మీ భాగస్వామికి అంటకుండా ఉండేందుకు మీ జననేంద్రియాల్ని పరిశుభ్రంగా ఉంచుకోండి.(మరింత సమాచారం: యోని ఈస్ట్ సంక్రమణ యొక్క చిహ్నాలు)
  • ఒకసారి సంభోగంలో పాల్గొన్నప్పుడు యోని సంభోగం లేదా పాయువు (anal) సంభోగం ఏదైనా ఒక పధ్ధతికి కట్టుబడి సంభోగించడం మంచిది. పాయువు సంభోగమైన తర్వాత యోని సంభోగం చేయడాన్ని సిఫారస్ చేయబడదు, అదీ కండోమ్లవంటి ఎలాంటి రక్షణ లేకుండానే ఇలా రెండు పద్ధతుల్లో సంభోగించడంమంచిది కాదు, అలా రెండు పద్ధతుల్లోనూ రక్షణ లేకుండా సంభోగించడం అంటువ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది.
  • ఏవైనా నొప్పి, జననేంద్రియం పొడిబారడం, అధిక యోని ఉత్సర్గ వంటి లక్షణాలు ఏవైనా ఉంటే, మీ సంభోగ జీవితాన్ని పునఃప్రారంభించే ముందు, ఒక స్త్రీరోగవైద్యురాలిని (స్త్రీ జననేంద్రియ వైద్యుడు) సందర్శించటం మంచిది.

సంభోగమనేది, ప్రధానంగా, పురుషాంగాన్నియోనిప్రవేశం చేయడంగా సూచిస్తారు. సంభోగంలో పాల్గొనే భాగస్వాములు తమకు ఇష్టమైన ఇతర సంభోగ కార్యకలాపాలను కలిగి ఉండవచ్చు. వాటిలో కొన్ని పద్ధతులు మాత్రం, ఇతరపద్ధతుల కంటే, సురక్షితమని భావిస్తారు. సంభోగంలో పాల్గొనేందుకు ముందు సురక్షితమైన మరియు అసురక్షిత లైంగిక అభ్యాసాల గురించి తెలుసుకోవాలి.

సురక్షిత లైంగిక కార్యకలాపాలు - Safe sexual activities in Telugu

ఇక్కడ పేర్కొన్న లైంగిక కార్యకలాపాలు సాధారణంగా సురక్షితమని భావిస్తారు. ఏదేమైనా, ఈ లైంగిక కార్యకలాపాలు వేటిలోనైనా పాల్గొనేటపుడు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు సూచించడమైంది, సంభోగంలో సంపూర్ణ రక్షణ పొందడానికి ఈ తీసుకోవడం అగత్యం.

  • ముద్దులాడడం (kissing)
    ముద్దులాడడం (కిస్సింగ్) సాధారణంగా సురక్షితంగా భావించబడుతుంది, కానీ కొన్ని సంభోగపర వ్యాధులు (STDలు) నోటి మార్గంద్వారా, ముఖ్యంగా బహిర్గతమైన గాయాలు లేదా కోతలు (పెదవులు, నోటిభాగాల్లో) ఉన్నపక్షంలో, వ్యాప్తి చెందుతాయి . కాబట్టి, మీ భాగస్వామి ఏవైనా ఇలాంటి చికిత్స చేయని తాజా నోటి గాయాలను కలిగి ఉంటే ముద్దులాడేటపుడు జాగ్రత్తగా ఉండటం మంచిది.
  • హస్త ప్రయోగం లేదా పరస్పర హస్తప్రయోగం లేదా ఒకరినొకరు ముట్టుకోవడం
    లైంగిక కార్యకలాపాల్లో హస్తప్రయోగమనేది సంభోగపర వ్యాధులనుండి రక్షణ పొందడానికి ఉన్న అత్యంత సురక్షితమైన రూపం, కానీ మీరు ఇన్ఫెక్షన్లను నివారించడానికి మీ చేతుల్ని శుభ్రంగా ఉంచుకుని హస్తప్రయోగం చేసుకోవడం మంచిది.  పాయువును (ఆసనాన్ని) తాకిన తరువాత, యోనిని తాకడానికి ముందు, చేతులు తప్పకుండా కడుక్కోవడం చాలా మంచిది. పరస్పర హస్త ప్రయోగంలో, మీ భాగస్వామిని తాకడానికి ముందు మీ చేతులను కడుక్కోవడం మరియు వాటితో (చేతుల్తో) మిమ్మల్ని మీరు తాకేందుకు ముందు తిరిగి చేతుల్ని కడుక్కోవడం మంచిది.
  • జననేంద్రియ అవయవాలు కాని చర్మ ఉపరితలాలపై వీర్యాన్ని స్ఖలించడం
    వీర్యాన్ని స్ఖలించేటపుడు చర్మం ఉపరితలం చెక్కుచెదరకుండా ఉండేట్లు, ఎలాంటి గాయాలు, కోతలు (cuts) లేవని నిర్ధారించుకోవాలి. ఏదైనా బహిరంగ గాయంపై వీర్యస్ఖలనం జరిపితే రక్తం ద్వారా సంక్రమణ వ్యాప్తికి అవకాశాలున్నాయి. యోనికి దగ్గరగా వీర్యస్ఖలనం చేయకూడదు, ఎందుకంటే ఇది అంటువ్యాధులకు దారితీసే అవకాశం ఉంది.

అసురక్షితమైన లేదా అధిక-ప్రమాదకర లైంగిక చర్యలు - Unsafe or high-risk sexual activities in Telugu

క్రింద పేర్కొన్న లైంగిక చర్యలు పాటించడంవల్ల వ్యక్తి సంభోగసంబంధ వ్యాధుల్ని పొందే అధిక ప్రమాదం ఉంది. సంభోగంలో పాల్గొనేటపుడు వ్యక్తి కింద పేర్కొన్నలాంటి లైంగిక చర్యల్ని చేపట్టకపోవడం మంచిదని సూచించబడింది.

  • కండోమ్ ఉపయోగించకుండా సంభోగం
    చాలామంది ఉపసంహరణ (withdrawal method) పద్ధతి (పురుషులు స్ఖలనానికి ముందు పురుషాంగాన్ని ఉపసంహరించుకుంటూ సంభోగం చేయడం) లైంగిక అంటువ్యాధులు (STIలు) సోకకుండా రక్షణ కల్పించవచ్చని నమ్ముతారు, కానీ ఇది నిజం కాదు. కొన్నిసార్లు, జననేంద్రియాలపైన ఉండే పూర్వ-స్ఖలన ద్రవంలో అంటురోగకారకాలను కలిగి ఉండవచ్చు, ఆవిధంగా ఆ వీర్యం STIలకు మూలంగా పనిచేస్తుంది. కాబట్టి, అన్ని వేళలా కండోమ్ ను ఉపయోగించడం ముఖ్యం.
  • కండోమ్ పునర్వినియోగం లేదా కండోమ్ చిరిగినా కూడా సంభోగాన్ని కొనసాగించడం
    కండోమ్ పునర్వినియోగంవల్ల కండోమ్ను ఉపయోగించకుండా చేసే సంభోగంవల్ల కలిగే ప్రమాదాలే కలుగుతాయి.
  • కండోమ్ లేకుండా నోటితో సంభోగం
    నేషనల్ హెల్త్ సొసైటీ (NHS) ప్రకారం, కండోమ్ లేకుండా నోటితో లైంగిక అభ్యాసం చేయడం గనోరియా, హెర్పెస్ మరియు సిఫిలిస్ వంటి సంభోగ అంటువ్యాధుల (STIల) ప్రమాదాన్ని పెంచుతుంది.
  • కండోమ్ లేకుండా పాయువు సంభోగం
    కేవలం పాయువుగుండా జరిపే సంభోగం ద్వారా గర్భవతి పొందలేరన్నది వాస్తవం, అంటే దానర్థం పాయువు సంభోగం సంభోగసంబంధ అంటువ్యాధుల్ని నిరోధించగలదని అర్థం కాదు. అన్ని రకాలైన సంభోగ పద్ధతులకూ కండోమ్ ను ఉపయోగించడం చాలా అవసరం.
  • బహుళ లైంగిక భాగస్వాములను కలిగి ఉండటం వలన
    ప్రధానంగా మీరు ఎటువంటి రక్షణను, (అంటే కండోమ్ ను) ఉపయోగించకుండా చాలామంది సంభోగ భాగస్వాములతో సంభోగిస్తే, అది సంభోగసంబంధ అంటువ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. అదే మీరు ఒక సెక్స్ వర్కర్తో సంభోగిస్తే సంభోగసంబంధ అంటువ్యాధుల ప్రమాదం కారకం మరింత తీవ్రతరం అవుతుంది.
  • భద్రత (జాగ్రత్త) లేని స్వలింగ సంపర్క సంబంధం
    సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అనే సంస్థ ప్రకారం, ద్విలింగక (బైసెక్సువల్) పురుషులు రక్షణలేని స్వలింగ సంభోగం జరిపితే సంభోగసంబంధ వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉంది, ముఖ్యంగా హెచ్.ఐ.వి.వ్యాధి భారిన పడే ప్రమాదముంది. హెచ్.ఐ.వి. కేసుల్లో సింహపాలు స్వలింగ సంపర్కాల్లోనే నిర్ధారణ జరిగింది. అలాంటి గణాంకాలకు సంబంధించిన వ్యక్తుల విషయాల్లో కండోమ్ల వాడకం తక్కువగా ఉండటం వలననే సంభోగసంబంధ అంటువ్యాధులు సంభవించాయి, ఎందుకంటే, స్వలింగ సంపర్క సంబంధంలో గర్భం వస్తుందన్న ప్రమాదం లేదు కాబట్టి.

కింది చర్యలవల్ల మీ అంతట మీరు సంభోగపర-అంటురోగాల (STDs)కు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంది:

  • పరీక్ష చేయించుకోకపోవడంవల్ల
  • ఎవరో ఒకరు  సుఖవ్యాధులకు లోనయ్యారని ఊహించుకుందాం, మరలాంటపుడు కింది  వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి-వ్యాధి లక్షణాలు వాస్తవంగా కనబడ్డానికి  ముందు సుఖవ్యాధులకు చాలా ఎక్కువ పొదిగే కాలం (incubation period) ఉంటుంది. మిమ్మల్ని అత్యాశ్చర్య పరిచే సంగతేమిటంటే వ్యక్తి ఎయిడ్స్ (AIDS) సుఖవ్యాధి బారిన పడిన 10 సంవత్సరాల తరువాత AIDS యొక్క లక్షణాలు కనిపించవచ్చు.
  • ఎవరైనా మంచి శారీరక ఆరోగ్యం మరియు పరిశుభ్రత కలిగి ఉంటే, అతను లేదా ఆమె ప్రభావితం కాదు అని ఊహించడం.
  • బయటికి తీసేశానులే నాకంటుకొడులే అనుకోవడం, కేవలం ఒకసారి సంభోగిస్తే ఏం కాదులే అని ఆలోచించడం, సుఖవ్యాధి సోకడానికి ఎక్కువ సమయం పట్టదు.
  • మీరు మద్యపానమత్తులై ఉన్నపుడు (అంటే త్రాగి ఉన్నపుడు) లేదా వినోద ఔషధాలను (recreational drugs) సేవించి ఉన్నపుడు సంభోగంలో పాల్గొంటే, అలాంటి సమయంలో మీ తీర్పును బలహీనపరుస్తుంది, మరి మీరు కండోమ్ను ఉపయోగించడం మర్చిపోవచ్చు.
  • అసురక్షిత లైంగిక సంబంధాన్ని భాగస్వామి ప్రోత్సహించడం  లేక ఒత్తిడిని కల్గించడంవల్ల - మీ భాగస్వామి ద్వారా మీపై రక్షణ లేని సంభోగం పొందేందుకు  ఒత్తిడి కల్గుతుంటే, కండోమ్ ధరించడం లేదా కండోమ్ ధరించకపోవడం అనే నిర్ణయం మీ భాగస్వామికి చెందినది. అయితే ఇలా భాగస్వామి బలవంతంతో అసురక్షిత సంభోగం చేయడంవల్ల మీరు సుఖవ్యాధికి  గురయ్యే అపాయం ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి సందర్భాల్లో, హేతుబద్ధ నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యమైనది మరియు మీరు ఈ సమస్యలను మీ భాగస్వామితో చర్చించవలసి ఉంటుంది.
  • నోటి గర్భనిరోధకాలను (oral contraceptives) లేదా ఇతర రకాల గర్భనిరోధకాలను వాడుతున్నప్పుడు మీరు సంభోగ అంటువ్యాధుల (STDలకు) గురి కాములే అని ఊహించడం - సంభోగపరమైన వ్యాధుల (ఎస్.డి.డి.లకు) రక్షణ కల్పించేవి కేవలం గర్భనిరోధకాలైన కండోమ్లు మాత్రమే. ఎటువంటి ఇతర గర్భనిరోధకాలు సంభోగ వ్యాధుల(STDs) నుండి పూర్తి రక్షణను కల్పించలేవు.
  • స్వలింగ సంపర్కం చేసే స్త్రీల (లెస్బియన్లకు)కు సంభోగపర అంటురోగాలు (STIs) రావని ఆలోచించడం - జననేంద్రియ ప్రాంతంలోని ఏదైనా చర్మం నుండి చర్మానికి తాకుడు ఏర్పడితే సంభోగపర అంటురోగాలకు (STIలకు) కారణం కావచ్చు.
  • కండోమ్ లైంగిక ఆనందాన్ని తగ్గిస్తుందని నమ్మడం-పరిశోధన ఆధారాలను బట్టి చూస్తే కొన్ని రకాల కండోమ్లు, ముఖ్యంగా చుక్కలున్నవి (dotted)  లేదా చారలు లేదా బద్దలు బద్దలుగా (ribbed) ఉండేవి వాస్తవానికి లైంగిక ఆనందాన్ని పెంచుతుందని సూచిస్తున్నాయి. అంతేకాకుండా, కండోమ్స్ మీ భాగస్వామి మరియు లైంగిక సంపర్క చర్యలపై దృష్టి పెట్టడానికి దోహదం చేస్తాయి. కండోమ్ ధరించి ఉండడం  సంభోగం ప్రభావాల గురించి భయపడాల్సిన అవసరం ఉండదు, వాస్తవానికి కండోమ్ ధరించడం సంభోగం యొక్క ఆనందాన్ని మెరుగుపరుస్తుంది.
  • మీ లేదా మీ భాగస్వామి యొక్క లక్షణాలను తీవ్రంగా తీసుకోక పోవడం - అన్ని సంభోగ అంటురోగాలు (STIలు) నయం కానివి కావు. WHO ప్రకారం, గోనేరియా, సిఫిలిస్, క్లామిడియా మరియు ట్రైకోమోనియసిస్లు యాంటీబయాటిక్స్ సహాయంతో సమర్థవంతంగా నిర్వహించబడతాయి. అయితే, చికిత్స చేయకుండా వదిలేస్తే, అలాంటి వారు 3 సార్లు వరకు HIV ప్రమాదానికి గురయ్యే అవకాశాల్ని పెంచుకున్నవారవుతారు. కాబట్టి, సాధారణ లైంగిక కార్యకలాపాన్ని కొనసాగించే ముందు మీరు రోగనిర్ధారణ (diagnosis) చేయించుకోవడం మరియు చికిత్స పొందడం మంచిది.
myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Urjas Oil by using 100% original and pure herbs of Ayurveda. This ayurvedic oil is recommended by our doctors to lakhs of people for sex problems (premature ejaculation, lack of erection in the penis, lack of libido in men) with good results.
Men Massage Oil
₹399  ₹449  11% OFF
BUY NOW

గర్భనిరోధక అవరోధ పరికరం వైఫల్యం లేదా ముందుజాగ్రత్తలు తీసుకోకపోవడం కారణంగా మీరు గనుక అసురక్షిత సంభోగం చేస్తే లేదా పొందితే  సంభోగసంబంధ వ్యాధుల (ఎస్టీడీల) ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అయితే ఆ ప్రమాదం నివారించబడదు కానీ కింది చర్యలను తీసుకోవడం ద్వారా దాన్ని సవరించవచ్చు:

  • ఒక వైద్యుడిని వెంటనే సందర్శించి సంఘటన గురించి, దాని చరిత్రతో సహా,  వైద్యుడితో మాట్లాడటం. వ్యాధిలక్షణాలు వాస్తవంగా గోచరించేందుకు, వ్యాధిలక్షణాల నిర్ధారణకు ముందు వ్యాధిని నిర్ధారణ చేయడంలో వైద్యులకు ఇది సహాయపడుతుంది. నష్టాలను తగ్గించడానికి ముందుగా పరీక్ష చేయించుకోవడం ముఖ్యం.
  • ఏవైనా ఇంటి చిట్కాలు, ఉపశమనాది గృహనివారణలను నివారించడం లేదా జననేంద్రియాల్ని కడగడం వంటివి అంటువ్యాధుల వ్యాప్తికి మరింతగా దారితీయవచ్చు. జనన-పరమైన అవయవాలు చాలా సున్నితంగా ఉంటాయి; వాటిని కడగడం, పిచికారీలతో కడగడం (douching) లేదా మూత్రవిసర్జన వంటివి సంభోగసంబంధ వ్యాధుల నుండి రక్షణ పొందటానికి సహాయపడవు. వాస్తవానికి, మహిళలపై నిర్వహించిన కొన్ని అధ్యయనాల ప్రకారం,  సబ్బు లేదా నీటితో కడగడం వాస్తవానికి మహిళల్లో, ముఖ్యంగా HIV సంక్రమణ ప్రమాదాన్ని పెంచుతుందని కనుక్కోబడింది. అయితే, సున్నిత వస్త్రంతో పురుషాంగం తుడిచివేయడం మరియు ఒక విరుసైడ్ (వైరస్ నాశనం చేసే రసాయనాలు కల్గిన) ను ఉపయోగించడమనేది కొంతమంది పురుషులుల్లో వ్యాధుల్ని నివారించవచ్చని కనుగొన్నారు. సబ్బును మరియు నీటిని ఉపయోగించడం ఇంకా సిఫార్సు చేయబడలేదు.
  • సిఫిలిస్, గోనోరియా మరియు ఇతర చికిత్స చేయగల అంటురోగాలతో సంబంధం ఉన్న ప్రమాదానికి, రోగనిరోధక యాంటీబయాటిక్స్ సహాయపడవచ్చు.
  • పూర్వ-బహిరంగ రోగనిరోధక చర్యలు (PEP-post-exposure prophylaxis) అసురక్షితమైన సంభోగం తరువాత సంభవించే HIV ప్రమాదాన్ని సవరించడానికి ఇవ్వబడుతుంది, కానీ ఇది 100% నివారణ కాదు. ప్రమాదాన్ని తగ్గించడానికి, PEPకు  72 గంటల విండో ఉన్నందున, చికిత్సను వెంటనే ప్రారంభించాల్సిన అవసరం ఉంది, 72 గంటల విండో సమయం తర్వాత ఇది ప్రభావవంతమైనది కాదు.
  • పైపూతగా ఉపయోగించే యోని ఈస్ట్రోజెన్ వాడకాన్ని కొన్ని పరిశోధకులు సూచించారు కానీ ఈ వాస్తవాన్ని స్థాపించటానికి మరింత పరిశోధన అవసరం.
  • టీకా మందులు తీసుకోవడం మరియు పూర్వ-బహిరంగ రోగనిరోధక చర్యలు (సంక్రమణ సంభవించే ముందు) సహాయపడవచ్చు కానీ మీ వైద్యుడిని సందర్శించడం ముఖ్యం.
  • కొన్ని అధ్యయనాల ప్రకారం, సున్నతి అయిన పురుషుల (circumcised men)కు సంభోగసంబంధ వ్యాధులు (ఎస్.డి.డిలు) వచ్చే ప్రమాదం చాలా తక్కువగా ఉందని సూచించాయి కానీ ఒక ఖచ్చితమైన ఫలితం ఇంకా స్థాపించబడటం లేదు కాబట్టి నిరోధక చర్యలు తీసుకోవడానికి ఇప్పటికీ అవసరమే.
Dr. Hakeem Basit khan

Dr. Hakeem Basit khan

Sexology
15 Years of Experience

Dr. Zeeshan Khan

Dr. Zeeshan Khan

Sexology
9 Years of Experience

Dr. Nizamuddin

Dr. Nizamuddin

Sexology
5 Years of Experience

Dr. Tahir

Dr. Tahir

Sexology
20 Years of Experience

వనరులు

  1. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Safe sex
  2. Christie A, Toon P. Safer sexual practices. Practitioner. 1993 Dec;237(1533):901-4. PMID: 8108320
  3. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; HPV Vaccine Information For Young Women
  4. STD-GOV, August 13, 2015 [internet] St SW, Rochester; Can you get an STD from kissing Link: https://www.std-gov.org/blog/can-get-std-kissing/
  5. Better health channel. Department of Health and Human Services [internet]. State government of Victoria; Safe sex
  6. National Health Service [Internet]. UK; What infections can I catch through oral sex?.
  7. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; Sexual Risk Behaviors Can Lead to HIV, STDs, & Teen Pregnancy
  8. University of California, San Francisco. Epidemiology of Disease Progression in HIV. [Internet]
  9. William H. George et al. Partner Pressure, Victimization History, and Alcohol: Women’s Condom-Decision Abdication Mediated by Mood and Anticipated Negative Partner Reaction . AIDS Behav. 2016 Jan; 20(0 1): 134–146. PMID: 26340952
  10. World Health Organization [Internet]. Geneva (SUI): World Health Organization; Sexually transmitted infections (STIs).
  11. McClelland et al. Vaginal washing and increased risk of HIV-1 acquisition among African women: a 10-year prospective study. AIDS: January 9th, 2006 - Volume 20 - Issue 2 - p 269–273
  12. R.V Short. New ways of preventing HIV infection: thinking simply, simply thinking . Philos Trans R Soc Lond B Biol Sci. 2006 May 29; 361(1469): 811–820. PMID: 16627296
  13. Meier et al. Independent Association of Hygiene, Socioeconomic Status, and Circumcision With Reduced Risk of HIV Infection Among Kenyan Men. JAIDS Journal of Acquired Immune Deficiency Syndromes: September 2006 - Volume 43 - Issue 1 - p 117-118
Read on app