స్త్రీలు వారి యోనిలో దురద, మంట, చికాకు వంటి సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఇది శరీరంలోని అత్యంత సున్నితమైన భాగాలలో ఒకటి కాబట్టి, సమస్యల కారణాలను తెలుసుకోవడం మరియు వాటికి వెంటనే చికిత్స అందించడం చాలా ముఖ్యం. ఏవైనా చికాకులు కలిగించే పదార్దాలు (ఇర్రిటెంట్స్)మరియు రసాయనాలు, బ్యాక్టీరియా, ఈస్ట్ ఇన్ఫెక్షన్లు లేదా లైంగిక సంక్రమణ వ్యాధులు, యుటిఐలు లేదా మెనోపాజ్ వంటి సమస్యల కారణముగా మంట సంభవిస్తుంది. మంటతో ముడిపడి ఉండే సాధారణ లక్షణాలు నొప్పి, ఎరుపుదనం లేదా సున్నితత్వం, స్రావాలు, అసాధారణ రక్తస్రావం మరియు అసహ్యకరమైన వాసన. సాధారణంగా కటి పరీక్ష మరియు ఇతర వ్యాధుల తనిఖీ కోసం రక్త పరీక్ష లేదా ఇమేజింగ్ పరీక్షలను ఉపయోగించి యోని మంట లక్షణాన్ని నిర్దారిస్తారు.
యోనిలో మంట చికిత్సలో ఇన్ఫెక్షన్లకు మందులు, హార్మోన్ల చికిత్స మరియు ఉపశమనం కలిగించే సాధారణ స్వీయ-సంరక్షణ పద్ధతులు ఉంటాయి వ్యక్తిగత పరిశుభ్రతను మెరుగుపరచడం అంటే రసాయనిక సువాసనలు కలిగిన ఉత్పత్తుల వినియోగాన్ని నివారించడం, యోనిని సున్నితంగా కడగడం, సింథటిక్ దుస్తులను నివారించడం మరియు పుష్కలంగా నీరు త్రాగటం వంటివి చెయ్యాలి. హెచ్‌ఐవి బారిన పడే అవకాశాలు, గర్భిణీ స్త్రీల నుండి శిశివుకి ఇన్ఫెక్షన్ వ్యాపించడం మరియు లైంగిక సంక్రమణ వ్యాధులు (ఎస్‌టిడిలు) సంక్రమించేటువంటి ప్రమాదాలు యోనిమంట వలన కలుగవచ్చు.