భగందర పుండు (ఆనల్ ఫిస్టులా) అంటే ఏమిటి?
భగందర పుండు (ఆనల్ ఫిస్టులా) అనేది అసాధారణమైన చిన్న పుండు, ఇది పెద్దప్రేగు మరియు మలద్వార చర్మం మధ్య ఏర్పడుతుంది. మలద్వార/పాయువు గ్రంధిలో చీము ఫిస్టులా/భగందర పుండుకు దారితీస్తుంది. పెద్దప్రేగు మరియు పాయువు మధ్య గొట్టం అనేది మలద్వార మార్గము, ఇక్కడ అనేక పాయువు గ్రంధులు ఉంటాయి. ఈ గ్రంధులలో సంక్రమణం (infection) చీము ఏర్పడటానికి కారణమవుతుంది, ఈ చీము పాయువు వైపు మార్గం ద్వారా ప్రవహించి పుండును తెరిచి ఉంచుతుంది.
ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
మలద్వారం చుట్టూ నొప్పి మరియు చికాకు అనేవి ప్రధాన లక్షణాలు. కూర్చున్నపుడు లేదా కదలుతున్నప్పుడు లేదా ప్రేగు కదలిక సమయంలో తీవ్రమైన కండర నొప్పి;మలంలో చీము లేదా మలంలో రక్తం కారడం లేదా మలద్వార చర్మం సమీపంలో ఒక మురికి వాసన; మలద్వారం చుట్టూ వాపు మరియు ఎరుపు; జ్వరము, చలి, అలసట మరియు అనారోగ్యం వంటివి అదనపు లక్షణాలు.
ప్రధాన కారణాలు ఏమిటి?
ఆనల్ ఫిస్ట్యులాలు సాధారణంగా మలద్వార కురుపులు కారణంగా అభివృద్ధి చెందుతాయి. చీము పోయిన తర్వాత ఈ కురుపులు సరిగ్గా నయం అవ్వకపోతే ఆనల్ ఫిస్ట్యులాలు సంభవిస్తాయి. తక్కువ శాతంలో క్రోన్'స్ వ్యాధి, క్షయవ్యాధి, డైవర్టికులిటిస్ (diverticulitis), లైంగికంగా సంక్రమించిన వ్యాధులు (STD), గాయాలు, లేదా క్యాన్సర్ వంటి పరిస్థితులు కూడా కారణమవుతాయి.
ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
మలాశయ లక్షణాలు మరియు మునుపటి ఆరోగ్య పరిస్థితి యొక్క జాగ్రత్త పరిశీలన అనేది ఈ సమస్యను నిర్ధారించడానికి సహాయపడుతుంది. జ్వరం, నీరసం, వాపు మరియు ఎరుపుదనం వంటి లక్షణాల గురించి వైద్యులు పరిశీలిస్తారు. కొన్ని పుండ్లు పై చర్మంలో ఒక గడ్డలా బయటకి కనిపిస్తాయి. రక్తం లేదా చీము యొక్క పారుదలను శారీరక పరీక్షలో చూడవచ్చు. చీము లేదా రక్తం ఉందా అని చూడటానికి వైద్యులు ఆ ప్రాంతాన్ని నొక్కవచ్చు. ఒక ఫిస్టులా ప్రోబ్ (fistula probe), అనోస్కోప్ (anoscope), మరియు ప్రతిబింబన (ఇమేజింగ్) అధ్యయనాలు (ultrasound, MRI లేదా CT స్కాన్) కూడా ఉపయోగించవచ్చు. అంకాత్మక(డిజిటల్) మలాశయ పరీక్ష బాధాకరముగా ఉంటుంది మరియు చీమును విడుదల చేయవచ్చు. ఫిస్ట్యులాలు మూసివేయబడవచ్చు కానీ అప్పుడప్పుడు కారవచ్చు అది నిర్ధారణకు కష్టం అవుతుంది.
చికిత్స కోసం ఇప్పటి వరకు మందులు లేదా ఔషధాలు అందుబాటులో లేవు. ఫిస్ట్యులాలను ఎక్కువగా శస్త్రచికిత్సతోనే చికిత్స చేస్తారు. వాటికవే నయం కాలేవు. చికిత్స కోసం శస్త్రచికిత్సతో పాటు యాంటీబయాటిక్స్ ను కూడా వాడతారు. శస్త్ర చికిత్సలో క్రింది ఎంపికలు ఉంటాయి:
- ఫిస్టులోటమీ (Fistulotomy)
ఈ విధానంలో మొత్తం ఫిస్టులాను కత్తిరించడం జరుగుతుంది మరియు దానిని నయం చేయటానికి దానిని తెరవడం జరుగుతుంది . - సెటాన్ విధానము (Seton procedure)
సెటన్ అని పిలువబడే సన్నని శస్త్రచికిత్స రబ్బరును ఫిస్టులాలో ఉంచుతారు మరియు ఒక రింగ్ను ఏర్పడెలా చివరన కలిపి ఉంచుతారు. ఫిస్టులా నయం కావడం కోసం వారాల పాటు ఇది ఉంచబడుతుంది, తరువాత చికిత్సకు అవసరమైన ఇతర శస్త్రచికిత్సా పద్ధతులు ఉంటాయి. - ఇతర పద్ధతులు
జిగురు, కణజాలం లేదా ప్రత్యేకమైన మూత వంటి ఇతర పద్ధతులు కూడా ఉపయోగకరంగా ఉన్నాయి. - పునర్నిర్మాణ శస్త్రచికిత్సలు(Reconstructive Surgeries)
పూర్తిగా ఫిస్టులా మూసి వేసే విధానాలు.