ఏంజినా (ఛాతినొప్పి) అంటే ఏమిటి?
గుండె కండరాలకు ఆక్సిజన్ ఉండే రక్త సరఫరా తగ్గడం కారణంగా ఛాతీలో అసౌకర్యంగా ఉంటుంది దానినే ఛాతినొప్పి లేదా ఏంజినా అంటారు. ఇది ఒక వ్యాధి కాదు కానీ హృదయ ధమని వ్యాధి (coronary artery disease) వంటి అంతర్లీన గుండె జబ్బుల యొక్క లక్షణం, ఇందులో ధమనుల (arteries) యొక్క సంకుచితం (narrowing) వలన గుండెకు ఆక్సిజెన్తో కూడిన రక్తం యొక్క సరఫరా తగ్గిపోతుంది. గుండెకి రక్తం సరఫరా చేసే ధమనులలో ఫలకాలు (plaques) అభివృద్ధి చెందుతాయి, ఫలితంగా గుండె కండరాలకు రక్త ప్రవాహం మరియు ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతుంది.
ఏంజినా యొక్క ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
ఏంజినా (ఛాతినొప్పి)లో మూడు రకాలు ఉన్నాయి: స్థిరమైన (stable), అస్థిరమైన (unstable), మరియు భిన్నమైన (variant) ఏంజినా (ఛాతినొప్పి). సాధారణంగా ఏంజినా రకం ప్రకారం లక్షణాలు ఉంటాయి. ఛాతీలో నొప్పి అనేది ప్రధాన లక్షణం. ఛాతీలో బిగుతుదనం లేదా ఒత్తిడి; నొప్పి అనేది మెడ, దవడ, భుజం లేదా వీపుకు వ్యాపిస్తుంది; వికారం; అలసట; శ్వాస ఆడకపోవుట; చెమట; మరియు మైకము అనేవి ఇతర లక్షణాలు. నొప్పి ఆమ్లత్వం (acidity) లేదా అజీర్ణం (indigestion) లో మాదిరిగానే ఉంటుంది.
దాని ప్రధాన కారణాలు ఏమిటి?
ఏంజినా ఒక అంతర్లీన గుండె సమస్యకు సంకేతంగా భావింపబడుతుంది. ఫలకాలు (plaques) అని పిలవబడే కొవ్వు నిక్షేపాలు (fatty deposits) ధమనుల (arteries) లో ఏర్పడుతాయి, తద్వారా ధమనులని ఇరుకుగా చేస్తాయి. ఇది గుండెకి ఆక్సిజన్ అధికంగా ఉన్న రక్త ప్రవాహాన్ని తగ్గిస్తుంది (ఇస్కామియా). సరఫరా సాధారణంగా విశ్రాంత సమయంలో మామూలుగానే నిర్వహించబడుతుంది, కానీ ఒక వ్యక్తి వ్యాయామాలు చేసినప్పుడు, నడచినప్పుడు లేదా మెట్ల పైకి ఎక్కినప్పుడు, గుండె కండరాలకు ఆక్సిజన్ అధికంగా ఉండే రక్త సరఫరా అవసరమవుతుంది, కానీ ఇది తగినంతగా సాధ్యం కాదు. అందువల్ల, ఇది చేతులు, మెడ, భుజం, వెనుక మరియు ఇతర శరీర భాగాలకు చేరుకునే ఛాతీ నొప్పిని కలిగిస్తుంది. ఈ విధానం స్థిరమైన (stable) ఏంజినాలో కనిపిస్తుంది.
అస్థిరమైన (unstable) ఏంజినాలో, ఫలకాలు (plaques) కొన్నిసార్లు ధమని యొక్క గోడ నుండి వేరు చేయబడి, రక్తంతో పాటు ప్రవహిస్తాయి, ఇది ధమనిలో అడ్డంకిగా లేదా పాక్షిక అడ్డును కలిగించవచ్చు, ఇది ఆకస్మిక ఛాతీ నొప్పి మరియు ఇతర లక్షణాలకు దారితీస్తుంది. ఛాతీ నొప్పి విశ్రాంతిలో ఉన్నపుడు కూడా సంభవిస్తుంది మరియు శారీరక శ్రమ చేసేటప్పుడు పెరిగిపోతుంది.
అలాగే, భావోద్వేగ ఒత్తిడి, ధూమపానం, చల్లని వాతావరణం, భారీ భోజనం లేదా శారీరక శ్రమ కారణంగా, కరోనరీ ధమని (coronary artery) ఇరుకుగా మారుతుంది అందువల్ల ఏంజినా లక్షణాలను కలిగిస్తుంది; ఈ రకాన్నిభిన్నమైన (variant) ఏంజినా అంటారు.
ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
ఛాతీ నొప్పి తరువాత, వైద్యులు లక్షణాల గురించి అడగవచ్చు, నొప్పి మొదలైనప్పుడు వ్యక్తి ఎలాంటి కార్యకలాపాలు చేస్తున్నాడో, కుటుంబ ఆరోగ్య చరిత్ర గురించి, ఆహారపు అలవాట్లు, ధూమపాన అలవాట్లు, జీవనశైలి, వ్యాయామ విధానాలు, శరీర బరువు, ఎత్తు, నడుము, బాడీ మాస్ ఇండెక్స్, మొదలైన వాటి గురించి అడగవచ్చు. తరువాత, వైద్యులు ఎలెక్ట్రాకార్డియోగ్రామ్ (ECG), రక్తపోటు, రక్త పరీక్ష, రక్త లిపిడ్లు, ఛాతీ X- రే, కొరోనరీ ఆంజియోగ్రఫీ (coronary angiography), కంప్యూటరీకరించిన టోమోగ్రఫీ (computerised tomography) స్కాన్ మరియు ECG స్ట్రెస్ పరీక్ష వంటి పరీక్షలను నిర్వహించవచ్చు. అస్థిర (unstable) ఏంజినాలో గుండెపోటు నివారించడానికి తక్షణ రోగ నిర్ధారణ మరియు అత్యవసర చికిత్స అవసరం.
ఏంజినా యొక్క విజయవంతమైన చికిత్స కోసం వైద్యుని పై పూర్తి నమ్మకం అవసరం మరియు వారితో మీరు ఎదుర్కొన్న అన్ని సమస్యలను స్పష్టంగా తెలియచేయాలి. రోగనిర్ధారణ తర్వాత, వైద్యులు ఏంజినా యొక్క రకాన్ని బట్టి మందులను ఇస్తారు. మందులతో పాటు జీవనశైలిలో మార్పు, ఆహారపు అలవాట్లలో మార్పులు అవసరం మరియు గుండె శస్త్రచికిత్స వంటి కొన్ని ఇతర విధానాలు కూడా ఉన్నాయి.
మొదటి ఏంజినా దాడి (attack) లోనే, మరొక దాడిని నివారించడానికి వైద్యులు వెంటనే గ్లైసెరిల్ ట్రైనైన్రేట్ (glyceryl trinitrate) (GTN) ను నిర్దేశిస్తారు. GTN ఒక చిన్న మాత్ర లేదా పిచికారీ (spray) రూపంలో అందుబాటులో ఉంది. ఒక ఏంజినా దాడి తర్వాత, వెంటనే పనిచేయడం ఆపాలి, విశ్రాంతి తీసుకొని, GTN తీసుకొవాలి, మొదటి మోతాదు పనిచేయకపోతే ఐదు నిమిషాల తర్వాత మళ్ళి మోతాదు పునరావృతం చేయాలి. GTN, బీటా బ్లాకర్స్ (beta blockers) మరియు కాల్షియం ఛానల్ బ్లాకర్ల (calcium channel blockers) వంటి మందులు దాడిని నివారించడానికి కూడా ఉపయోగించవచ్చు. గుండె జబ్బులను ఎదుర్కునే ప్రమాదం ఎక్కువగా ఉన్నదని చెప్పడానికి ఏంజినా అనేది ఒక హెచ్చరిక సంకేతం; అందువల్ల, గుండెపోటు నివారించడానికి ఇతర మందులు కూడా అవసరమవుతాయి, వీటిలో తక్కువ-డోస్ ఆస్పిరిన్ (aspirin), స్టాటిన్స్ (statins) మరియు యాంజియోటెన్సిన్-కన్వర్వర్జింగ్ ఎంజైమ్ ఇన్హిబిటర్స్ (angiotensin-converting enzyme inhibitors) ఉన్నాయి.
మందులు పరిస్థితి నియంత్రించలేనప్పుడు శస్త్రచికిత్సను కూడా ఉపయోగించవచ్చు. శరీరంలోని మరో భాగం (కరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్ట్ శస్త్రచికిత్స) (coronary artery bypass graft surgery) లేదా ధమనిని -విస్తరించడం (పెర్క్యూటానియస్ కరోనరీ ఇంటర్వెన్షన్స్) (percutaneous coronary interventions) ఉపయోగించి ఇతర విభాగాల ద్వారా రక్తం ప్రవహించేలా చెయ్యవచ్చు. అస్థిరమైన (unstable) ఏంజినా కోసం, రక్తం గడ్డకట్టడాన్ని నివారించే మరియు గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించే మందులు సూచించబడతాయి. వెంటనే వ్యక్తికి తక్కువ మోతాదు ఆస్పిరిన్ (aspirin), క్లోపిడోగ్రెల్ (clopidogrel), మరియు రక్తాన్ని పలుచబార్చే ఔషధం యొక్క ఇంజెక్షన్ ఇవ్వబడుతుంది. పరిస్థితి మరింత దిగజారినా లేదా మరొక సంబంధిత రోగ నిర్మూలన అవసరం ఐతే, శస్త్రచికిత్స చేయబడుతుంది.