ఏలికపాము వ్యాధి(నులిపురుగులు,అస్కారియస్) - Ascariasis in Telugu

Dr. Ajay Mohan (AIIMS)MBBS

November 27, 2018

March 06, 2020

ఏలికపాము వ్యాధి
ఏలికపాము వ్యాధి

ఏలికపాములు (అస్కారియస్) లేక నులిపురుగులు వ్యాధి అంటే ఏమిటి? 

ఏలికపామువ్యాధి లేక నులిపురుగు (అస్కారియాసిస్) వ్యాధి ఒక పరాన్నజీవి సంక్రమణం, ఇది ఏలికపాములు (roudworms)వలన సంభవిస్తుంది. ఈ పరాన్నజీవి పొడవు 40 సెం.మీ పొడవు మరియు వ్యాసంలో 6 మిమీ ఉంటుంది.  భారతదేశంలో కనిపించే అత్యంత ప్రాచుర్యమైనది ఈ నులిపురుగులు క్రిమికారక వ్యాధి. ప్రపంచవ్యాప్త0గా నూరు కోట్లమంది ఈ నులి పురుగులవ్యాధి బారినపడినట్లు అంచనా.  వయోజనులతో పోలిస్తే పిల్లలకే ఈ నులిపురుగులు వ్యాధి ఎక్కువగా వస్తుంది, అయితే ఇది అన్ని వయసులవారికీ దాపురిస్తుంది. ఉష్ణ మండలీయ మరియు ఉపఉష్ణమండల ప్రాంతాల్లో నులిపురుగుల వ్యాధి బాగా వ్యాప్తి పొందింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ-వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) ప్రకారం, 870 మిలియన్ల మంది  పిల్లలు ఈ నులిపురుగు సంక్రమణకు గురయ్యే ప్రాంతాలలో నివసిస్తున్నారు.

ఏలికపాము వ్యాధి (అస్కారియాసిస్) యొక్క ముఖ్య సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి? 

ఈ వ్యాధికి గురైనవారిలో ఎక్కువగా కొన్ని లక్షణాలు లేక ఎలాంటి లక్షణాలు  ఉండకపోవచ్చు.

అయితే ఈ వ్యాధి సాధారణ లక్షణాలు:

ఓ మోస్తరు నుండి తేలికపాటి కేసులు  

తీవ్రమైన కేసులు

  • తీవ్రమైన కడుపు నొప్పి
  • అలసట
  • వాంతులు
  • బరువు నష్టం
  • వాంతి లేదా మలంలో పురుగుల ఉనికి

భారీ సంఖ్యలో ఏలికపాముల పొట్టలో చోటుచేసుకోవడంతో, ప్రేగు సంబంధిత నిరోధాలేర్పడి పిల్లల్లో పౌష్టికాహారలోపం ఏర్పడి వారు బలహీనంగా తయారయ్యేందుకు దారితీయవచ్చు. శ్వాసకోస సంబంధ వ్యాధులు, గురక మరియు దగ్గు వంటి ఊపిరి సంబంధిత సమస్యలు కొందరు పిల్లల్లో చోటు చేసుకోవచ్చు.  

అట్టి పిల్లల్లో దిగువ పేర్కొన్న చిక్కులు సంభవించవచ్చు:

  • పురీషనాళం ద్వారా రక్తస్రావం
  • ప్రేగు అవరోధం
  • అపెండిసైటిస్
  • కాలేయం మరియు పిత్తాశయం వ్యాధి
  • ప్యాంక్రియాటిక్ సూడోసిస్ట్

ఏలికపాము వ్యాధి యొక్క ప్రధాన కారణాలు ఏమిటి?

ఏలికపాము వ్యాధి “అస్కారిస్ లంబ్రియోయిడ్స్” పరాన్నజీవి వలన సంభవిస్తుంది. ఇది ప్రత్యక్షంగా వ్యక్తి నుండి వ్యక్తికి సోకదు కాని అక్వేరియాసిస్ గుడ్లను కలిగి ఉన్న ఏలికపాము వ్యాధిగ్రస్తుడి మలం ద్వారా ఇతరులకు  వ్యాపిస్తుంది. ఈ గుడ్లు సహజ ఎరువులు ద్వారా వ్యవసాయ భూములకు చల్లబడుతాయి ఆ విధంగా వ్యవసాయ భూముల మట్టికి ఈ క్రిములు సోకుతాయి.

ఈ వ్యాధి సంక్రమణ వీటి ద్వారా వ్యాప్తి చెందుతుంది:

  • రౌండ్వార్మ్ గుడ్లుతో కలుషితమైన ఆహారం లేదా ద్రవాల వినియోగం
  • కలుషిత మట్టిలో ఆడడం మరియు దుమ్ము కణాలను పీల్చడం
  • బహిరంగంగా మలవిసర్జన చేయడం, పేలవమైన ఆరోగ్య పరిస్థితులు మరియు పారిశుధ్యలోపం.  
  • పందులు వంటి జంతువులుతో అంటు ఏర్పడడం.

ఏలికపాము వ్యాధిని నిర్ధారణ చేసేది, దీనికి చికిత్స ఏమిటి?

ఈ పురుగుల జీవనకాలం సాధారణంగా 4-8 వారాలు.

ఏలికపాము వ్యాధిని కింది విధంగా నిర్ధారణ చేయవచ్చు:

  • మైక్రోస్కోపీ: మలాన్ని నేరుగా మైక్రోస్కోప్ కింద పరీక్షించడం  
  • Eosinophilia: ఎసినోఫిల్-eosinophil-(ఒక రకం తెల్ల రక్త కణాలు [WBCs] ఉనికిని గుర్తించడం) లెక్కింపు  
  • ఇమేజింగ్: పురుగులు మరియు పేగుల్లో అవరోధం ఉండటం యొక్క దృశ్యమానత
  • సెరోలజీ (అరుదుగా): పరాన్నజీవికి వ్యతిరేకంగా ప్రతిరోధకాల ఉనికిని నిర్ధారించడం

చికిత్సలో పురుగులను బహిష్కరించడం లేదా చంపడం వంటి యాన్తల్మిథిక్ ఔషధాలను కలిగి ఉంటుంది. పిండమునకు హాని కలిగించే సామర్ధ్యం ఉన్నందున గర్భధారణ సమయంలో ఈ మందులను నివారించండి.

  • పోస్ట్-ఆపరేటివ్ కేర్ మరియు పునరావాసం ప్రక్రియలో కింద పేర్కొన్నవి ఉంటాయి:
  • పిల్లల కోసం విటమిన్ A అనుబంధ మందులు  
  • వ్యాధి సోకిన స్థానిక ప్రాంతాలలో 3-6 నెలలలో రిట్రీమెంట్
  • గరిష్ట లాభం పొందడానికి ఔషధ చికిత్సతో అనువర్తనం  

స్వీయ రక్షణ చిట్కాలు

  • మంచి ఆరోగ్యం మరియు వ్యక్తిగత పరిశుభ్రతను నిర్వహించడం అవసరం
  • మనుషుల మలాన్ని (excreta) ఎరువులుగా ఉపయోగించదాన్ని తప్పించడం
  • ఆహారాల వినియోగాయానికి ముందు వాటిని సరిగ్గా కప్పబడి ఉండేలా చూడడం  
  • భోజనం ముందు మరియు తరువాత చేతిని శుభ్రంగా కడుక్కోవడాన్ని అందరిలో అలవాటుగా మార్పించడం, మరియున దాని ప్రాముఖ్యతను గురించిన అవగాహనను వారిలో కల్గించడం  
  • సాధ్యమైనంతవరకు మట్టిలో ఆడకుండా పిల్లలను అడ్డుకోవడం
  • కావలసినంత సీసా నీరు, వండిన మరియు వేడి భోజనం తినడం, మరియు ముడి పండ్లు మరియు కూరగాయలను సేవించే ముందు బాగా కడగడం, మరియు పొట్టు తీయడం (peeling).   

ఏలికపాములాంటి వ్యాధుల విషయంలో నివారణే కీలకం. పైన పేర్కొన్న చికిత్సా పద్దతులను అనుసరిస్తూ వెళ్తే వ్యాధికి సంబంధించిన పెద్ద సమస్యలను నివారించడానికి వీలవుతుంది.



వనరులు

  1. Nasir Salam. Prevalence and distribution of soil-transmitted helminth infections in India. BMC Public Health. 2017; 17: 201. PMID: 28209148
  2. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Ascariasis
  3. U.S. Department of Health & Human Services. Parasites - Ascariasis. Centre for Disease Control and Prevention. [internet]
  4. Department of Health and Human Services [internet]. State government of Victoria; Ascariasis (roundworm infection)
  5. de Lima Corvino DF, Horrall S. Ascariasis. Ascariasis. StatPearls [Internet]. Treasure Island (FL): StatPearls Publishing; 2019 Jan-.

ఏలికపాము వ్యాధి(నులిపురుగులు,అస్కారియస్) వైద్యులు

Dr Rahul Gam Dr Rahul Gam Infectious Disease
8 Years of Experience
Dr. Arun R Dr. Arun R Infectious Disease
5 Years of Experience
Dr. Neha Gupta Dr. Neha Gupta Infectious Disease
16 Years of Experience
Dr. Anupama Kumar Dr. Anupama Kumar Infectious Disease
ఆడియో కొద్దిగా ఆలస్యం కావచ్చు

ఏలికపాము వ్యాధి(నులిపురుగులు,అస్కారియస్) కొరకు మందులు

Medicines listed below are available for ఏలికపాము వ్యాధి(నులిపురుగులు,అస్కారియస్). Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.