అటోపిక్ చర్మవ్యాధి - Atopic Dermatitis in Telugu

Dr. Ayush PandeyMBBS,PG Diploma

November 27, 2018

March 06, 2020

అటోపిక్ చర్మవ్యాధి
అటోపిక్ చర్మవ్యాధి

అటోపిక్ చర్మవ్యాధి అంటే ఏమిటి? 

అటోపిక్ చర్మవ్యాధినే తామర అని కూడా పిలుస్తారు. అటోపిక్ చర్మశోథ అని కూడా వ్యవహరించడం వాడుకలో ఉంది. దురద మరియు పొలుసులు దేలిన చర్మం లక్షణాలతో కూడిన ఒక సాధారణ చర్మ పరిస్థితి ఈ జబ్బు. ఇది పెద్దలలో కంటే పిల్లలలోనే చాలా సాధారణం. అంతే కాదు ఈ చర్మ జబ్బు పునరావృత ధోరణిని కలిగి ఉంటుంది. శిశువుకు మొదటి 6 నెలల వయసులోనే ఈ అటోపిక్ చర్మవ్యాధి దాపురించే అవకాశం ఉంది.

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి? 

  • తామర వ్యాధి యొక్క వైద్య-పర లక్షణాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారుతూ ఉంటాయి. కానీ సాధారణంగా విపరీతమైన దురదతో కూడి, పొడిబారి, ఎర్రగా మారిన చర్మం దీని లక్షణంగా  ఉంటుంది.
  • ఎక్కువగా గోకడంతో (గీరడంతో) చర్మంపై మంట పుడుతుంది, రక్తస్రావం కూడా అవుతుంది.  
  • తరచుగా ఈ జబ్బు పరిస్థితి చీము నిండిన పొక్కులు, సంక్రమణకు సూచనగా ఉంటుంది. ఇది సోకినట్లయితే, శరీరంలోని ఇతర భాగాలకు వ్యాప్తి చెందుతుంది.
  • దీని ఇతర లక్షణాలు ద్రవంతో కూడిన దద్దుర్లు, నలుపుదేలిన మరియు ముడతలు పడ్డ చర్మం. కళ్ళు మరియు పెదాల చుట్టూ ఉన్న ప్రాంతం ఈ స్థితిలో ముదురు నలుపు రంగులోకి మారుతుంది.
  • దురద రాత్రిసమయాల్లో గరిష్టంగా ఉంటుంది మరియు ఇది నిద్రకు ఆటంకం కల్గిస్తుంది.  
  • తామర అనేది ఆస్తమా, తృణగంధజన్య జ్వరము లేదా గవత జ్వరం లేదా ఇతర అలెర్జీలతో కూడిన దీర్ఘకాలిక పరిస్థితి.

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

  • ఏ ఒక్క కారణం లేనప్పటికీ, తామరని ప్రేరేపించే ప్రమాద కారకాలు ఉన్నాయి.
  • అదే కుటుంబం యొక్క అనేక మంది సభ్యులు ఇదే జబ్బుతో  బాధపడుతున్న వారితో జన్యుపరమైన కారణం ఉందని పరిశోధకులు కూడా విశ్వసిస్తున్నారు.  
  • అధిక కాలుష్యంతో కూడిన వాతావరణంలో నివసిస్తున్నప్పుడు, లేదా చాలా పొడి మరియు చల్లని పరిస్థితులు కూడా ఈ పరిస్థితికి అనువుగా ఉంటాయి.
  • ఆహార అలెర్జీలు, పుప్పొడి, ఉన్ని బట్టలు, దుమ్ము, చర్మ ఉత్పత్తులు మరియు పొగాకు పొగ వంటి ఇతర కారణాలు తామరని ప్రేరేపించగలవు.

అటోపిక్ చర్మవ్యాధిని ఎలా నిర్ధారణ చేసేది మరియు దీనికి చికిత్స ఏమిటి? 

  • చర్మవ్యాధి నిపుణుడు తామరవ్యాధి దృష్టితోనే  వైద్య పరీక్ష చేస్తాడు. ఎరుపుదేలి, పొడిగా ఉండి మరియు దురద కల్గిన చర్మం అటోపిక్ చర్మవ్యాధి పరిస్థితికి సూచన.  
  • ఈ జబ్బు చర్మంపైన్నే కన్పించేదవటంవల్ల వైద్యులకు స్పష్టమైన అవగాహనను కల్గిస్తుంది. కనుక, రక్త పరీక్ష లేదా ఇమేజింగ్ అవసరం లేదు.
  • మీకు లేదా మీ బిడ్డకు నిరంతరంగా వచ్చే జ్వరం లేదా ఇతర వ్యాధి  లక్షణాలను కలిగి ఉంటే, మీ వైద్యుడు ప్రాథమిక రక్త పరీక్షను సలహా ఇస్తారు.
  • జబ్బు పూర్తిగా తొలగించబడకపోయినట్లైతే, యాంటీ హిస్టామిన్లు, యాంటిబయోటిక్స్ మరియు స్టెరాయిడ్ క్రీమ్లు వంటి మందులు ఉపశమనం కోసం ఉపయోగించవచ్చు.  
  • జబ్బు పునరావృతమయ్యే పరిస్థితిని నివారించడానికి ఇతర మార్గాలు ఏవంటే జబ్బు కారణాల్ని గుర్తించడం మరియు తొలగించడం, కఠినమైన సబ్బులు లేదా చర్మ ఉత్పత్తుల వాడకంలో జాగ్రత్తగుండడం మరియు అన్ని సమయాల్లో మంచి పరిశుభ్రతను నిర్వహించుకోవడం.
  • స్నానం తర్వాత మీ పిల్లల చర్మాన్ని పొడిగా ఉంచండి మరియు రోజుకు కనీసం రెండు సార్లు తేమ చేయండి.



వనరులు

  1. David Boothe W, Tarbox JA, Tarbox MB. Atopic Dermatitis: Pathophysiology. Adv Exp Med Biol. 2017;1027:21-37. PMID: 29063428
  2. Journal of Clinical Investigation. New insights into atopic dermatitis. American Society for Clinical Investigation. [internet].
  3. National institute of allergy and infectious diseases. Eczema (Atopic Dermatitis). National Institutes of Health. [internet].
  4. National Institute of Arthritis and Musculoskeletal and Skin Diseases. Atopic Dermatitis. U.S. Department of Health and Human Services Public Health Service.
  5. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Atopic Dermatitis

అటోపిక్ చర్మవ్యాధి కొరకు మందులు

Medicines listed below are available for అటోపిక్ చర్మవ్యాధి. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.