బొడ్డు తామర లేక బెల్లి బటన్ ఇన్ఫెక్షన్ అంటే ఏమిటి?
బొడ్డు తామర లేదా బెల్లి బటన్ ఇన్ఫెక్షన్ అనేది బొడ్డులో బ్యాక్టీరియా లేదా శిలీంద్రాల పెరుగుదల కారణంగా సంక్రమించే సంక్రమణ వ్యాధి. సాధారణంగా, పరిశుభ్రత పాటించకపోవడం కారణంగా బొడ్డుతామర సమస్య దాపురిస్తుంది.
బొడ్డు తామర ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
బొడ్డు తామర సంక్రమణ యొక్క లక్షణాలు క్రింది విధంగా ఉంటాయి:
- సోకిన ప్రాంతం నుంచి స్రావాలు/డిశ్చార్జ్
- బొడ్డు ప్రాంతంలో దద్దుర్లు మరియు ఎరుపు రంగు
- దురద
- పొలుసులు దేలిన చర్మం
- బొడ్డు మీది చర్మం మీద గుల్లలు
- బొడ్డు నుండి దుర్వాసన
- బొడ్డులో తిత్తుల ఉనికి
- బొడ్డు ప్రాంతంలో నొప్పి
- బొడ్డు బటన్ లో సున్నితత్వం
బొడ్డు తామరకు గల కారణాలు ఏమిటి?
బాక్టీరియా మరియు బూజు (fungal) పెరుగుదల కారణంగా బొడ్డు తామర దాపురించవచ్చు. పరిశుభ్రత పాటించకపోవడంతో బొడ్డు ప్రాంతంలో ఉన్న బాక్టీరియా వేగంగా పెరుగుతుంది మరియు సంక్రమణకు దారి తీస్తుంది. ఈ సంక్రమణం సాధారణంగా బొడ్డులో గాట్లు లేదా తీక్షణమైన గాయాల కారణంగా ప్రేరేపించబడుతుంది. అందువల్ల, తీక్షణమైన గాయాల కారణంగా అయినా పుండు లేక బహిరంగ గాయం బొడ్డుతామర సంక్రమణ సమస్యకు ఒక ప్రమాద కారకంగా మారుతుంది.
చెక్కెరవ్యాధితో (డయాబెటిస్తో) బాధపడుతున్నవారు కూడా బొడ్డు తామరకు గురయ్యే అపాయం ఎక్కువగా ఉంది, ఎందుకంటే అధిక స్థాయిలో ఉండే రక్తంలోని చక్కెర శిలీంద్రాల మరియు బాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తుంది గనుక.
బొడ్డు తామరను నిర్ధారణ చేసేదెలా మరియు దీనికి చికిత్స ఏమిటి?
బొడ్డు తామర సంక్రమణం యొక్క నిర్ధారణ సాధారణంగా డాక్టర్ సంపూర్ణ భౌతిక పరీక్ష ద్వారా చేస్తారు. ఏదేమైనా, కారణాలను పరిశోధించడానికి, వైద్యుడు బొడ్డు చర్మం యొక్క నమూనాను ఆ ప్రాంతం చుట్టూ లేదా బొడ్డు బటన్ నుండి ఉత్సర్గను తీసుకుని పరీక్ష చేసిసంక్రమణను నిర్ధారించవచ్చు.
వైద్యుడు యాంటీ ఫంగల్ క్రీమ్లు లేదా మందులను రోగానికి గురైన ఈ బొడ్డు ప్రాంతానికి చికిత్స చేయడానికి సూచించవచ్చు. వైద్యం ప్రక్రియకు సహాయంగా చక్కెర వినియోగం తగ్గించే ఆహారపదార్ధ మార్పుల్ని వైద్యులు సిఫారసు చేయవచ్చు. వైద్యం ప్రక్రియకు సహాయపడటానికి, బొడ్డు తామర సోకిన ప్రాంతాలను ఎప్పటికప్పుడు పొడిగా మరియు శుభ్రంగా ఉంచాలి. చక్కరవ్యాధి (డయాబెటిస్) ఉన్నవారికి, ప్రస్తుత సంక్రమణను తగ్గించడానికి మరియు భవిష్యత్తులో పునరావృతం కాకుండా నివారించడానికి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలోకి తీసుకురావడం చాలా అవసరం.