కనురెప్పల వాపు అంటే ఏమిటి?
కనురెప్ప యొక్క వేర్వేరు భాగాల్లో సంభవించే సూక్ష్మక్రిమి (బ్యాక్టీరియా) సంక్రమణ వలన కనురెప్పల్లో వాపు సమస్య మనకు దాపురిస్తుంది. కనురెప్పల్లోని వెంట్రుకల కుదుళ్ళలో, మెయిబొమియన్ గ్రంధిలో (కళ్ళలో పొడిదనాన్ని నిరోధించేందుకుండే చమురు-స్రవించే గ్రంధి) భాగాల్లో, మరియు లాచ్రిమాల్ గ్రంథుల (కన్నీటిని స్రవింపజేసే గ్రంథులు)లో కనురెప్పల వాపు సాధారణంగా సంభవిస్తుంటుంది. కనురెప్పల వాపు పునరావృత ధోరణిని కలిగి ఉంటుంది.
కంటి వాపు యొక్క ముఖ్య సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
కనురెప్పల వాపు అనేది కంటిరెప్పలోని ఏ భాగానికి సోకిందో, దాన్నిబట్టి వేర్వేరు సంకేతాలు మరియు లక్షణాలు ఆధారపడి ఉంటాయి.
- బ్లీఫరిటిస్ (Blepharitis)- ఇది కనురెప్పల అంచు వద్ద వెంట్రుకల కుదుళ్ళలో ఏర్పడే వాపు. దీని సాధారణ లక్షణాలు ఇలా ఉంటాయి.
- ఎరుపుదేలిన, వాచిన (వాపుదేలిన) మరియు బాధాకరమైన కనురెప్పల అంచులు
- కనురెప్పల మొదళ్లలో దళసరి పుసి పొక్కులు (క్రస్ట్ లేదా కంటి పుసి పొక్కులు)
- కళ్ళలో మంట మరియు కళ్ళలో మండుతున్నట్లుండడం
- కళ్ళలో పెరిగిన సున్నితత్వం లేదా కాంతిపట్ల కంటికి అసహనం.
- కంటి కురుపు (chalazion) - కంటి కురుపు అనేది కనురెప్ప లోపల ఏర్పడే దద్దు లేక మెత్తని బుడిపి. కనురెప్ప పైపైన ఉండే శ్వేదగ్రంధికి (Zeis gland) అడ్డంకి ఏర్పడ్డంవల్ల ఇలా ఈ కంటి కురుపు మన కనురెప్పల్లో దాపురిస్తుంది. శ్వేదగ్రంధిలో అడ్డంకి సంక్రమణం కారణంగా జరగదు. కంటి కురుపులో భాగంగానే దీర్ఘకాలికమైన కనురెప్పల వాపు (blepharitis) మనకు దాపురిస్తుంది.
- ప్రారంభంలో, కనురెప్పలో కురుపు ఏర్పడే చోట ఎరుపుదేలడం, మరియు నొప్పి కలగడం ఉంటుంది.
- కంటికురుపు వచ్చిన తరువాతి దశలో ఆ కురుపు నొప్పిలేకుండా ఉంటుంది
- కంటి కురుపు ఒకే సమయంలో ఒక కంటికి లేదా రెండు కళ్ళకూ కనురెప్పలలో దాపురించొచ్చు.
- అంజననామిక (హార్డెయోలం లేదా స్టై) - ఇది కనురెప్పల కుదుళ్లకొచ్చే సంక్రమణంవల్ల మరియు కనురెప్ప లోపల ఉండే మెయిబొమియాన్ గ్రంథిలో వచ్చే సంక్రమణంవల్ల కనురెప్పలో దాపురించే ఓ బాధాకరమైన బుడిపె.
- డాక్క్రియోఅడెనిటిస్ మరియు అశ్రుకోశశోథ (Dacryocystitis)- ఇది బ్యాక్టీరియల్ లేదా వైరల్ సంక్రమణ వలన కన్నీరు-స్రవించే గ్రంధి మరియు దాని యొక్క తిత్తి యొక్క వాపు.
- నాసిక వైపున్నకంటిభాగంలో నొప్పి మరియు వాపు
- కన్ను ఎరుపుదేలడం
కనురెప్పల వాపు యొక్క ప్రధాన కారణాలు ఏమిటి?
బాక్టీరియా లేదా వైరస్ల వలన వచ్చే సంక్రమణ అనేది కనురెప్పల వాపుకు ముఖ్య కారణం. సాధారణంగా, కనురెప్పల వాపుతో సంబంధం ఉన్న ఇతర వ్యాధి పరిస్థితులు ఇలా ఉన్నాయి
- తల చర్మం, కనుబొమ్మలు, కనురెప్పలు మొదలైన వాటిలో చమురు గ్రంధులతో కూడిన తల చుండ్రు (సిబోర్హీక్ డెర్మాటిటిస్)
- రోసేసియా (ముఖం మీద చర్మం ఎర్రబడడం మరియు ఎర్రబారడం (flushing). ఇది తరచుగా కంటి వాపుతో కూడుకుని కనిపిస్తుంది
- కనురెప్పలలోని చమురు గ్రంధులతో స్రవించే నూనెప్రమాణంలో తగ్గింపు లేదా అసాధారణత
కనురెప్పల వాపును ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
వైద్యులు వివిధ కనురెప్పవాపుల్ని ప్రధానంగా కంటి యొక్క భౌతిక పరీక్ష మరియు వ్యాధి లక్షణాల చరిత్ర ఆధారంగా విశ్లేషిస్తారు.
కనురెప్పల వాపుకు చేసే చికిత్స వ్యాధికారకాలకు ఉంటుంది, వాపును తగ్గించడం, మరియు వాపు కారణంగా సంభవించే ఇతర లక్షణాల ఉపశమనం ఈ చికిత్స లక్ష్యంగా ఉంటుంది.
- యాంటిబయోటిక్ కంటి చుక్కల మందు ప్రధానంగా సంక్రమణ చికిత్సకు ఉపయోగిస్తారు
- కనురెప్పల వాపు తీవ్రంగా ఉన్నప్పుడు స్టెరాయిడ్ కంటి చుక్కల మందును ఉపయోగిస్తారు
- కనురెప్పల కుదుళ్ళలో వచ్చే వాపుతో (బ్లేఫరిటిస్) పాటు చుండ్రు కూడా రోగికి ఉన్నట్లయితే వైద్యులు సాధారణంగా చుండ్రును నయం చేసే షాంపూను సూచిస్తారు.
స్వీయ రక్షణ చర్యలు ప్రయోజనకరంగా ఉంటాయి
- వెచ్చని కాపడాలు (సంపీడనం) లేదా వేడినీటి కాపడం (fomentation) వాపును తగ్గించడంలో సహాయకారిగా ఉంటుంది. మరియు ఈ ప్రక్రియ కనురెప్పలో చమురు ప్రసరణను పెంచడంలో కూడా సహాయపడుతుంది.
- కనురెప్పల మీద మృదువైన మర్దనం/రుద్దడం కనురెప్పలోని చమురు గ్రంథుల్లో అడ్డంకుల్ని తొలగించడంలో సహాయపడుతుంది
- తేలికపాటి సబ్బునీటిని వెచ్చ చేసి ఆ నీటితో కనురెప్పల్ని సున్నితంగా రుద్దడంవల్ల (స్క్రబ్బింగ్తో) కనురెప్పలపై ఏర్పడ్డ జిగట కంతులు లేదా పొక్కుల్ని శుభ్రం చేయడానికి వీలవుతుంది.
- సరైన పరిశుభ్రతను పాటించడం ద్వారా పునరావృతమయ్యే అంటువ్యాధులను నివారించవచ్చు.