బొబ్బ (లేక పొక్కు) అంటే ఏమిటి?
బొబ్బ లేక పొక్కు అనేది చర్మం ఉపరితలం పై చిన్న చిన్న మాత్రల పరిమాణంలో బుడపలు దేరి, లోపల నీరువంటి ద్రవాన్ని సేకరించుకుని ఉంటాయి. తాకితే మెత్తగా ఉంటాయి ఈ బొబ్బలు. నొప్పి కూడా ఉంటుంది. బొబ్బలు లేదా పొక్కులు అనేవి మన శరీరంపై, చర్మం పైన లేస్తాయి. ముఖ్యంగా చేతులు మరియు కాళ్ళపైన సర్వసాధారణంగా లేస్తాయి. బొబ్బలు సాధారణంగా పారదర్శకంగా ఉండే (నీరులా స్పష్టమైన ద్రవం లేదా సీరం), ద్రవం, రక్తం లేదా చీముతో నిండి ఉంటాయి. తరచుగా చర్మం దెబ్బ తినడం లేదా రాపిడివల్ల చర్మానికి నష్టమేర్పడి ద్రవంతో కూడిన ఈ బొబ్బలేర్పడుతాయి. బొబ్బలోని ఈ ద్రవమే అంతర్లీన కణజాలాన్ని రక్షిస్తుంది.
బొబ్బల యొక్క ప్రధాన సంబంధిత-సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
బొబ్బలు వివిధ సంకేతాలు మరియు లక్షణాల్ని కలిగి ఉంటాయి. ఈ లక్షణాలు బొబ్బల్లేవడానికి గల కారణం మీద ఆధారపడి ఉంటాయి.
- సాధారణంగా బొబ్బలు నొప్పిని కల్గి, ఎరుపుదేలి ఉంటాయి. బొబ్బలెలా ఏర్పడతాయంటే (ఉదాహరణకు) బిగుతైన లేక సౌకర్యంగా లేని, సరిపోని బూట్లు ధరించడం, కాలిన గాయాలు, దెబ్బలు కారణంగా బొబ్బలేర్పడతాయి.
- పొక్కులుదేలి, ఎరుపెక్కిన మరియు చర్మం పొట్టుతో కూడిన బొబ్బలు మంటలవల్ల కాలడం వల్ల మరియు “ఆటోఇమ్యూన్ వ్యాధుల” (ఎపిడెర్మోలిసిస్ బులోసా) కారణంగా ఏర్పడతాయి.
- వైరల్ సంక్రమణ (జ్వరం పొక్కు/బొబ్బ) విషయంలో బొబ్బలతో పాటుగా జ్వరం ఉంటుంది.
- తామర, చర్మ వ్యాధి (చర్మమునకు సూక్ష్మజీవుల సంపర్కము, కురుపులు, పుండ్లు, పసుపు పచ్చ చీముకారు కురుపులు, గజ్జి)కి సంబంధించిన బొబ్బల్లో దురద కూడా ఉంటుంది.
- మంచుగడ్డల కారణంగా ఏర్పడ్డ బొబ్బల విషయంలో చర్మం తెలుపు రంగుదేరి మెరిసేతత్వాన్ని కల్గి ఉంటుంది. తిమ్మిరి-సంబంధమైన లక్షణాన్ని కల్గి ఉంటుంది.
- వడదెబ్బ కారణంగా దాపురించిన బొబ్బల విషయంలో చర్మం కమిలిపోయి, చర్మంపై ముడుతలేర్పడతాయి. .
- పుండ్లు (హెర్పెస్ జోస్టర్), ఆటలమ్మ (పొంగు చల్లడం, chicken pox) మొదలైన వాటి కారణంగా ఏర్పడ్డ బొబ్బల విషయంలో మంట, నొప్పి ఉంటాయి. బొబ్బలపావు పొక్కులు కూడా కట్టవచ్చు.
బొబ్బలకు ముఖ్య కారణాలు ఏమిటి?
చర్మంపై బొబ్బలు ఏర్పడడానికి వివిధ కారణాలున్నాయి.
- చర్మం దీర్ఘకాలికమైన ఘర్షణకు గురవటం,లేదా చర్మాన్ని రుద్దడం, గీరడంవల్ల బొబ్బలేర్పడతాయి.
- వేడి, రసాయనాలు, అతినీలలోహిత కిరణాలు, గడ్డకట్టే ఉష్ణోగ్రత మొదలైన వాటికి గురైన కారణంగా గాయాలై, తద్వారా బొబ్బలెక్కటం.
- చికెన్ పాక్స్, హెర్పెస్ , జోస్టర్, మరియు చర్మ వ్యాధుల వంటి వ్యాధులవల్ల బొబ్బలేర్పడుతాయి.
- పిమ్ఫిగస్, ఎపిడెర్మోలిసిస్ బల్లోసా మొదలైన రోగనిరోధక వ్యవస్థ రుగ్మతలవల్ల బొబ్బలు
- కొన్ని మొక్కలు (పాయిజన్ ఐవీ, ఓక్, మొదలైనవి), రసాయనాలు మొదలైన వాటికి మన చర్మం గురై వచ్చే అలెర్జీ ప్రతిస్పందన కారణంగా బొబ్బలేర్పడతాయి.
బొబ్బల్ని ఎలా నిర్ధారిస్తారు మరియు వీటికి చికిత్స ఏమిటి?
శారీరక పరీక్ష, బొబ్బల లక్షణాల చరిత్ర, మరియు వివిధ పరీక్షల ద్వారా బొబ్బలు నిర్ధారణను వైద్యులు చేపడతారు.
- పరీక్ష మరియు చరిత్ర
- స్వరూపం - స్పష్టమైన లేక పారదర్శకమైన ద్రవం, రక్తం లేదా చీము కలిగిన బొబ్బలు
- స్థానం - శరీరం యొక్క ఒక వైపు లేదా నిర్దిష్ట ప్రదేశంలో లేదా మొత్తం శరీరం మీద బొబ్బలు
- లక్షణాల చరిత్ర - నొప్పి, దురద, జ్వరము మొదలైనవాటికి సంబంధించిన బొబ్బలు
- పరీక్షలు
- పూర్తిస్థాయి రక్తగణన పరీక్ష చేయించండి
- అలెర్జీని గుర్తించడానికి IgE స్థాయిలు, IgG, IgM మరియు స్వీయ రోగనిరోధక వ్యాధులకు ఇతర అధునాతన పరీక్షలు.
- పొక్కు నుండి తీసుకున్న ద్రవం నమూనా పై “బాక్టీరియా కల్చర్” పరీక్ష చేయడంవల్ల సంక్రమణకు కారణమయ్యే బాక్టీరియాను కనుగొనడంలో సహాయపడుతుంది. ఇదే పరీక్ష ఈ బోబ్బా చికిత్స కోసం కావలసిన యాంటిబయోటిక్ మందునును నిర్ణయించడంలో కూడా సహాయపడుతుంది.
- బాక్టీరియా లేదా వైరస్ ఉనికిని నిర్ధారించడానికి పాలిమరెస్ చైన్ రియాక్షన్ లేదా PCR పరీక్ష.
- రక్త అలెర్జీ పరీక్ష మరియు చర్మ అలెర్జీ పరీక్ష అలెర్జీని గుర్తించడానికి నిర్వహిస్తారు.
- స్కిన్ బయాప్సీ - చర్మం (స్కిన్) మాదిరిని బోబ్బా కారణాన్ని గుర్తించటానికి ఒక సూక్ష్మదర్శిని క్రింద పరీక్షించబడుతుంది మరియు బొబ్బకు ఇతర కారణాలు ఏవీ లేవని నిర్ధారించుకోవడానికి ఈ పరీక్ష వల్ల వీలుంటుంది.
- బోబ్బా ఏర్పడడానికి కారణమయ్యే యాంటీజెన్లు మరియు ప్రతిరక్షక పదార్థాల ఉనికిని గుర్తించడానికి ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తారు.
- వారసత్వ సమస్యలను గుర్తించడానికి జన్యు పరీక్షలు నిర్వహిస్తారు.
బొబ్బలు సాధారణంగా ఔషధాలవసరం లేకుండానే నయమవుతాయి. బొబ్బల చికిత్సకు మందుల్ని ఎప్పుడు ఉపయోగిస్తారంటే:
- యాంటీబయాటిక్స్ ను కింది సందర్భాల్లో వాడతారు
- బొబ్బ (పొక్కు) చీముతో నిండి ఉన్నప్పుడు దాని సంక్రమణ చికిత్సకు
- బొబ్బలు మళ్ళీ వస్తే అపుడు యాంటీబయాటిక్స్ ను వాడతారు.
- తీవ్రమైన బొబ్బలు కోసం: అలెర్జీ, ఫోటోసెన్సిటివిటీ లేదా బర్న్స్ కారణంగా సంభవించే బొబ్బల చికిత్సకోసం.
- బొబ్బలు నోటి లోపల లేదా ఇతర అసాధారణ ప్రాంతాల్లో కనిపిస్తే వాటి చికిత్సకు
-
యాంటీవైరల్ మందులు
-
ఆటలమ్మ (Chickenpox), హెర్పెస్ జోస్టర్ లేదా జ్వరం కారణంగా వచ్చే బొబ్బల చికిత్స కోసం.
-
- కార్టికోస్టెరాయిడ్స్ మరియు రోగనిరోధక శక్తి మాడ్యులేటింగ్ మందులు స్వీయ రోగనిరోధక వ్యాధుల కారణంగా ఏర్పడే బొబ్బల చికిత్సకు ఉపయోగిస్తారు.
- నొప్పి తగ్గించడానికి యాంటీ ఇన్ఫ్లమేటరీ (వాపు,నొప్పి నివారణా మందులు) మందులు వాడతారు.
- దురదను తగ్గించడానికి దుష్ప్రభావ-నివారణా మందులు వాడతారు.
- ఎండవేడికి కమిలిన మచ్చల్ని నిరోధించడానికి సన్స్క్రీన్ లోషన్లు (sunscreen lotions) ఉపయోగిస్తారు.
- చాలా తీవ్రమైన బొబ్బల కారణంగా అంగవైకల్యమేర్పడే ప్రమాదముండే సందర్భాల్లో, శస్త్రచికిత్స మరియు చర్మం అంటుకట్టడం (skin grafting) వంటి శస్త్రచికిత్సలు అవసరమవుతాయి.
స్వీయ రక్షణ
- బొబ్బను చిదమటం బొబ్బ మీది నుండి పొక్కుల్ని, చర్మాన్ని లాగడం/పీకడం చేయకండి.
- బొబ్బలోని నీరు, చీము వంటి ద్రవాల్ని బయటకు తీసేసిన తర్వాత ఒక మృదువైన దూది తదితరాలతో డ్రెస్సింగ్ చేసి బొబ్బను బాగా కప్పండి.
- మీకు బాగా సరిపోని బూట్లను దరించకండి, బిగుతుగానో, వదులుగానో ఉండే బూట్లు వేసుకుంటే బొబ్బలెక్కే ప్రమాదముంది.
- బొబ్బలు పగిలిపోకుండా నివారించడానికి సరైన, మెత్తని మద్దతునిచ్చే మెట్టలవంటి ప్యాడ్లను వాడండి. ముఖ్యంగా పాదం మీది బొబ్బల విషయంలో బోబ్బా మిగలకుండా మెత్తని సాక్స్ లేదా “ఇన్సోల్ పాడింగ్” లను ను ఉపయోగించండి.