సూక్ష్మశ్వాసనాళికలు ఉబ్బుట (బ్రోన్కిటీయాసిస్) అంటే ఏమిటి?
ఊపిరి తిత్తుల యొక్క సంక్రమణ (infection) కారణంగా ఊపిరితిత్తుల యొక్క గోడలు గట్టిపడిపోయే ఒక దీర్ఘకాలిక పరిస్థితిని సూక్ష్మశ్వాసనాళికలు ఉబ్బుట లేదా బ్రోన్కిటీయాసిస్ అని అంటారు. ఊపిరి తిత్తుల గోడలు కూడా మెత్తగా మారిపోయి మరియు గాయాలు ఏర్పడతాయి, ఫలితంగా శాశ్వత నష్టం జరుగుతుంది.
ఈ స్థితిలో, గాలి వెళ్లే దారులు వాటి శ్లేస్మాన్ని (mucus) బయటకు తీసే సామర్థ్యాన్ని కోల్పోతాయి. అందువల్ల ఊపిరి తిత్తులలో శ్లేష్మం ఎక్కువగా చేరి బ్యాక్టీరియా పెరుగుదలకు అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది, ఇది అధికమైన ఊపిరితిత్తుల సంక్రమణలకు దారితీస్తుంది.
ఊపిరితిత్తులలో ఇటువంటి అంటువ్యాధులు గాలి మార్గాలలో నుంచి, గాలిలోనికి మరియు బయటికి వెళ్ళటానికి ఉండే సామర్ధ్యాన్ని తగ్గించేస్తాయి, దీని వలన శరీరంలో ముఖ్య అవయవాలకు ప్రాణవాయువు (oxygen) యొక్క సరఫరా తగ్గిపోతుంది.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
బ్రోన్కిటీయాసిస్ యొక్క సాధారణ లక్షణాలు:
- తరచూ కఫంతో కూడిన దగ్గు
- ఊపిరి అందకపోవడం పనిచేస్తున్నప్పుడు ఇంకా పెరుగుతుంది
- శ్వాసలో గురక శబ్దం
- ఛాతీ నొప్పి
- చేతివేళ్లు కర్రల్లా మారుతాయి - గోరు మందంగా మరియు చేతివేళ్లు క్రింద కణజాలం గుండ్రంగా మరియు ఉబ్బెత్తుగా మారతాయి
- సమయం పెరిగేకొద్దీ, శ్లేష్మంతో రక్తం కూడా రావచ్చు
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
అనేక సందర్భాల్లో, ఊపిరి తిత్తుల యొక్క గోడలు గట్టిపడటం వలన గాలి మార్గాలలో ఏర్పడిన సంక్రమణ ఫలితంగా సూక్ష్మశ్వాసనాళికలు ఉబ్బుట లేదా బ్రోన్కిటీయాసిస్ సంభవిస్తుంది. అయితే, కొన్ని సందర్భాల్లో, కారణం తెలియదు (ఇడియోపతిక్ బ్రోన్టిచెక్టసిస్).
కొన్ని కారణాలు:
- దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులు న్యుమోనియా, కోరింత దగ్గు (whooping cough) లేదా క్షయవ్యాధి వంటి ఆరోగ్య చరిత్ర
- రుమటాయిడ్ ఆర్థరైటిస్
- క్రోన్'స్ వ్యాధి, ఇది ప్రేగు వాపు వ్యాధి
- తగ్గిన రోగనిరోధక శక్తి (ఇమ్యునోడెఫిసియెంట్స్టేటస్)
- సిస్టిక్ ఫైబ్రోసిస్ - గాలి మార్గాలలో శ్లేష్మం అడ్డుపడే ఒక రకమైన జన్యు లోపము. ఇది బాక్టీరియా పెరుగుదలకు అనుకూలమైన పరిస్థితి
- క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD)
ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
వైద్యులు స్టెతస్కోప్ ఉపయోగించి అసాధారణ ఊపిరితిత్తుల శబ్దాలు విని, సంక్రమణను తనిఖీ చేయడానికి రక్త పరీక్షలు చేయించమని సలహా ఇవ్వవచ్చు.
- కఫం పరీక్ష(Sputum test) - ఇది కఫంలో బాక్టీరియా లేదా ఫంగస్ ఉన్నదా అని తనిఖీ చేయడానికి
- CT స్కాన్ లేదా ఛాతీ యొక్క ఎక్స్- రే (X- రే)
- ఊపిరితిత్తుల పనితీరు పరీక్ష, ఇది రోగి పీల్చుకున్న గాలి పరిమాణం మరియు శ్వాసను ఎంత వేగంగా బయటకు మరియు లోనికి తీసుకుంటున్నడో అనేది అంచనా వేస్తుంది. అలాగే రక్తంలోకి ఎంత ఆక్సిజన్ వెళ్తున్నదో కూడా తనిఖీ చేస్తుంది
- సిస్టిక్ ఫైబ్రోసిస్ తనిఖీ కోసం చెమట పరీక్ష(Sweat test)
- శ్వాసకోశం యొక్క లోపలి భాగాలను చూడడానికి బ్రాంకోస్కోపీ చేయవచ్చు
సూక్ష్మశ్వాసనాళికలు ఉబ్బుట లేదా బ్రోన్కిటీయాసిస్ ను సాధారణంగా క్రింది విధంగా నిర్వహించవచ్చు:
- యాంటీబయాటిక్స్ వంటి మందులు, ఎక్సపెక్టోరెంట్స్ (expectorants) మరియు మ్యుకొలైటిక్స్ (mucolytics) ను సాధారణంగా ఉపయోగిస్తారు. బ్రోన్కోడైలేటెర్స్ (Bronchodilators) మరియు కార్టికోస్టెరాయిడ్స్ వంటి ఇతర మందులును అవసరం బట్టి ఉపయోగిస్తారు
- హైడ్రేషన్ - నీటిని త్రాగటం పుష్కలంగా తాగడం అనేది సూచించబడుతుంది, శ్వాసకోశాలను అది తేమ పరుస్తుంది మరియు శ్లేష్మం యొక్క జిగురుదానాన్ని తగ్గిస్తుంది, తద్వారా శ్లేష్మాన్ని సులభంగా బయటకి పంపవచ్చు
- చెస్ట్ ఫిజికల్ థెరపీ
- ఆక్సిజన్ థెరపీ
బ్రోన్కిటీయాసిస్ తో జీవించడం :
- బ్రోన్కిటీయాసిస్ వలన బాధపడుతుంటే, న్యుమోనియా వంటి ఊపిరితిత్తుల అంటువ్యాధులను నివారించడానికి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. బ్యాక్టీరియా సంక్రమణలను నివారించడానికి తరచుగా చేతులను కడగడం మరియు న్యుమోనియా టీకాలు కోసం వైద్యున్ని తనిఖీ చెయ్యాలి.
- ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అనుసరించాలి, ధూమపానాన్ని నివారించాలి మరియు నీరు బాగా తాగాలి.
- శారీరకంగా చురుకుగా ఉండటం కూడా సహాయపడుతుంది.