హృదయ స్తంభన (కార్డియాక్ అరెస్ట్) అంటే ఏమిటి?
హృదయ స్తంభన అనేది గుండె పని తీరు యొక్క ఆకస్మిక లోపం లేదా తగ్గుదల దాని ఫలితంగా, స్పృహ కోల్పోవడం, మరియు శ్వాసను కోల్పోవడం జరుగుతుంది. శరీరం గుండెకు రక్త ప్రసరణను ఆపివేసినప్పుడు, క్రమంగా శరీరంలో మిగిలిన అవయవాలకు రక్త ప్రసరణ అనేది ఆగిపోతుంది అప్పుడు హృదయ స్తంభన అనేది సంభవిస్తుంది.
చాలామంది గుండెపోటు మధ్య హృదయ స్తంభన మధ్య తేడా గురించి గందరగోళానికి గురైవుతారు; గుండె కండరాలకు రక్తం ప్రసరణ నిరోధించబడినప్పుడు గుండెపోటులు సంభవిస్తాయి. హృదయ స్తంభనను గుండెపోటులు అనేవి ప్రేరేపించగలవు, కానీ అది గుండె పోటు అని పొరపడ కూడదు.హృదయ స్తంభనకు, వెంటనే చికిత్స చేయకపోతే, మరణానికి దారితీస్తుంది.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
హృదయ స్తంభన సంకేతాలు అత్యంత ఆందోళనకరమైనవి మరియు అప్రమత్తమావలసినవి:
- శ్వాసను కోల్పోవడం
- నాడి లేకపోవడం
- ఆకస్మికంగా కింద పడిపివడం
- వెంటనే స్పృహ కోల్పోవడం
- పేలవమైన మరియు చల్లని చర్మం
హృదయ స్తంభన (కార్డియాక్ అరెస్ట్) యొక్క ప్రధాన కారణాలు ఏమిటి?
అరిథ్మియా లేదా హృదయ స్పందనలో అసహజత అనేది గుండె యొక్క విద్యుత్ వ్యవస్థను (electrical system) ప్రేరేపిస్తుంది అది హృదయ స్తంభనకు (కార్డియాక్ అరెస్ట్) దారి తీస్తుంది. గుండెకు ఎలెక్ట్రిక్ ప్రవాహాన్ని తీసుకునే నాడులు బంధింపబడినప్పుడు అరిథ్మియాలు ఏర్పడతాయి. కొన్ని సందర్భాల్లో, అవి చిన్న పరిమాణాలలో మాత్రమే ఏర్పడతాయి మరియు ప్రమాదకరం కాదు. కానీ ఇది పెరిగినప్పుడు, ప్రాణాంతకమైన హృదయ స్తంభనను (కార్డియాక్ అరెస్ట్) కలిగించవచ్చు.
అరిథ్మియా యొక్క అత్యంత సాధారణ రకం వెంట్రిక్యులర్ ఫిబ్రిలేషన్ (ventricular fibrillation), ఇందులో ప్రేరణలు (impulses) వేగంగా ఉంటాయి మరియు జఠరికలను (ventricle) రక్త ప్రసరణ బదులుగా కంపించి పోవడానికి కారణమవుతాయి.
ఆరోగ్యకరమైన శరీరంలో ఆరోగ్యకరమైన గుండెకు హృదయ స్తంభన (కార్డియాక్ అరెస్ట్) అనేది అసంభవం. ఇది బాహ్య అఘాతం, మందులు, గాయం లేదా గతంలో ఏర్పడిన గుండె సమస్యలు వంటి వాటి నుండి ఉత్పన్నమవుతుంది.
ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
వైద్యులు కార్డియాక్ అరెస్ట్ గురించి అంతర్లీన కారణాన్ని కనుగొనడం చాలా అవసరం. వాటిని గుర్తించడానికి పరీక్షలు ఉన్నాయి:
- హృదయ స్పందన మరియు హృదయ స్పందన తీరుని సూచించే అసాధారణ పరిస్థితుల ఉనికిని పరిశీలించడానికి ECG
- ఖనిజాలు (minerals), రసాయనాలు మరియు హార్మోన్ల స్థాయిలను గుర్తించేందుకు రక్త పరీక్షలు,
గుండె ఆకారం, పరిమాణం, గుండె ఆరోగ్యం, మరియు ఏదైనా లోపం గురించి తనిఖీ చేసే ఇమేజింగ్ పరీక్షలు. ఈ పరీక్షలు:
- ఎఖోకార్డియోగ్రామ్ ధ్వని తరంగాలను ఉపయోగించడం ద్వారా గుండె కవాటాల సామర్ధ్యం మరియు అసమానతలను తనిఖీ చేస్తుంది
- రక్తం ప్రసరణ తనిఖీ కోసం న్యూక్లియర్ స్కాన్
- గుండె ఆరోగ్యం మరియు గుండె వైఫల్య తనిఖీ కోసం ఛాతీ ఎక్స్-రే (X-ray)
ఆంజియోగ్రామ్ (angiogram), ఎలక్ట్రోఫిజియోలాజికల్ మ్యాపింగ్ (electrophysiological mapping) మరియు ఎజెక్షన్ ఫ్రాక్షన్ పరీక్ష (ejection fraction testing ) వంటి ఇతర పరీక్షలు ఇది హృదయ ధమనులలో అడ్డంకుల యొక్క మూలాన్ని మరియు అరిథ్మియాను కనుగొనటానికి సహాయం చేస్తాయి.
2 రకాల చికిత్సలు ఉన్నాయి:
రోగి మనుగడ కోసం అక్కడిక్కడే వేగవంతమైన చికిత్సఅవసరం.
- మొదట శరీరంలో ఆక్సిజన్ ప్రసరణని నిర్వహించడానికి సిపిఆర్ చాలా కీలకమైనది మరియు సహాయాన్ని అందించే వరకు అది రోగిని స్పృహలో ఉంచుతుంది.
- డీఫిబ్రిలేషన్ (Defribrillation) అనేది విద్యుత్ షాక్ ద్వారా ఇవ్వబడుతుంది, ఇది గుండె సాధారణ స్పందనకు చేరుకునేలా చేస్తుంది.
పునరావృత్తమైయ్యే ప్రమాదాన్ని తగ్గించడానికి మరియు మంచి గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి నిరంతర మందుల చికిత్స ఉంటుంది
- బీటి బ్లాకర్స్ అని పిలవబడే అరిథ్మియా మందులు
- ఐసిడి (ICD, ఇంప్లాంటబుల్ కార్డియాక్ డీఫిబ్రిలేటర్) అని పిలిచే ఒక బ్యాటరీ ఆధారిత పరికరాన్ని, అరిథ్మియాలను గుర్తించడానికి, హృదయ స్పందనలను పర్యవేక్షించేందుకు కాలిబోన్లో (collarbone) అమర్చవచ్చు మరియు అది అడ్డంకులను గుర్తించి వెంటనే షాక్ తరంగాలతో వాటిని తొలగిస్తుంది.
- యాంజియోప్లాస్టీ లేదా కరోనరీ బైపాస్ను అడ్డంకులను సరిచేయడానికి మరియు హృదయ కండరాలకు రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడానికి చేస్తారు
- గుండె లేదా కవాటాలలో ఏదైనా వైకల్యాల అలాగే దీర్ఘకాలిక ప్రమాదాన్ని తగ్గించడానికి కోసం సంక్లిష్ట శస్త్రచికిత్సను (Corrective surgery)చేస్తారు