పిల్లల్లో ఆస్తమా - Asthma in Children in Telugu

Dr. Ayush PandeyMBBS,PG Diploma

November 29, 2018

March 06, 2020

పిల్లల్లో ఆస్తమా
పిల్లల్లో ఆస్తమా

పిల్లలలో ఆస్తమా అంటే ఏమిటి?

తెరలుగా  దగ్గు , గుర్రుగుర్రుమని శ్వాసవదలడం, మరియు శ్వాసలో కష్టాల యొక్క పరిస్థితితో కూడిన దీర్ఘకాలిక వ్యాధి ఆస్త్మా. సుమారుగా, ఆస్త్మాలో సగం కేసుల్లో పిల్లలే నమోదు చేయబడ్డారు. బిరుసైన శ్వాసమార్గాల (ఎయిర్వేస్) కారణంగా పిల్లలు ఎక్కువగా ఆస్తమాకు గురవడం జరుగుతూ ఉంటుంది.పెద్దవారితో పోలిస్తే ఆస్తమా పిల్లలలోనే చాలా తీవ్రతరమైందిగా కన్పిస్తుంది. కాబట్టి, పిల్లలలో ఆస్తమాను గుర్తించడం మరియు దానికి చికిత్స చేయడం చాలా కీలకమైనది. చాలామంది పిల్లలు కౌమారదశలోకి ప్రవేశించే సమయానికి ఆస్త్మా నుండి ఉపశమనం పొందుతారు.

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

ఆస్తమా యొక్క లక్షణాల్ని పిల్లల్లో ముందుగానే చూడవచ్చు, తరచుగా అవి 5 ఏండ్ల వయసుకు ముందుగానే పిల్లల్లో చూడవచ్చు. ఈ వ్యాధి లక్షణాలు చాలా ప్రకటింతంగా పైకి గోచరిస్తూ ఉన్నప్పటికీ, అది నిజంగా ఆస్తమా అని నిర్ధారించడానికి కష్టంగా ఉండవచ్చు. విభిన్న పిల్లలు వివిధ రకాలైన లక్షణాలను అనుభవిస్తారు, వాటిలో చాలా సాధారణమైనవి:

  • నిరంతరమైన దగ్గు
  • గురక (గుర్రుగుర్రుమని శ్వాసవదలు, గుర్రుపెట్టు)
  • తరచుగా జలుబు
  • ఛాతీలో అడ్డంకుతో కూడిన సంకోచం (కన్స్ట్రక్షన్), ఫలితంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వేగవంతమైన శ్వాస

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

ఆస్తమా యొక్క ప్రధాన కారణాలు:

  • జంతు పొలుసులు (లేక బొచ్చు), దుమ్ము, పుప్పొడి మరియు అచ్చు వంటి వివిధ అలెర్జీ కారకాలు
  • వ్యాయామం మరియు అధిక ఎత్తులో ఉండడంవల్ల
  • శీతల వాతావరణం మరియు / లేదా వాతావరణంలోని మార్పులు
  • జలుబు మరియు ఫ్లూ వంటి అంటువ్యాధులు
  • ధూమంతో పాటు మంటను, నొప్పిని కల్గించే ప్రకోపనకారకాకాలు మరియు  కాలుష్యకారకాలు

వ్యాధి లక్షణాలు ఉదయాన్నే అయితే సాధారణంగా ఎక్కువగా కనిపిస్తాయి. లేక రాత్రి చివరిలో కూడా లక్షణాలు గోచరిస్తాయి.   

ఆస్తమాను ఎలా నిర్ధారణ చేసేది మరియు దీనికి చికిత్స ఏమిటి?

వైద్యుడు జనన సమయంలో శ్వాస సమస్యల మరియు ఆస్త్మా యొక్క కుటుంబ చరిత్రతో పాటుగా వివరణాత్మక వైద్య చరిత్రను పొందుతాడు. గుండె మరియు ఊపిరితిత్తుల యొక్క శారీరక పరీక్ష తరువాత నిర్వహించబడుతుంది. ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని కొలిచే ఒక ఊపిరితిత్తుల పనితీరు పరీక్షకు వైద్యులు సలహా ఇస్తారు, ఈపరీక్షలో శ్వాస ద్వారా ఎంత గాలినిలోనికి పీల్చబడుతోంది మరియు ఎంత మొత్తం గాలి బయటకి వదలబడుతోందన్నది అనేదాన్నికొలుస్తారు.

ఆస్తమాకు చికిత్స సాధారణంగా రెండు పదరాలు (folds) గా ఉంటుంది:

  • వెంటనే ఉపశమనం: ఆస్తమా దాడి సంభవిస్తే ఇది తక్షణ చికిత్స. వైద్యులు సాధారణంగా ఇన్హేలర్లను సూచిస్తారు, ఇది లక్షణం అనుభవించిన వెంటనే ఉపయోగం కోసం ఉద్దేశించబడింది. దగ్గు మరియు శ్వాసకోశ చికిత్సలో తక్షణ ఉపశమనం కోసం ఇది ఉద్దేశించబడింది.
  • దీర్ఘకాల చికిత్సలో వాయుమార్గాలలో వాపును తగ్గిస్తుంది మరియు శ్వాస కోసం, స్వచ్చమైన గ్యాలిని అందించడానికి స్టెరాయిడ్స్ మరియు బీటా అగోనిస్టులు వంటి మందులను ఉపయోగిస్తారు.
  • అదనంగా, అలెర్జీ కారకాలు మరియు ఆస్తమా దాడుల సంభావ్య కారకాల్ని  నివారించడానికి వైద్యులు రోగిపై నిశిత నిఘాను సూచించవచ్చు. కొన్ని సందర్భాల్లో, అలర్జీ షాట్లు కూడా ఇవ్వవచ్చు.



వనరులు

  1. American Academy of Allergy, Asthma and Immunology [Internet]. Milwaukee (WI); Asthma in Children
  2. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Asthma in Children
  3. Wim M. van Aalderen. Childhood Asthma: Diagnosis and Treatment. Scientifica (Cairo). 2012; 2012: 674204. PMID: 24278725
  4. U.S. Department of Health & Human Services. Asthma in children. Centre for Disease Control and Prevention
  5. Better health channel. Department of Health and Human Services [internet]. State government of Victoria; Asthma in children

పిల్లల్లో ఆస్తమా కొరకు మందులు

Medicines listed below are available for పిల్లల్లో ఆస్తమా. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.

Medicine Name

Price

₹57.45

Showing 1 to 0 of 1 entries