దీర్ఘకాలిక తెల్లరక్తకణాల లుకేమియా అంటే ఏమిటి?
దీర్ఘకాలిక తెల్లరక్తకణాల లుకేమియా (Chronic Lymphocytic Leukemia-CLL) అనేది శరీరంలోని ఓ రకం తెల్లరక్త కణాలకు దాపురించే ఒక క్యాన్సర్ రకం. ఎముకమజ్జలో (inside bone marrow) ఉంటూనే తెల్లరక్తకణాలు ఈ రుగ్మతను కలుగజేస్తాయి. వయోజనులు లేదా పెద్దవాళ్ళలో చాలా ఎక్కువగా కనిపించే పాండురోగం రకం ఇది. దీర్ఘకాలిక తెల్లరక్తకణాల పాండురోగంలో రెండు రకాలున్నాయి:
- ఓ రకం CLL వ్యాధి నెమ్మదిగా పెరుగుతున్నందున కనిపించడానికి ఎక్కువ సమయం పడుతుంది.
- మరో రకం CLL వ్యాధి మరింత తీవ్రమైన రూపం, ఇది వేగంగా పెరుగుతుంది.
ఈ రుగ్మత పశ్చిమదేశాల్లో (25% -30%) కనిపిస్తుండగా భారతదేశంలో (1.7% -8.8%) అసాధారణమైనది.
CLL యొక్క సంభవం సంవత్సరానికి 100,000 మంది పురుషులు మరియు ఆడవారికి 4.7 గా ఉంది.
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
అనేక సందర్భాల్లో, CLL సంవత్సరాల తరబడి ఎలాంటి లక్షణాలను వెల్లడించదు. CLL క్యాన్సర్ వ్యాప్తి చెందిన తర్వాత చాలా కాలం తరువాత వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి, ఇది ముఖ్యంగా శోషరస కణుపులు, కాలేయం మరియు ప్లీహములను బాధిస్తుంది. దీని లక్షణాలు ఇలా ఉంటాయి:
- మెడ, చంకల్లో, కడుపు లేదా గజ్జల్లో శోషరస కణుపుల నొప్పిలేని వాపు
- అలసట
- పక్కటెముకల క్రింద నొప్పి
- జ్వరం
- రాత్రి చెమటలు
- తరచుగా అంటువ్యాధులు
- వివరించలేని బరువు నష్టం
దీనికి ప్రధాన కారణాలు ఏమిటి?
CLL యొక్క ఖచ్చితమైన కారణం తెలియకపోయినా, రక్త కణాల పెరుగుదల మరియు అభివృద్ధిని నియంత్రించే జన్యువులలో మార్పు (ఉత్పరివర్తన) కారణంగా తలెత్తుతుందని భావించబడుతుంది. ఈ మార్పు కారణంగా కణాలు అసహజమైన, అసమర్థ తెల్లరక్తకణాల (లింఫోసైట్లు) ను ఉత్పత్తి చేస్తాయ్, ఇలా ఉత్పత్తి అయినవి విపరీతంగా పెరిగి రక్తంలోను మరియు కొన్ని ఇతర అవయవాల్లో జమవుతాయి. ఈ కణాలు రక్త కణాల ఉత్పత్తిని కూడా బాధించి నష్టం కలుగ చేస్తాయి.
ప్రమాద కారకాలు:
- మధ్య వయస్కులు లేదా ఇంకా వయసులో పెద్దయినవారు
- CLL యొక్క కుటుంబ చరిత్ర లేదా శోషరసగ్రంథుల క్యాన్సర్
- శ్వేతజాతీయులు, యూదుల (jewish) సంతతికి చెందిన రష్యన్ మరియు తూర్పు యూరోపియన్ ప్రజలు
- హెర్బిసైడ్లు మరియు క్రిమిసంహారకాలు వంటి కొన్ని రసాయనాలకు గురికావడం
ఈ రుగ్మతను ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
దీర్ఘకాలిక తెల్లరక్తకణాల లుకేమియా (CLL) క్రింది పద్ధతుల ద్వారా రోగ నిర్ధారణ చేయబడుతుంది:
- శారీరక పరీక్ష మరియు చరిత్ర: మొత్తం ఆరోగ్య తనిఖీ.
- సంపూర్ణ రక్త గణన (CBC): అన్ని రక్త కణాల పరిమాణం మరియు సంఖ్యను తనిఖీ చేయడానికి.
- ఇమ్మ్యూనోఫెనోటైపింగ్ (Immunophenotyping) లేదా ఫ్లో సైటోమెట్రీ: తెల్లరక్తకణాల (WBC) రక్షకపదార్థ జనకాల్ని తనిఖీ చేయడం కోసం.
- సిటు హైబ్రిడైజేషన్ (FISH) లో ఫ్లోరోసెన్స్: జన్యు సమాచారమును అంచనా వేయడానికి.
దీర్ఘకాలిక తెల్లరక్తకణాల లుకేమియా (CLL) తో ఉన్నవారికి ఐదు ప్రామాణిక చికిత్సలు:
- వ్యాధి ప్రారంభ దశలో రోగి పరిస్థితిని సన్నిహితంగా పర్యవేక్షించండం
- రేడియేషన్ థెరపీ
- కీమోథెరపీ
- ప్లీహము తొలగించడానికి శస్త్రచికిత్స
- మోనోక్లోనల్ యాంటీబాడీస్తో చేయాలని సంకల్పించిన లక్ష్య చికిత్స
- ఎముక మజ్జ మార్పిడి
అనుగమనం (Follow Up):
- వ్యాధిని గుర్తించిన తరువాత, వ్యాధి యొక్క పురోగతిని పర్యవేక్షించడానికి పరీక్షలు అవసరమవుతాయి.
- చికిత్స వ్యాధిని పూర్తిగా నయం చేయలేకపోవచ్చు, మరియు ఉపశమనకాలం తర్వాత లక్షణాలను అభివృద్ధి చేయవచ్చు.
- చికిత్సలు కొన్ని వారాలు లేదా నెలలు లేదా కొన్ని సంవత్సరాల వరకూ కూడా ఉండవచ్చు.
- తదుపరి వ్యాధి నిర్వహణ మునుపటి చికిత్స ప్రభావం పై ఆధారపడి ఉంటుంది.
జీవనశైలి (లైఫ్స్టయిల్) సవరింపులు:
- దూమపానం వదిలేయండి.
- మంచి పరిశుభ్రతను పాటించడం ద్వారా సంక్రమణ ప్రమాదాన్ని తగ్గించండి.
- ఆహార మార్పులు. ఆహార నిపుణుడి సహాయంతో మీకు హితకరమైన భోజన ప్రణాళికను సిద్ధం చేయండి.
- క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి.
- ఒత్తిడి మరియు అలసటను నిర్వహించండి. ప్రాధాన్యత గల్గిన పనులకు ప్రాధాన్యమివ్వండి, మీ రోజువారీ పనుల్ని చేయడానికి ఇతరులను అనుమతించండి.
- కుటుంబం, స్నేహితులు మరియు మద్దతు సమూహాల మద్దతును కోరండి.
- సలహాల సమావేశాలకు వెళ్ళండి.