ప్రలాపము (డెలిరియం) అంటే ఏమిటి?
ప్రలాపము (డెలిరియం) అనేది మెదడు పనితీరులో ఒక ఆకస్మిక క్షీణత అది మానసిక రుగ్మతకు దారితీస్తుంది. డెలిరియంలో, ఒక వ్యక్తి వేగంగా మారుతున్న మానసిక స్థితులను అనుభవిస్తాడు. ఇది ఒక తీవ్రమైన గందరగోళ పరిస్థితిగా కూడా పిలువబడుతుంది.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
- వేగంగా మారే మానసిక స్థితులు అనేవి ప్రలాపము (డెలిరియం) యొక్క ముఖ్య లక్షణం. మార్పులు ఈ క్రింది విధంగా కనిపిస్తాయి:
- ఆకస్మిక గందరగోళం (స్థితిభ్రాంతి)
- జాగ్రత్త మరియు శ్రద్ధ
- చింత మరియు గ్రహణశక్తి
- కండరాల సమన్వయము: ప్రలాప (డెలిరియం) స్థితిలో, వ్యక్తి నెమ్మదిగా కదలడం (హైపోయాక్టివ్, hypoactive) లేదా విరామం లేని, ఆందోళకరమైన కదలికలను చూపవచ్చు (హైప్రాక్టివ్,hyperactive)
- నిద్ర విధానాలు లేదా రోజువారీ పనులు మారడం
- భావోద్వేగాలు మరియు వ్యక్తిత్వం మారడం
- గందరగోళ స్పృహ
- మేధాశక్తీ నైపుణ్యాల లోపం
- ఇతర లక్షణాలు:
- ఆపుకొనలేని మూత్రవిసర్జన
- చిన్న చిన్న విషయాలు మర్చిపోవడం మరియు గుర్తు తెచ్చుకోలేకపోవడం (మరింత సమాచారం: జ్ఞాపకశక్తి తగ్గుదల కారణాలు)
- స్పృహ లేదా అవగాహన యొక్క మసకతనం
- అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నప్పుడు స్పష్టంగా కనిపించే ఆలోచనా లోపం
- నాడీ వ్యవస్థలో మార్పుల వలన వణుకు వంటి కదలికలు
- దృష్టి కేంద్రీకరించడంలో సమస్య
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
ప్రలాపము (డెలిరియం) అనేక కారణాల వలన సంభవించే సమస్య:
- డెలిరియం ఒక అంతర్లీన కారణం వలన కూడా సంభవించవచ్చు, అవి ఈ విధంగా ఉన్నాయి :
- చిత్తవైకల్యం ( వ్యక్తి యొక్క జ్ఞాపకశక్తిని నెమ్మదిగా ప్రభావితం చేసే, చికిత్స చేయలేని ఒక రుగ్మత)
- స్ట్రోక్ వంటి ప్రాణాంతక అనారోగ్యాలు; మెనింజైటిస్, ఎన్సెఫాలైటిస్, మరియు మెదడు కురుపులు వంటి నరాల సంబంధిత సంక్రమణలు (ఇన్ఫెక్షన్లు) / వాపులు; మెదడు కణితులు; మెదడు గాయాలు
- పెద్ద శస్త్ర చికిత్స
- కొన్ని సాధారణ, తగ్గించగలిగే కారణాలు: (న్యూరోలాజికల్ కానీ కారణాలు)
- నరాల సంకేతాలను ప్రసారం చేసే రసాయనాల్లో అసమతుల్యత.
- మందుల అధిక మోతాదు, ప్రతికూల మందుల ప్రతిచర్యలు, లేదా మందుల పరస్పర చర్యలు.
- మద్య దుర్వినియోగం. మద్యపాన అలవాటును మానడానికి ప్రయత్నించినప్పుడు కూడా డెలిరియం లక్షణాలు సంభవించవచ్చు.
- శరీరంలో ఎలక్ట్రోలైట్ల అసమతుల్యత, హార్మోన్ల లోపాలు.
- దైహిక అంటురోగాలు (Systemic infections), మూత్రాశయ మార్గ సంక్రమణలు, శ్వాసకోశ సంక్రమణలు.
ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
రోగి పరిశీలనతో పాటుగా వ్యక్తి యొక్క మెడికల్ హిస్టరీ సన్నిపాతం నిర్ధారణకు చాలా ముఖ్యమైనది.
- నరాల పనితీరును అంచనా వేయడానికి వైద్యులు కొన్ని పరీక్షలు సూచించవచ్చు:
- కాగ్నిటివ్ ఫంక్షన్ పరీక్షలు (Cognitive function tests)
- అవగాహన పరీక్షలు మరియు మోటారు నైపుణ్యం పరీక్ష (Test for perception and motor skill evaluation)
- వైద్యులు రోగి ఆలోచనా శక్తిని పరిశీలించడానికి కొన్ని సాధారణ మరియు ప్రామాణిక ప్రశ్నలను అడుగవచ్చు.
- ఇతర నిర్దారణ పరీక్షలు:
- ఛాతీ ఎక్స్-రే
- ఇఇజి (EEG, ఎలక్ట్రోఎన్స్ఫలోగ్రామ్)
- సెరెబ్రోస్పైనల్ ద్రవం పరీక్ష (Cerebrospinal fluid test)
- మెదడు యొక్క ఎంఆర్ఐ (MRI) లేదా సిటి (CT) స్కాన్లు
- మూత్ర పరీక్షలు
ప్రలాపము (డెలిరియం) చిత్తవైకల్యం మాదిరి లక్షణాలనే చూపిస్తుంది. ప్రలాపము (డెలిరియం) యొక్క ఆకస్మిక సంభవం మరియు దృష్యా భ్రాంతులు అనేవి దీనిని చిత్తవైకల్యం నుండి వేరు చేయడంలో సహాయపడతాయి.ప్రలాపము (డెలిరియం) చికిత్స కోసం అంతర్లీన కారక అంశాల మీద ఆధారపడి ఉంటుంది.
- నాన్-ఫార్మకోలాజికల్ (మందులు అవసరం లేని)పద్దతులు:
- సహాయక సంరక్షణ (Supportive care): రోగికి వైద్య మరియు ఆసుపత్రి సంరక్షణను అందించాలి, రోగి యొక్క సామాజిక అవసరాలు మరియు స్థితి పై శ్రద్ద అవసరం. స్థిరమైన మరియు సుపరిచిత వాతావరణాన్ని సృష్టించడం అనేది రోగికి సహాయపడుతుంది.
- నిద్ర క్రమములను నిర్వహించాలి. నిద్రకు సంబంధించిన సమస్యలను పాలు, మర్దన, లేదా మూలికా టీ తో నివారించాలి.
- ఫిజియోథెరపీ మరియు రోజువారీ నడక మోటార్ నైపుణ్యాలను (motor skills) మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
- ఇంట్లోనే ఒక వృత్తిపరమైన నర్సుని కూడా ఉంచుకోవడం ఎల్లప్పుడూ మంచిది.
- ప్రవర్తన మార్పు చికిత్స (Behaviour modification therapy).
- మందుల చికిత్స కలిగి ఉంటుంది:
- సంక్రమణలు, నొప్పి, దీర్ఘకాలిక అనారోగ్యం, మరియు అలెర్జీ లాంటి అంతర్లీన కారకాల చికిత్సకు మందులు.
- యాంటిసైకోటిక్ (Antipsychotic) మందులు.
- అరుదుగా, తేలికపాటి మత్తు మందులను ఆందోళన మరియు విశ్రాంతి లేకుండా ఉన్నపుడు ఉపయోగించవచ్చు.