పంటి కురుపు అంటే ఏమిటి?
దంతం మధ్యలోని తొర్రలో వ్యాధి సోకిన కణజాలం జమవడం వలన ఏర్పడే కురుపు లేదా పరిస్థితినే “దంత కురుపు” అంటారు. ఇది చికిత్స చేయని దంత క్షయం, గాయం లేదా మునుపటి దంత చికిత్స కారణంగా రావచ్చు. ఇది మధ్య వయస్కులైన వారిలో కంటే యువకులు మరియు వృద్ధులైనవారిలోనే ఎక్కువగా వస్తుంటుంది.
పంటి కురుపు ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
పంటి కురుపు సంకేతాలు మరియు లక్షణాలు:
- దవడకు తాకే నిరంతరం సలిపే (పంటిపోటుతో కూడిన నొప్పి) నొప్పి
- వేడి లేదా చల్లని ఉష్ణోగ్రతలకి సున్నితత్వం
- కొరికినపుడు లేదా నమిలినపుడు కలిగే ఒత్తిడికి పంటితో సున్నితత్వం
- జ్వరం
- ముఖ వాపు
- నోటిలో అకస్మాత్తుగా దుర్వాసన, దంత కురుపు పగిలినపుడు ఉప్పగా ఉండే ద్రవంస్రావం నోటిలోకి ఉబుకుతుంది.
పంటి కురుపు ఏర్పడేందుకు ప్రధాన కారణాలు ఏమిటి?
పంటిలోని మెత్తని పదార్థంలోనికి లేదా దంతగోర్ధము (dental pulp)లోనికి సూక్ష్మజీవులు (బాక్టీరియ) చొరబడ్డంవల్ల పంటి లోపల “పంటి కురుపు” ఏర్పడుతుంది, సూక్ష్మజీవులు ఇది కలగడానికి ప్రధాన కారణం. పంటిలోని ఈ మెత్తని పదార్థంలోనే రక్తనాళాలు, నరాలు మరియు బంధన కణజాలం ఉంటాయి. ఇది దంత క్షయం కారణంగా కూడా సంభవించవచ్చు. దంతాలలోని ఒక పగులు (crack) లేదా కుహరం (cavity) ద్వారా (బాక్టీరియా) సూక్ష్మజీవులు ప్రవేశిస్థాయి మరియు దంతాల మధ్యభాగంలో ఉండే మెత్తని పదార్థాన్ని (పల్ప్) నష్టపరుస్థాయి. తద్వారా వాపు కలగడం, కురుపు ఏర్పడడం, అందులో చీము సేకరణ కావడం జరుగుతుంది. ప్రమాద కారకాలు:
- దంత సంరక్షణ సరిగా లేకపోవడం: పండ్లను సక్రమమైన పద్ధతిలో రుద్దే అలవాటు లేకపోవడం మరియు పండ్ల సందుల్లో చిక్కులుకున్న ఆహార తునకల్ని తొలగించేందుకు (flossing) అనుసరించే అలవాట్లు సరైనవి, సురక్షితమైనవి కాకపోవడం.
- అధిక చక్కెర వినియోగం: తీపిపదార్థాలు మరియు సోడాల వంటి చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాల్ని మరియు పానీయాలను తీసుకోవడం వల్ల.
పంటి కురుపును ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
పంటి కురుపు నిర్ధారణకు, దంతవైద్యుడు తనవద్ద ఉండే ఓ సాధనంతో సమస్య కల్గిన పంటిపై సున్నితంగా బాది, దంతం తాకిడికి ఒత్తిడికి సున్నితత్వాన్ని ప్రదర్శిస్తుందా లేదా అని తనిఖీ చేస్తారు. ఇతర పరీక్షలు:
-
డెంటల్ ఎక్స్-రే చీముతో కూడిన దంత కురుపును కనుక్కోవడానికి మరియు ఆ సంక్రమణ పంటిలో ఎంతవరకూ వ్యాప్తి చెందింది అనేవిషయం వైద్యుడు తెలుసుకునేందుకు సహాయపడవచ్చు.
-
CT స్కాన్ కూడా ఆదేశించబడవచ్చు.
ఈ పంటి కురుపు సంక్రమణ పురోగతిని ఆపడానికి వెంటనే చికిత్స తీసుకోవాలని సలహా ఇవ్వటం జరుగుతుంది. ఆ చికిత్సా పద్ధతులు ఇలా ఉన్నాయి:
- పంటి కురుపును గాయం చేసి కురుపులోని ద్రవాన్ని స్రవింపజేసి తీసేయడం
- దంతానికి రూట్ కెనాల్ చికిత్స
- పన్ను పీకేయించడం
- యాంటిబయాటిక్స్
స్వీయ రక్షణ చిట్కాలు:
- భోజనం తర్వాత వెచ్చని ఉప్పు నీటితో మీ నోటిని బాగా పుక్కిలించి శుభ్రం చేసుకోండి, తద్వారా ఎటువంటి ఆహారం కణాలు నోటిలో ఉండపోవు.
- నొప్పినివారిణులు (pain killers) తీసుకోవచ్చు.
- ఫ్లోరిన్ తో కూడిన టూత్ పేస్టుతో మీ పళ్ళను రోజులో కనీసం రెండు సార్లు బ్రష్ చేయండి.
- ప్రతి 3 లేక 4 నెలలకొకసారి మీ పండ్ల బ్రష్ ను మార్చండి.
- ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంవల్ల పంటి సంక్రమణను మరియు నోటిదుర్వాసన కలిగే అవకాశాలను తగ్గిస్తుంది.
- క్రిమినాశకకారి అయిన ద్రవరూపం మౌత్వాష్ లేదా ఫ్లోరైన్ తో కూడిన మౌత్ వాష్ను ఉపయోగించవచ్చు.