చెవి నుండి స్రావాలు కారడం లేదా చెవిలో ఉత్సర్గ అంటే ఏమిటి?
చెవి నుండి స్రావం లేదా ద్రవం కారడం (డిచ్ఛార్జ్) అనేది ఒక చెవి సంక్రమణం. చెవిలోంచి చీముకారడం అనే రుగ్మత చెవిలో మంట లేదా వాపు , వెలుపలి చెవికి లేదా మధ్య చెవికి గాయం కావడం, అరుదుగా సంభవించే చెవి క్యాన్సర్ వంటి అనేక పరిస్థితులకు సంబంధించిన ఒక వ్యాధి లక్షణం. “చెవిలో చీముకారడం” అని పిలువబడే ఈ రుగ్మతను ఆంగ్లంలో ఒటోరియా (otorrhoea) అని పిలుస్తారు. ఈ రుగ్మత ఓ తీవ్రమైన లేదా దీర్ఘకాలిక వ్యాధి పరిస్థితిగా ఉంటుంది. చెవి నుండి కారే చీము లేదా ఉత్సర్గ చాలా అసహ్యకరమైనదిగా ఉంటుంది మరియు ఏ వయస్సువారికైనా ఇది రావచ్చు, కానీ ప్రధానంగా పిల్లలలో ఈ రుగ్మతను చూడవచ్చు. చెవి నుండి కారే ద్రవం (ఉత్సర్గ) చీము , శ్లేష్మం, మైనపురూపంలో ఉండే ద్రవం, లేదా రక్తం రూపంలోనూ ఉంటుంది.
ప్రధాన సంబంధ సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
చెవి నుండి స్రావాలు కారడానికి అత్యంత సాధారణ కారణం బాహ్య చెవి లేదా మధ్య చెవి సంక్రమణకు గురి కావడం మరియు వాపు కల్గడం. మీకు గనుక చెవి నుండి ఉత్సర్గ (చెవిలోంచి చీముకారడం) రుగ్మత కలిగి ఉంటే క్రింది సంకేతాలు ఉండవచ్చు:
- చెవిలో నొప్పి
- చెవి నుండి దుర్వాసనతో కూడిన ద్రవం (చీము) కారడం
- సంతులనం యొక్క నష్టం
- మంట (చికాకు)
- నిద్ర కోల్పోవడం
- చెవి పోటు
- జ్వరం
చెవి నుండి స్రావాలు కారడం రుగ్మతకు ప్రధాన కారణాలు ఏమిటి?
చెవిలోంచి చీముకారడం (చెవి ఉత్సర్గ) అనేది ఒక సాధారణ వ్యాధి లక్షణం మరియు చాలా తక్కువ వయస్సు గల పిల్లలలో వస్తుంటుంది. అంటే 5 సంవత్సరాల లోపు వయస్సు గల పిల్లలలో తక్కువగా అభివృద్ధి చెందిన యుస్టాచాన్ ట్యూబ్ (Eustachian tube) మరియు తక్కువ రోగనిరోధకత కారణంగా చెవిలో చీము కారడమనేది వస్తుంది. ఇది పెద్దలలో కూడా సంభవించవచ్చు. ఒక వ్యక్తి చెవి నుండి అసహ్యకరమైన చీము కారడమనే రుగ్మతను అనుభవిస్తున్నట్లైతే అది కింది కారణాలవల్ల కలుగుతుంది.
- మధ్య చెవి (ఓటిటిస్ మీడియా) యొక్క సంక్రమణ
- బాహ్య చెవి యొక్క సంక్రమణ వ్యాధి (otitis externa)
- చెవి యొక్క వాపు లేదా మంట
- జలుబు
- కణత ఎముక (temporal bone) కు గాయం
- చెవి నియోప్లాజమ్ (అరుదుగా నివేదించబడింది)
- చెవికి శస్త్రచికిత్స తరువాత కలిగే ప్రభావం
చెవిలోంచి చీముకారడం రుగ్మతను ఎలా నిర్ధారిస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
మీకు గనుక చెవిలోంచి చీము స్రావము కారే సమస్య ఉంటే ఈ రుగ్మతకు సంపూర్ణ రోగ నిర్ధారణ చాలా అవసరం. ఏదేమైనా, ఈ రుగ్మతకు ఏదైనా పరీక్షనిర్వహించే ముందు సూక్ష్మదర్శిని ని ఉపయోగించి చెవిలోంచి కారే చీమును తీసివేయాలి. రోగ నిర్ధారణ యొక్క మొదటి అంశం ఏంటంటే చెవి, ముక్కు, గొంతు (ENT) నిపుణుడు చేత రోగి చరిత్రను సేకరించి తీసుకోవడం, మరియు మరింత నిర్ధారణను కిందివాటి ఆధారంగా తయారు చేయవచ్చు
- చెవి పరీక్ష
- గాలికి సంబంధించిన ఓటోస్కోపీ పరీక్ష
- మధ్య చెవి పనితీరును పరీక్షించే టింపనోమెట్రీ (Tympanometry)
- వినికిడి పరీక్ష
- రోగనిరోధక శక్తి కారణం ఉంటే రక్త పరీక్ష
- వ్యాధికారకాన్ని కనుగొనేందుకు చెవిలోంచి కారే చీము లేదా ద్రవం యొక్క విశ్లేషణ లేదా చెవి నమూనా సాగు పరీక్ష (ear swabs culture).
సరైన నిర్ధారణ జరిగిన తర్వాత చెవిలోంచి చీము కారడానికి చికిత్స నిర్ణయించబడుతుంది. ఒక యాంటీబయోటిక్ సూక్ష్మగ్రాహ్యత పరీక్ష ఫలితం పొందిన తర్వాత, మందులు ఖరారు చేయవచ్చు. ఈ చికిత్స క్రింది వాటితో కూడుకుని ఉంటుంది:
- నొప్పిని నియంత్రించడానికి అనాల్జెసిక్స్
- పైపూత స్టెరాయిడ్స్
- యాంటిబయోటిక్ చెవి చుక్కల మందులు
- చెవిలోంచి ఉత్సర్గ మైనంలా ఉంటే ముకులిటిక్ చుక్కలు (Mucolytic drops)
- ఓరల్ యాంటీబయాటిక్స్
- సంక్రమణ శిలీంధ్రం కారణంగా అయినట్లయితే చెవి శుభ్రం చేయడానికి యాంటీ ఫంగల్ సూత్రీకరణలు (Antifungal formulations)
- జ్వరాన్ని నియంత్రించడానికి యాంటిపైరెటిక్స్
చికిత్సతో పాటుగా, కొన్ని స్వీయ-రక్షణ చర్యలైన జలుబుతో కూడిన చెవి ఇన్ఫెక్షన్ల నుండి శిశువులు మరియు పిల్లలను పొగకు బహిర్గతం కాకుండా రక్షించడం వంటివి చెవిలోంచి చీము కారడమనే రుగ్మతను నిరోధించడంలో సహాయపడుతుంది.
బాధాకరమైన చెవిలోంచి చీము కారడం అనే రుగ్మతకు చికిత్స అవసరం. అంటే కాదు, చికిత్స చేయకపోతే కొన్ని సందర్భాల్లో బలహీనమైన వినికిడి సమస్యకు కూడా దారితీస్తుంది. చెవిలోంచి చీము కారడమనే రుగ్మతకు, మాలిగ్నెన్సీ అనే ప్రాణాంతక చెవి కేన్సర్‌వ్యాధికి సంబంధం కలిగి ఉండే అరుదైన కారణం కావచ్చు. కాబట్టి చెవిలోంచి చీము కారడమనే రుగ్మత నిర్వహణకు సరైన రోగ నిర్ధారణ మరియు చికిత్స అవసరమవుతుంది.