చెవి నొప్పి ఏమిటి?
చెవి నొప్పిని, చెవిపోటు అని కూడా పిలుస్తారు, వివిధ ఆరోగ్య పరిస్థితులకు ఇది ఒక సాధారణ లక్షణం. ఇది ఏ వయస్సు వారినైనా ప్రభావితం చేయవచ్చు. చాలా సందర్భాలలో నొప్పి ఒక పెద్ద సమస్యగా పరిగణింపబడదు , కానీ తీవ్రమైన నొప్పి ఉంటే దానిని పరిశోధించాలి.
దాని ప్రధాన సంబంధిత సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
తరచూ చెవి నొప్పి ఇతర సాధారణ సంకేతాలు మరియు లక్షణాలతో కలిసి ఉంటుంది మరియు అది స్వయంగా కొన్ని వ్యాధుల యొక్క సంకేతం/లక్షణం. చెవి నొప్పి మొండిగా లేదా చిన్నగా లేదా తీవ్రమైన లేదా పదునుగా ఉండవచ్చు. చెవి నొప్పితో పాటు ఉండే కొన్ని సాధారణ లక్షణాలు:
- చెవిలో అడ్డంకులు
- చెదిరిన వినికిడి
- సంతులనం చేసుకోవడంలో సమస్యలు (Problems in balancing)
- అసౌకర్యం కారణంగా, వ్యక్తికి నిద్ర సమస్యలు కూడా ఉండవచ్చు
- చాలా అసాధారణం ఐనప్పటికీ, పిల్లలు వారి చెవి నుండి ద్రవం బయటకు వస్తున్నట్లు ఫిర్యాదు చేయవచ్చు
- జ్వరం
- దగ్గు మరియు జలుబు
దాని ప్రధాన కారణాలు ఏమిటి?
చాలా సందర్భాల్లో, చెవి నొప్పి సంక్రమణ లేదా గాయం కారణంగా సంభవిస్తుంది. సంక్రమణ చెవి మార్గంలో (దానిని ఓటైటిస్ ఎక్సటర్న అని కూడా పిలుస్తారు) లేదా మధ్య చెవిలో (దానిని ఓటైటిస్ మీడియా అని కూడా పిలుస్తారు) ఉంటుంది.
సాధారణంగా, చెవి నొప్పి ఈ క్రింది కారణాల వలన సంభవించవచ్చు:
- గాలి పీడనంలో మార్పులు (ముఖ్యంగా విమాన ప్రయాణ సమయంలో)
- చెవులు కోసం అధికంగా ఇయర్ బడ్ల (ear buds) వినియోగం
- చెవిలో గులిమి/గుబిలి ఏర్పడడం
- చెవిలో షాంపూ లేదా నీటిని ఇరుకున్నపుడు
చెవి నొప్పి, అరుదుగా వీటి వలన కూడా కలుగుతుంది:
- టెంపోరోమాండిబ్యులర్ జాయింట్ (TMJ, Temporomandibular joint ) సిండ్రోమ్
- పంటి క్లిప్పులు
- కర్ణభేరి లోపాలు (చిల్లుల వంటివి)
ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
మీరు పైన పేర్కొన్న లక్షణాలలో వ్యక్తి కొన్నింటిని అనుభవించినట్లయితే, వారు తప్పనిసరిగా వైద్యుణ్ణి సంప్రదించాలి. ప్రభావవంతమైన నిర్ధారణ కోసం, వైద్యులు భౌతిక పరిశీలన చేస్తారు.
సమస్య బ్యాక్టీరియా లేదా వైరల్ సంక్రమణ వలన సంభవించిందా అని నిర్ధారించడానికి, వైద్యుడు చెవి నుండి కొంత ద్రవాన్ని తీసి పరీక్షించవచ్చు.
సంక్రమణం లేదా నొప్పి తీవ్రతను బట్టి, చెవి నొప్పిని తగ్గించడానికి వైద్యుడు వివిధ జాగ్రత్తలను సూచిస్తారు. వాటిలో కొన్ని:
- స్థిరమైన బలహీనపరిచే నొప్పిని అధిగమించడానికి ఓవర్ ది కౌంటర్ నొప్పి నివారణల ఉపయోగం.
- వేడి నీటి కాపడం లేదా హీట్ థెరపీని ప్రయత్నించమని సూచించబడవచ్చు. వెచ్చని నీటిలో చిన్న బట్టను/గుడ్డను ముంచి ప్రభావిత చెవిని మెత్తగా అద్దాలి.
- తీవ్రమైన సంక్రమణ మరియు ద్రవం స్రవిస్తున్న సందర్భంలో, చెవి చుక్కలు (ఇయర్ డ్రాప్స్) తీసుకోవాలని సూచించబడవచ్చు.
- గాలి పీడన అసమతుల్యతల విషయంలో, కేవలం చూయింగ్ గమ్ నమలడం ప్రయత్నించమని సూచించవచ్చు. ఇది గాలి పీడనాన్ని నివారిస్తుంది మరియు నొప్పిని తగ్గిస్తుంది.