గర్భాశయ క్యాన్సర్ (ఎండోమెట్రియల్ క్యాన్సర్) అంటే ఏమిటి?
గర్భాశయం దాని లోపల ఎండోమెట్రియం అని పిలువబడే ఒక అంతర్గత పొరను కలిగి ఉంటుంది. ఎండోమెట్రియం యొక్క కణాలు ఒక నియంత్రణ లేకుండా పెరిగిపోతుంటే, అది గర్భాశయ క్యాన్సర్/ఎండోమెట్రియల్ క్యాన్సర్ కు దారితీస్తుంది. సాధారణంగా, ఇది ఎండోమెట్రియల్ హైపర్ప్లాసియా వలె మొదలయ్యి చివరికి క్యాన్సర్ గా మారుతుంది.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
గర్భాశయ/ఎండోమెట్రియల్ క్యాన్సర్ యొక్క లక్షణాలు ప్రారంభంలో కేవలం గర్భాశయ ప్రాంతానికి మాత్రమే పరిమితమై ఉంటాయి క్రమంగా వేరే ప్రాంతాలకి వ్యాప్తి చెందుతాయి లేదా సాధారణీకృతమైన లక్షణాలను చూపిస్తాయి, అవి:
- అసాధారణ యోని రక్తస్రావం, అధిక రక్తస్రావం లేదా ఋతుచక్రాల మధ్యలో ఉంటుంది
- మెనోపాజ్ (రుతువిరతి) తర్వాత కూడా యోని రక్తస్రావం
- పెల్విక్ నొప్పి
- సంభోగ సమయములో నొప్పి కలుగుట (Dyspareunia)
- అసాధారణ యోని స్రావాలు (రక్తపు మరకలు, పసుపుపచ్చ స్రావాలు)
- బరువు తగ్గుదల
- అలసట
- ఆకలి తగ్గుదల
దాని ప్రధాన కారణాలు ఏమిటి?
ఎండోమెట్రియం అండాశయ హార్మోన్లకు, ముఖ్యంగా ఈస్ట్రోజెన్ (oestrogen)కు చాలా సున్నితంగా ఉంటుంది; అయితే, ఎండోమెట్రియాల్ క్యాన్సర్ యొక్క ఖచ్చితమైన కారణం ఇంకా తెలియలేదు. ఒక స్త్రీకి ఎండోమెట్రియాల్ క్యాన్సర్ను కలిగించే ప్రమాద కారకాలు ఉన్నాయి. వీటిలో కొన్ని ఈ క్రింది విధంగా ఉంటాయి:
- కుటుంబ చరిత్ర (ఎండోమెట్రియల్ క్యాన్సర్ లేదా గర్భాశయ ఫైబ్రాయిడ్లు ఉండి ఉన్న తల్లి లేదా సోదరి)
- త్వరగా రజస్వల కావడం
- వంధ్యత్వం
- ఊబకాయం
- హార్మోన్ ప్రత్యామ్నాయం చికిత్స (HRT) ను దీర్ఘకాలం పాటు వాడడం
- రొమ్ము క్యాన్సర్ మందులు (టామోక్సిఫెన్,tamoxifen)
ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
పూర్తి ఆరోగ్య చరిత్రతో కూడిన వైద్య పరీక్ష సాధారణంగా ఎండోమెట్రియాల్/గర్భాశయ క్యాన్సర్ను నిర్ధారిస్తుంది. అంతేకాకుండా, క్యాన్సర్ యొక్క తీవ్రతను పరిశీలించడానికి పరిశోధనలు అవసరం
- పెల్విక్ అల్ట్రాసౌండ్ (Pelvic Ultrasound) - ఎండోమెట్రియం యొక్క మందం తెలుకోవడానికి
- ట్రాన్స్వాజినల్ అల్ట్రాసౌండ్ (Transvaginal Ultrasound) - ఎండోమెట్రియంలో మార్పులను ఖచ్చితంగా అంచనా వేయడానికి
- హిస్టెరోస్కోపీ (Hysteroscopy) - ఎండోస్కోప్ ను ఉపయోగించి ఎండోమెట్రిమ్ను పరిశీలించడానికి, గర్భాశయం యొక్క అంతర్గత పొరలలోని అసమానతలను సూచిస్తుంది
- ఎండోమెట్రియాల్ బయాప్సీ (Endometrial Biopsy) - ఎండోమెట్రియాల్ క్యాన్సర్ యొక్క రకాన్ని నిర్దారించడానికి కొన్ని సూక్ష్మ కణజాల నమూనాలను మైక్రోస్కోప్ ద్వారా పరిశీలించిన చేస్తారు
- పెల్విక్ సిటి స్కాన్ (Pelvic CT Scan) - ఎండోమెట్రియాల్ క్యాన్సర్ దశను తెలుసుకోవడంలో సహాయపడుతుంది
- పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ / సిటి స్కాన్ (Positron emission tomography/CT scan) - ఎండోమెట్రియల్ కణాల యొక్క వ్యాప్తిని అంచనా వేయడానికి
ముందుగానే గర్భాశయ క్యాన్సర్ గుర్తించినట్లయితే, సరైన చికిత్సతో నయం చేయవచ్చు. ఎండోమెట్రియాల్ క్యాన్సర్ కోసం చికిత్సా విధానాలు:
- శస్త్రచికిత్స - ఇది చికిత్స యొక్క మొదటి మార్గం. ప్రారంభ దశలోనే గుర్తించినట్లయితే, గర్భాశయం, అండాశయాలు మరియు ఫెలోపియన్ నాళాలు కూడా తొలగించబడతాయి
- రేడియేషన్ థెరపీ (Radiation Therapy) - ప్రొటాన్ కిరణాలు ఉపయోగించి క్యాన్సర్ కణాలను చంపుతారు. కణితులు పెద్ద పరిమాణంలో ఉన్నపుడు, రేడియేషన్ ఉపయోగించి కణితిని తగ్గించేలా చేసి తరువాత శస్త్రచికిత్స నిర్వహిస్తారు
- హార్మోన్ థెరపీ (Hormone Therapy) - నోటి ద్వారా తీసుకునే హార్మోన్ మాత్రలు ఇవ్వబడతాయి, ఇవి ప్రొజెస్టెరాన్ స్థాయిలను పెంచుతాయి లేదా ఈస్ట్రోజెన్ స్థాయిలను అణిచివేస్తాయి, తద్వారా కణితి కణాలను తగ్గిస్తాయి
- కెమోథెరపీ - నోటి ద్వారా తీసుకునే లేదా ఇంట్రావీనస్ (నరాలలోకి ఎక్కించే) కెమోథెరపీ ఏజెంట్లు క్యాన్సర్ కణాలను చంపడానికి ఉపయోగిస్తారు. కెమోథెరపీ మందులు కూడా కణితిని తగ్గించి, మరియు శస్త్రచికిత్స చేసి కణితిని తొలగించడానికి అనుకూలంగా చేస్తాయి