ఎండోమెట్రియోసిస్ అంటే ఏమిటి?
ఎండోమెట్రియం, అనేది గర్భాశయం యొక్క లోపలి పొర, రుతుస్రావం సమయంలో రక్తస్రావం ద్వారా బయటకు వచ్చేస్తుంది. ఈ పొర అండాశయ హార్మోన్లు అయిన ఈస్ట్రోజెన్ మరియు ప్రొజెస్టెరాన్ కు సున్నితంగా ఉంటుంది. ఎండోమెట్రియాల్ పొర యొక్క కణజాలం గర్భాశయంలో కాకుండా ఫెలోపియన్ గొట్టాలు, అండాశయాలు, లేదా కొన్ని వేరే అవయవాలలో, పెరుగినప్పుడు ఎండోమెట్రియోసిస్ సంభవిస్తుంది. ఇది ఒక బాధాకరమైన పరిస్థితి మరియు అప్పుడప్పుడు గర్భాశయ అవయవాలు అతుక్కుపోవడానికి కారణమవుతుంది.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
ఎండోమెట్రియోసిస్ యొక్క లక్షణాలు కొంతవరకు ఎండోమెట్రియాల్ కణజాలం పెరిగే ప్రాంతం మీద ఆధారపడి ఉంటాయి. ఎండోమెట్రియోసిస్ యొక్క కొన్ని సాధారణ లక్షణాలు ఉన్నాయి
- ఋతుక్రమ సమయంలో కడుపు లేదా పొత్తి కడుపు భాగంలో తీవ్రమైన నొప్పి (డిస్మెనేరియా)
- డైస్పారునియా (సంభోగం సమయంలో నొప్పి)
- ఋతుక్రమ సమయంలో అసాధారణమైన అధికమైన (మనోరేజియా) లేదా దీర్ఘకాలికమైన (మెటరాజియా) రక్తస్రావం
- వంధ్యత్వం
- బాధాకరమైన మూత్రవిసర్జన మరియు మలవిసర్జన
- అలసట (ముఖ్యంగా ఋతుస్రావ సమయంలో)
దాని ప్రధాన కారణాలు ఏమిటి?
అండాశయము, ఫెలోపియన్ నాళాలు, లేదా ఇతర కటి అవయవాలలో ఎండోమెట్రియాల్ కణజాలం అనుకోకుండా పొరపాటైనప్పుడు అది ఎండోమెట్రియోసిస్లో సంభవించవచ్చు. ఇది అనేక కారణాల వలన సంభవించవచ్చు:
- విరుద్ధమైన రుతుస్రావం (Retrograde Menstruation) - ఋతు రక్తము ఫెలోపియన్ గొట్టాలు లేదా అండాశయాలు లోకి వెనక్కి తిరిగి (రివర్స్ డైరెక్షన్) ప్రవహించినప్పుడు, ఎండోమెట్రియాల్ కణాలు ఫాలోపియన్ గొట్టాలు లేదా అండాశయాలలో అమిరిపోవచ్చు
- సర్జికల్ ఇంప్లాంటేషన్ (Surgical Implantation) - సిజేరియన్ డెలివరీలు (శస్త్ర చికిత్స చేసి బిడ్డను బయటకు తీసినప్పుడు) లేదా హిస్టెరోస్కోపీ (hysteroscopy) సమయంలో, ఎండోమెట్రియల్ కణజాలం గర్భాశయ అవయవాలలో అమర్చబడుతుంది
- పెరిటోనియల్ సెల్ ట్రాన్స్ఫర్మేషన్ (Peritoneal Cell Transformation) - కొన్ని రోగనిరోధక శక్తి లో సమస్యలు లేదా హార్మోన్లు కారణంగా, పెరిటోనియల్ కణాలు ఎండోమెట్రియల్ కణజాలంగా రూపాంతరం చెందుతాయి
- ఎండోమెట్రియల్ సెల్ ట్రాన్స్పోర్టేషన్ (Endometrial Cell Transportation) - ఎండోమెట్రియల్ కణాలు రక్తం లేదా లింఫ్ (lymph) ద్వారా ఇతర అవయవాలలోకి చేరుకుంటాయి
- ఎంబ్రియోనిక్ సెల్ ట్రాన్స్ఫర్మేషన్ (Embryonic Cell Transformation) - రజస్వల సమయంలో, ఈస్ట్రోజెన్ కారణంగా, ఎంబ్రియోనిక్ కణాలు ఎండోమెట్రియల్ కణాలుగా మారతాయి.
ఎలా నిర్ధారిస్తారు మరియు చికిత్స ఏమిటి?
సరైన శారీరక పరీక్షతో పాటుగా (పెల్విక్ పరీక్షలతో సహా) పూర్తి ఆరోగ్య చరిత్ర సాధారణంగా ఎండోమెట్రియోసిస్ నిర్ధారణకు సహాయపడుతుంది. అయినప్పటికీ, రోగ నిర్ధారణను ద్రువీకరించడానికి మరియు వ్యాప్తి యొక్క తీవ్రతను తనిఖీ చేయడానికి కొన్ని పరీక్షలు నిర్వహించబడతాయి:
- పెల్విస్ యొక్క అల్ట్రాసౌండ్ - ఎండోమెట్రియల్ కణజాలం ఏ ఇతర గర్భాశయ అవయవాలకు చేరిందని తెలుపుతుంది
- ట్రాన్స్ వెజైనల్ ఆల్ట్రాసౌండ్ (Transvaginal Ultrasound) - పెల్విక్ అవయవాలలో ఎండోమెట్రియల్ కణజాలం కోసం పరిశీలించడంలో మరింత ఖచ్చితమైనది
- లాపరోస్కోపీ (Laparoscopy) - ఎండోమెట్రిక్ కణజాలం యొక్క ఎండోస్కోపిక్ పరిశీలన అలాగే జీవాణుపరీక్ష (బయాప్సీ) తో రోగ నిర్ధారణను ద్రువీకరించడానికి సహాయపడుతుంది
- మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ (MRI, Magnetic Resonance Imaging) - ఎండోమెట్రియల్ కణజాలం నాటుకున్న (అతుకున్న) స్థానాన్ని గుర్తించడానికి సహాయపడుతుంది మరియు దాని పరిమాణాన్ని కూడా తనిఖీ చేస్తుంది
ఎండోమెట్రియోసిస్ చికిత్స పద్ధతులు:
- నోటి ద్వారా తీసుకునే మందుల - డిస్మెనోరియాను తగ్గించడానికి నొప్పి నివరుణులు (Painkillers)
- హార్మోన్ థెరపీ - నొప్పిని తగ్గించడానికి, ఋతుచక్రాలను క్రమబద్ధీకరించడానికి, రక్తస్రావాన్ని తగ్గించడానికి ఉపయోగిస్తారు
- శస్త్రచికిత్స (కన్జర్వేటివ్ థెరపీ) - నాటుకున్న కణజాలాన్ని (ఇంప్లాంట్స్) లేదా మారిపోయిన ఎండోమెట్రియల్ కణజాలాన్ని శస్త్రచికిత్స ద్వారా తొలగిస్తారు. తీవ్రమైన సందర్భాల్లో, ఫెలోపియన్ నాళాలు, అండాశయాలతో పాటు గర్భాశయం కూడా తొలగించబడుతుంది (హిస్టిరెక్టమీ)