కంటి అలెర్జీలు అంటే ఏమిటి?
అలెర్జీ వల్ల కళ్ళలో వాపు మరియు ఎరుపుదనం ఏర్పడుతుంది, కళ్ళలో దుమ్ము, పుప్పొడి, బూజు, మొదలైన అలెర్జీకి కారణమయ్యే పదార్ధాలు పడినప్పుడు అది సంభవిస్తుంది. వీటిని అలెర్జెన్లు (allergens) అని అంటారు. కంటి అలెర్జీలు ఆస్త్మా, గవత జ్వరం, చర్మ అలెర్జీ సమస్యలు (తామర మొదలైనవి) వంటి వాటితో కూడా ముడిపడి ఉంటాయి. సాధారణంగా పిల్లలు మరియు యుక్తవయసుల వారిలో కంటి అలెర్జీలు సంభవిస్తాయి.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
అలెర్జీ కారకాలకు (అలెర్జెన్లు) ప్రతిస్పందనగా శరీరంలోని రక్తంలో హిస్టామిన్ అని పిలవబడే ఒక రసాయనం విడుదల కారణంగా కంటి అలెర్జీలు సంభవిస్తాయి. ఈ లక్షణాలు దీర్ఘకాలం పాటు ఉండవచ్చు లేదా వాతావరణంలోని మార్పులతో పునరావృతమవవచ్చు, కాని ఇవి ఒకరి నుంచి ఇంకొకరికి సంక్రమించవు.
- కళ్ళలో అధికమైన దురద
- కళ్ళలో ఎరుపుదనం (మరింత సమాచారం: కళ్ళ ఎరుపుదనానికి చికిత్స)
- కళ్ళలో నీళ్లు ఉండడం మరియు మంటగా అనిపించడం .
- ప్రకాశవంతమైన వెలుతురుకి సున్నితంగా ఉండడం లేదా అసహనం.
- శ్వాస అలెర్జీలతో ముడి పడిఉన్నపుడు, మూసుకుపోయిన లేదా నీరు కారే ముక్కు, తుమ్ములు, తలనొప్పి, దగ్గు మొదలైనవి ఉంటాయి.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
అలెర్జిన్స్ (అలెర్జీ కారకాలకు) కు కళ్ళు బహిర్గతం అయినప్పుడు ఆ అలెర్జీలను వదిలించుకునే క్రమంలో రోగనిరోధక ప్రతిచర్యకు (immune reaction) దారితీస్తుంది. వివిధ రకాల అలెర్జిన్స్ (అలెర్జీ కారకాలు) :
- దుమ్ము
- పుప్పొడి
- వాయు కాలుష్యం, పొగ మొదలైనవి
- పెంపుడు జంతువుల బొచ్చు, దండెర్ (ఈకల, వెంట్రుకల దూళి), మొదలైనవి
- ఫంగస్ లేదా బూజు
- బలమైన వాసనలు ఉండే సుగంధద్రవ్యలు, పెయింట్లు, మొదలైనవి
- ఆహార సంరక్షకాలు (preservatives)
- పురుగుల కాట్లు
- అరుదైన సందర్భాల్లో, ప్రత్యేకించి పిల్లలలో వెర్నల్ కంజుక్టివైటిస్ (vernal conjunctivitis) అనే తీవ్రమైన కంటి అలెర్జీ వలన దృష్టి కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది.
కంటి అలెర్జీల నిర్ధారణ మరియు చికిత్స ఏమిటి?
ఈ కింది ప్రమాణాల (పారామీటర్స్) ఆధారంగా వైద్యులు కంటి అలెర్జీలను నిర్ధారిస్తారు
- లక్షణాల చరిత్ర
- స్లిట్ లాంప్ ఉపయోగించి కళ్ళను పరీక్షించడం
- రక్తంలో IgE స్థాయిలుచూడడం
- చర్మ అలెర్జీ పరీక్ష (Allergy skin test)
- కళ్ళ స్రావాలలోని తెల్ల రక్త కణాలను గుర్తించడానికి సూక్ష్మదర్శిని (మైక్రోస్కోప్) తో కళ్ళ స్రావాల పరిశీలన
కంటి అలెర్జీల చికిత్స వీటిని కలిగి ఉంటుంది:
- స్వీయ సంరక్షణ చర్యలు
- అలెర్జీ కారకానికి బహిర్గతం కాకుండా ఉండాలి.
- కళ్ళు రుద్దడం మానాలి.
- కంటి ఎర్రగా మరియు దురద ఉన్నప్పుడు కాంటాక్ట్ లెన్స్ ఉపయోగించడం మానుకోవాలి.
- గాలి వాతావరణం ఉన్నపుడు పుప్పొడి కళ్ళలోకి వెళ్లకుండా ఉండడానికి సన్ గ్లాసెస్ (కాళ్ళ జోడును) ఉపయోగించాలి.
- ఇంటి లోపల తేమ ఫంగస్ యొక్క పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఇంటిలో తేమ లేకుండా నివారించాలి.
- కాలుష్యం, ధూళి, పొగ మొదలైన వాటికి దూరంగా ఉండాలి.
- పురుగులు కారణంగా వచ్చే కంటి అలెర్జీలను నివారించడానికి క్రమం తప్పకుండా మంచాలను శుభ్రం చేయాలి.
- పెంపుడు జంతువులను అధికంగా తాకడం మానుకోవాలి.
- అలెర్జీ ప్రతిచర్యలు ప్రారంభమైన వెంటనే అలెర్జీ కారని తొలగించడానికి కళ్ళు కడగాలి.
- కంటి అలర్జీకి చికిత్సకు వైద్యులు సూచించే సంబంధించిన మందులు
- మాత్రలు మరియు కంటి చుక్కల (eye drops) రూపంలో యాంటీ-హిస్టామైన్లు ఇవ్వడం అవి దురద మరియు చిరాకు తగ్గించడంలో సహాయం చేస్తాయి
- కంటి అలెర్జీలలో వాపును ఆపడానికి మాస్ట్ సెల్ స్టెబిలైజర్ (mast cell stabilizer) మందులు ఉపయోగిస్తారు.
- కంటిలో ఎరుపు మరియు వాపును తగ్గించడానికి డికాంగిస్టెంట్ (Decongestant) కంటి చుక్కలు సహాయం చేస్తాయి.
- కృత్రిమ కన్నీళ్ల (Artificial tears, కంటి సమస్యను తగ్గించడానికి వాడే ఒక రకమైన నూనె పదార్దాలు, అవి కళ్ళలో వేసుకున్నప్పుడు కన్నీళ్లు వస్తాయి) కంటి చుక్కలు కంటి తేమను నిర్వహించడానికి సహాయపడతాయి మరియు కళ్ళు నుండి అలెర్జిన్స్ ను బయటకు తుడిచివేస్తాయి.
- కార్టికోస్టెరాయిడ్ కంటి చుక్కలు (eye drops) తీవ్రమైన వాపును నియంత్రించడంలో సహాయపడతాయి.
- ఇమ్యునోథెరపీ ఇంజెక్షన్లు (సూది మందులు) అలెర్జీ కారకం మరియు తిరిగి మళ్ళి సంభవించే కంటి అలెర్జీలను నివారించేదుకు రోగనిరోధకత శక్తిని పెంపొందించడంలో సహాయం చేస్తాయి.