కంటి నుండి స్రావాలు కారడం అంటే ఏమిటి?
మన కళ్ళు సంరక్షణ మరియు సహజ పనితీరు కోసం నిరంతరం కొంచెం కొంచెంగా శ్లేష్మాన్ని (mucus) ఉత్పత్తి చేస్తాయి. ప్రతి సారి కళ్ళ రెప్పలు పడినప్పుడు ఈ శ్లేష్మం చిన్న సన్నని కన్నీటి దార వాలే బయటకు వచ్చేస్తుంది. వ్యక్తి, నిద్రలో ఉన్నపుడు రెప్పలు వేయడు కాబట్టి ఈ శ్లేష్మం కనురెప్ప వెంట్రుకలతో పాటు కళ్ళ మూలలో పోగవుతుంది మరియు చిన్న పెచ్చు లా మారుతుంది. కొన్నిసార్లు ఇది అసహ్యకరముగా ఉన్నప్పటికీ, చిన్న మొత్తంలో కంటి నుండి స్రావాలు కారడం (స్పష్టముగా లేదా తెల్లగా ఉంటుంది) అనేది సర్వసాధారణం. అయితే, అధిక ఉత్పత్తి లేదా రంగుమారిన (ఆకుపచ్చ లేదా పసుపు) కంటి స్రావాలను అసాధారణంగా పరిగణిస్తారు.
దాని ప్రధాన సంబంధిత సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
కంటి స్రావాలకు సంబంధించిన సంకేతాలు మరియు లక్షణాలు:
- కళ్ళు నుండి చీము లేదా స్రావం(ఇది పసుపు లేదా ఆకుపచ్చగా ఉంటుంది)
- కనురెప్పలు మరియు కనురెప్పవెంట్రుకలు మీద ఎండిన చీము కనిపిస్తుంది
- నిద్ర లేచినప్పుడు, వ్యక్తి అంటుకుపోయిన కనురెప్పవెంట్రుకలను కలిగి ఉండవచ్చు
- కంటి తెల్లటి భాగం ఎర్రని లేదా గులాబీ రంగులోకి మారడం (ఇది ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు) (మరింత సమాచారం: ఎర్రని కళ్ళ కారణాలు)
- సాధారణంగా కనురెప్పలు ఉబ్బినట్లు కనపడతాయి
తీవ్ర సందర్భాల్లో, క్రింది ఉన్న ఆందోళనకరమైన లక్షణాలు కనిపించవచ్చు:
- 104 ° F కంటే ఎక్కువ జ్వరం
- కంటిలో తీవ్ర నొప్పి, ఎరుపు లేదా వాపుతో కూడిన కనురెప్పలు
- కంటి చూపులో అస్పష్టత (మరింత సమాచారం: అస్పష్టమైన కంటి చూపు చికిత్స)
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
కంటి స్రావాలకు ప్రధాన కారణాలు:
- సాధారణ స్రావం. కంటి మూలలో గోధుమరంగులో ఉన్న ఎండిన శ్లేష్మం యొక్క చిన్న పరిమాణం ఉంటుంది, తరచుగా ఇది మురికి చేతుల నుండి కంటిలోకి ప్రవేశించిన దుమ్ము లేదా దూళి వలన సంభవిస్తుంది
- నిరోధించబడిన కన్నీటి వాహిక (tear duct)
- కండ్లకలక - బాక్టీరియా, అలెర్జీ లేదా వైరస్ వలన
- కేరాటైటిస్
- బ్లిఫరైటిస్
- కంటి గాయం
- కళ్ళలోకి బయటి పదార్థం చేరడం
- తీవ్రమైన కనురెప్పల యొక్క సెల్యులైటిస్
ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
ముందుగా, వైద్యులు లక్షణాలు యొక్క వివరణాత్మక చరిత్రను తీసుకొని కళ్ళను జాగ్రత్తగా పరిశీలిస్తారు.
కంటి స్రావాల యొక్క చికిత్స దాని కారకం మీద ఆధారపడి ఉంటుంది. దీని చికిత్సకు వివిధ పద్ధతులు ఈ విధంగా ఉంటాయి:
- వెచ్చని నీరు మరియు తడి కాటన్ బాల్స్ ఉపయోగించి కళ్ళ స్రావాలు లేదా చీముని శుభ్రం చెయ్యాలి. శుభ్రపరిచిన తరువాత, కాటన్ ను జాగ్రత్తగా పారవేయాల్సి ఉంటుంది, మరియు మళ్ళి సంభవించే ఇన్ఫెక్షన్ను నివారించడానికి చేతులు బాగా కడగాలి.
- ముఖం లేదా కనురెప్పలను తాకడం మరియు కంటి అలంకరణను (makeup) మానుకోవాలి.
- ఇన్ఫెక్షన్ కారణంగా ఈ సమస్య సంభవించినట్లయితే యాంటీబయాటిక్ లేదా యాంటివైరల్ కంటి చుక్కలు సూచించబడతాయి.
- అసాధారణమైన లేదా అధికమైన కంటి స్రావాలు ఉన్నప్పుడు ఆ వ్యక్తి కాంటాక్ట్ లెన్సులు వాడకూడదు మరియు కళ్లద్దాలు ధరించాలి.