ముఖ వాపు అంటే ఏమిటి?
ముఖ వాపు అనేది అనేక వ్యాధులు మరియు సమస్యలు చూపించే ఒక లక్షణం. ముఖం ఉబ్బినట్టు మరియు వాచిన్నట్లు కనిపిస్తుంది. ఇది కీటకాలు కుట్టడం వలన సంభవించే అలెర్జీ ప్రతిస్పందన ఐతే తీవ్రంగా ఉండవచ్చు లేదా గ్లోమెరులోనెఫ్రైటిస్ వంటి మూత్రపిండాల వ్యాధి కారణంగా దీర్ఘకాలికంగా ఉండవచ్చు.
దాని ప్రధాన సంబంధిత సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
ముఖ వాపు యొక్క కొన్ని సాధారణ సంకేతాలు మరియు లక్షణాలు:
- నిరంతరమైన దురద
- ముఖం ఎప్పుడు బిగుతుగా ఉండడం
- వాపుతో ఎర్రబడడం
- కళ్ళు తెరవడం మరియు మూయడంలో కష్టంగా ఉండడం
దాని ప్రధాన కారణాలు ఏమిటి?
ముఖ వాపుకు కొన్ని సాధారణ కారణాలు:
- అలెర్జీ వలన కండ్లకలక
- ప్రీఎక్లంప్సియా, గర్భిణీ స్త్రీలలో అధిక రక్తపోటు మరియు ప్రోటీన్ స్థాయిలు ఉంటాయి
- సెల్యూలైటిస్, ఇందులో బ్యాక్టీరియా లేదా ఫంగస్ లు చర్మంలోని పగుళ్లు మరియు దెబ్బల ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి
- కొన్ని ఔషధాలకి అలెర్జీ ప్రతిస్పందన.
- దద్దుర్లు (హైవ్స్)
- ఫుడ్ అలెర్జీలు
- ముక్కు చిట్లడం (ముక్కుకి దెబ్బతగలడం), ముక్కు ఎముక లేదా కార్టిలేజ్ కు పగుళ్లు ఏర్పడి, తరచుగా అది ముఖం మీద వాపుకు దారితీస్తుంది
- కనురెప్ప కురుపు
- ప్రోటీన్ కొరత వలన కలిగే పోషకాహార లోపం
- ప్రోటీన్ యొక్క నష్టం కలిగించే కిడ్నీ వ్యాధి
- శస్త్రచికిత్స యొక్క ప్రభావం
- హైపోథైరాయిడిజం
ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
ముఖ వాపు గుర్తించడం చాలా సులభం. అయినప్పటికీ, కారణాన్ని గుర్తించడం కోసం వైద్యున్ని సంప్రదించడం ముఖ్యం.
ప్రభావవంతమైన రోగ నిర్ధారణ కొరకు, వైద్యులు భౌతిక పరిశీలన చేస్తారు. చాలా సందర్భాల్లో, ముఖవాపు అలెర్జీ లేదా సంక్రమణం (ఇన్ఫెక్షన్) వల్ల ఏర్పడుతుంది. వాపు యొక్క తీవ్రతను బట్టి, వైద్యులు అలెర్జీ వ్యతిరేక (ఆంటిఅలెర్జిక్) పరీక్షలను సంభవించిన అలెర్జీ ప్రతిచర్యను నిర్ధారించటానికి సూచించవచ్చు.
తద్వారా, వైద్యుడు అలెర్జీ వ్యతిరేక మందులను సూచించవచ్చు మరియు అలర్జీకి కారణమయ్యే అలెర్జిన్ (అలర్జీ కారకాన్ని) కు బహిర్గతం కావడాన్ని నివారించమని సూచిస్తారు. అవి (అలర్జీ కారకాలు) ఆహారంలో గింజలు మరియు రోగనిరోధకత పెంచడానికి సహాయపడే ఆహారాలు కూడా కావచ్చు.
కారణంపై ఆధారపడి, యాంటీబయాటిక్స్, యాంటీడైయూరిటిక్స్ లేదా అధిక ప్రోటీన్ ఆహారాన్ని కూడా సూచించవచ్చు.