హిమోగ్లోబిన్ లోపం అంటే ఏమిటి?
మన ఎర్ర రక్త కణాల్లో హీమోగ్లోబిన్ ఒక ముఖ్యమైన ప్రోటీన్. దాని పని కణాలకు మరియు కణజాలాలకు ఆక్సిజన్ తీసుకువెళ్లడం (సరఫరా చెయ్యడం). తక్కువ హేమోగ్లోబిన్ శాతాన్ని హేమోగ్లోబిన్ లోపం అని కూడా పిలుస్తారు దీనిని రక్త పరీక్ష ద్వారా తేలికగా గుర్తించవచ్చు. సాధారణంగా పురుషులలో 13.5 g / dL (135 g / L) కంటే తక్కువ మరియు స్త్రీలలో 12 g / dL (120 g / L) కంటే తక్కువ ఉంటే దానిని హిమోగ్లోబిన్ లోపం అని పరిగణిస్తారు.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
మాములుగా, హేమోగ్లోబిన్ శాతం సాధారణం కన్నా కొంచెం తక్కువగా ఉంటే, వ్యక్తికి ఎటువంటి లక్షణములు ఉండకపోవచ్చు.
అయితే, హిమోగ్లోబిన్ లోపం యొక్క లక్షణాలు:
- అలసట
- బలహీనత
- మైకముగా అనిపించడం
- వణుకు
- పాలిపోయిన చర్మం
- శ్వాస ఆడకపోవడం
- శారీరక కార్యకలాపాలు నిర్వహించలేకపోవటం
- పాదములలో వాపు
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
అనేక కారణాల వలన అధికంగా రక్తం నష్టపోవడం వలన హిమోగ్లోబిన్ శాతం తక్కువ కావచ్చు:
- గాయం వలన అధిక రక్తస్రావం కావడం
- తరచుగా రక్తదానం చెయ్యడం
- భారీ రుతు రక్తస్రావం కావడం
శరీరంలోని ఎర్ర రక్త కణాల అధికంగా విచ్ఛిన్నం అవ్వడానికి కారణమయ్యే కొన్ని సమస్యలు కూడా తక్కువ హిమోగ్లోబిన్ శాతానికి దోహదం చేస్తాయి:
- ప్లీహము (spleen) విస్తరించడం
- సికిల్ సెల్ ఎనీమియా
- తలస్సెమియా
హిమోగ్లోబిన్ లోపానికి దారితీసే తక్కువ ఎర్ర రక్త కణ ఉత్పత్తికి కారణమయ్యే ఇతర కారకాలు:
- విటమిన్ B12 ను తక్కువగా తీసుకోవడం
- ఎముక మజ్జ వ్యాధి (Bone marrow disease, ఎముక మజ్జలో ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి అవుతాయి కాబట్టి)
- అప్లాస్టిక్ ఎనీమియా (Aplastic anaemia) - ఇది ఒక రకమైన ఎముక మజ్జ క్యాన్సర్, ఇది కొత్త కణాల ఉత్పత్తి సామర్థ్యాన్ని నాశనం చేస్తుంది
- కిడ్నీ వ్యాధులు
- ఆహారంలో ఇనుము మరియు ఫోలేట్ల యొక్క తక్కువ స్థాయి
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
తక్కువ హిమోగ్లోబిన్ స్థాయిలు సాధారణ రక్త పరీక్ష ద్వారా నిర్ధారణ చేయబడతాయి. పూర్తి రక్త గణన (CBC, complete blood count) పరీక్ష సాధారణంగా వైద్యులు ఆదేశించే మొదటి పరీక్ష. ఇది ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు,ప్లేటిలెట్లు, హేమోగ్లోబిన్ మరియు హేమాటోక్రిట్ (ఎర్ర రక్త కణాలతో తయారు చేయబడిన రక్తం యొక్క శాతం) వంటి రక్తంలో పదార్దాలను కొలుస్తుంది. ఈ క్రింది సందర్భాలలో రక్త పరీక్ష జరగవచ్చు:
- అంతర్గత రక్తస్రావం యొక్క గమనించదగ్గ గుర్తు
- గర్భం
- రక్త నష్టాన్ని అనుభవిస్తున్నప్పుడు
- కిడ్నీ సమస్యలు
- రక్తహీనత
- క్యాన్సర్
- కొన్ని మందులను తీసుకోవడం
తక్కువ హిమోగ్లోబిన్ కు చికిత్స లోపం యొక్క కారణం మీద ఆధారపడి ఉంటుంది. రక్తహీనత లేదా పోషక లోపల కారణంగా ఐతే, డాక్టర్ ఇనుము, విటమిన్ B12 లేదా రక్తంలో ఫోలేట్ స్థాయిలను పెంచడంలో సహాయపడే ఆహార పదార్ధాలను సూచించవచ్చు. గాయం కారణంగా రక్త నష్టం ఏర్పడితే, రక్త మార్పిడి అవసరం కావచ్చు. సాధారణంగా, అంతర్లీన కారణానికి చికిత్స చేయడమనేది తక్కువ హిమోగ్లోబిన్ శాతాన్ని పరిష్కరిస్తుంది. అధికంగా ఎర్ర రక్త కణాలకు నష్టం కలిగిన సందర్భాల్లో, బాహ్యంగా రక్తం ఎక్కించడంతో పాటు వ్యాధికి చికిత్స చేయడం అవసరమవుతుంది.