హాజ్కిన్ లింఫోమా అంటే ఏమిటి?
హాజ్కిన్ లింఫోమా అనేది లింఫోసైట్ల యొక్క ఒక నిరపాయమైన (బెంజీన్) క్యాన్సర్, ఇవి ఒక రకమైన తెల్ల రక్త కణాలు. శరీరంలోని శోషరస కణుపులు (lymph nodes) మరియు శోషరసనాళాలలో (lymph vessels) లింఫోసైట్లు ఉంటాయి. శోషరస కణుపులు బీన్ ఆకారపు గ్రంథులు ఇవి మెడ, చంక, ఛాతీ, కడుపు మరియు గజ్జ వంటి శరీర భాగాలలో ఉంటాయి. శోషరసనాళాలలు, రోగ నిరోధక వ్యవస్థ యొక్క ఇన్ఫెక్షన్-పోరాట కణాలతో కలిసి లింఫ్ (lymph) అని పిలవబడే ద్రవాన్ని తీసుకువచ్చే గొట్టాలు. హాజ్కిన్ లింఫోమా శోషరస వ్యవస్థ (lymphatic system) లో లింఫోసైట్ల యొక్క అనియంత్రిత పెరుగుదలకు కారణం అవుతుంది.
క్యాన్సర్ శోషరస నాళాల (లింఫ్ వెస్సెల్స్) ద్వారా ఒక కణుపు (నోడ్) నుండి మరొక కణుపుకు వ్యాపించగలదు. 20-25 ఏళ్లు వయసులో ఉండే పురుషులలో మరియు 70 ఏళ్ల వయస్సు తరువాత ఈ వ్యాధి సంభవిస్తుంది. స్త్రీల కంటే పురుషులు ఎక్కువగా ప్రభావితం అవుతారు.
హాజ్కిన్ లింఫోమా నిరపాయమైన (బెంజీన్) క్యాన్సర్లలో అసాధారణ రకము అయినప్పటికీ, ఇది సులభంగా చికిత్స చేయదగిన క్యాన్సర్లలో ఒకటి.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
- సాధారణ లక్షణాలు: మెడలో, చంకలలో మరియు గజ్జల ప్రాంతంలో నొప్పి లేని వాపు
- సాధారణ లక్షణాలు
- రాత్రిపూట అధికంగా చెమటలు పట్టుట
- జ్వరం (అధిక ఉష్ణోగ్రతతో)
- బరువు తగ్గుదల
- శరీరం మొత్తం దురదలు
- దగ్గు లేదా శ్వాస ఆడకపోవడం
- పొత్తి కడుపు నొప్పి
-
అరుదైన లక్షణాలు
కొందరు వ్యక్తులు ఎముక మజ్జల (bone marrow) లో కణాల యొక్క అసాధారణమైన పెరుగుదల ఉండవచ్చు:
- బలహీనత
- రోగనిరోధక వ్యవస్థ బలహీనపడిన కారణంగా అంటువ్యాధుల/ఇన్ఫెక్షన్ల ప్రమాదం పెరుగుతుంది
- ముక్కు నుండి రక్తస్రావం, ఋతు చక్రాలలో భారీ రక్తస్రావం వంటి రక్తస్రావ సమస్యలు మరియు చర్మం కింద చిన్న చిన్న ఎరుపు రంగు మచ్చలు ఏర్పడడం
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
ఈ అసాధారణమైన కణాల పెరుగుదలకు ఖచ్చితమైన కారణం ఇంకా తెలియలేదు కానీ క్రింది ప్రమాద కారకాలతో ఉన్న వ్యక్తులకు హాజ్కిన్ లింఫోమా సంభవించవచ్చు:
- హెచ్ఐవి (HIV) సంక్రమణ లేదా ఎయిడ్స్ (AIDS)
- అవయవ తిరస్కరణ (organ rejection) ను నిరోధించడానికి ఇమ్మ్యూనోసప్రెస్సంట్ (immunosuppressant) మందుల పై ఉన్నవారు
- రుమటోయిడ్ ఆర్థరైటిస్ మరియు సిస్టమిక్ ల్యూపస్ ఎరిథమాటోసస్ (SLE) వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులు
- నాన్-హాజ్కిన్ లింఫోమా యొక్క మునుపటి చరిత్ర
- హాజ్కిన్ లింఫోమా ఉన్న కుటుంబ సభ్యులు (తండ్రి, తల్లి లేదా తోబుట్టువులు)
- ఇదివరకు ఎప్స్టీన్ బార్ (Epstein Barr) వైరస్ లేదా గ్లాండ్యూలర్ జ్వరానికి గురికావడం.
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
ప్రమాద కారకాలను అంచనా వేయడానికి వైద్యులు వివరణాత్మక కుటుంబం మరియు వ్యక్తిగత చరిత్రను తెలుసుకుంటారు.ముందుగా, వైద్యులు వ్యాధిని నిర్ధారించడానికి శోషరస కణుపు (lymph node) నుండి నమూనా తీయడానికి బయాప్సీ అని పిలవబడే చిన్న చికిత్సా విధానాన్ని సిఫార్సు చేస్తారు. బయాప్సీ నిర్ధారణ తర్వాత, రక్త కణాల స్థాయిని మరియు శరీరంలోని ఏ అవయవాలు ప్రభావితమయ్యాయో పరిశీలించడానికి రక్త పరీక్షలు, ఛాతీ ఎక్స్-రే మరియు పెట్ (PET) స్కాన్ వంటి కొన్ని పరీక్షలు నిర్వహించబడతాయి.
అందుబాటులో ఉన్న చికిత్సలలో కెమోథెరపీ (మందులతో చికిత్స) మరియు రేడియోథెరపీ (రేడియోధార్మికత ఉపయోగించి చికిత్స) ఉన్నాయి. కొన్నిసార్లు స్టెరాయిడ్ మందులు ఇవ్వబడతాయి. పూర్తి రికవరీ నిర్ధారించడానికి వైద్యులను క్రమంగా సంప్రదించవలసి ఉంటుంది.