సంతానలేమి (ఇన్ఫెర్టిలిటీ) - Infertility in Telugu

Dr. Rajalakshmi VK (AIIMS)MBBS

December 04, 2018

October 29, 2020

సంతానలేమి
సంతానలేమి

సంతానలేమి (ఇన్ఫెర్టిలిటీ) అంటే ఏమిటి?

సంతానలేమి అనేది భార్యాభర్తలు సంతానాన్ని పొందలేకపోవడం లేదా గర్భనిరోధకత చర్యలు ఏమి తీసుకోకుండా ఒక సంవత్సరం పాటు ప్రయతించినా స్త్రీ గర్భం దాల్చలేకపోవడం. కొన్ని సందర్భాల్లో, గర్భం దాల్చినప్పటికీ తరచుగా గర్భస్రావాలు లేదా చనిపోయిన శిశువు పుట్టడం వంటి సమస్యలను ఎదుర్కొంటారు, ఇవి కూడా ఇన్ఫెర్టిలిటీలోకే వస్తాయి.

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

సంతానోత్పత్తిలోని సమస్యలను గుర్తించడానికి సహాయపడే కొన్ని సంకేతాలు మరియు లక్షణాలు ఈ విధంగా ఉంటాయి

  • క్రమరహిత ఋతు చక్రాలు
  • తీవ్రమైన కటిప్రాంత నొప్పి (పెల్విక్ పెయిన్)
  • ఒక సంవత్సరం ప్రయత్నించిన తర్వాత కూడా గర్భం దాల్చకపోవడం, స్త్రీ వయస్సు 35 లేదా 40 సంవత్సరాలు కంటే ఎక్కువ కావడం లేదా ఏ విధమైన  గర్భనిరోధక పద్ధతులను ఉపయోగించకుండా లైంగిక సంబంధం కలిగి ఉన్నపటికీ.
  • తరచుగా గర్భస్రావాలు జరగడం

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

సంతానలేమికి కొన్ని కారణాలు ఈ విధంగా ఉంటాయి

  • మహిళల్లో అండోత్పాదన (ఓవ్యులేషన్) లేకపోవడం లేదా క్రమరహితంగా ఉండడం
  • పురుషులలో వీర్యకణాలు ఏర్పడడాన్ని మరియు వాటిని పనితీరును ప్రభావితం చేసే వృషణాలలో సమస్యలు
  • మహిళల్లో సంతానలేమికి కారణమయ్యే ఇతర సాధారణ అంశాలు
    • వయసు పెరగడం
    • హార్మోన్లు లేదా పునరుత్పత్తి అవయవాలు సంబంధించిన సమస్యలు
    • ఫెలోపియన్ గొట్టాలలో అడ్డంకులు ఏర్పడం (సాధారణంగా లైంగిక సంక్రమణలు లేదా ఎండోమెట్రియోసిస్ కారణంగా సంభవించవచ్చు)
    • థైరాయిడ్ లేదా పిట్యూటరీ గ్రంధులు సరిగ్గా పని చేయకపోవడం
  • పురుషులలో సంతానలేమికి కారణమయ్యే ఇతర సాధారణ అంశాలు ఉన్నాయి
    • వృషణాల నుండి వీర్యకణాలను తీసుకువెళ్లే  గొట్టాలలో అడ్డంకులు ఏర్పడడం

దీనిని  ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

వైద్యులు అన్ని సంకేతాలు మరియు లక్షణాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత సంతానలేమి నిర్ధారణకు, జంట యొక్క పూర్తి ఆరోగ్య చరిత్రను గురించి తెలుసుకుని, భౌతిక పరీక్షలు నిర్వహిస్తారు మరియు నిర్ధారణను ధృవీకరించడానికి ఈ క్రింది పరీక్షలను సూచిస్తారు:

  • రక్త పరీక్షలు
    • ప్రొజెస్టెరోన్ పరీక్ష (మహిళ యొక్క ఋతు చక్ర సమయంలో  23 రోజులుకు)
    • ఫోలికల్-స్టిమ్యులేటింగ్ హార్మోన్ (FSH, Follicle-stimulating hormone)
    • యాంటీ-ముల్లెరియన్ హార్మోన్ (AMH, Anti-Mullerian hormone)
    • థైరాయిడ్ ఫంక్షన్ పరీక్షలు
    • ప్రొలాక్టిన్ స్థాయిల పరీక్ష (Prolactin level test)
    • ఒవేరియన్ రిజర్వ్ డెటెక్టింగ్ టెస్ట్ (Ovarian reserve detecting test)
  • మూత్ర పరీక్ష
  • ఇమేజింగ్ టెస్టులు మరియు పద్ధతులు
    • అల్ట్రాసౌండ్
    • హీస్టిరోస్లపినోగ్రఫీ (Hysterosalpingography)
    • సోనోహిస్టీరోగ్రఫీ(Sonohysterography)
    • హిస్టెరోస్కోపీ (Hysteroscopy)
    • లాప్రోస్కోపీ (Laparoscopy)
  • వీర్య విశ్లేషణ (Semen Analysis)

సంతానలేమికి వివిధ చికిత్సా పద్ధతులు ఉన్నాయి, అవి

  • సెక్స్ ఎడ్యుకేషన్
  • అండాల అభివృద్ధి మరియు అండోత్పత్తిని ప్రేరేపించే మందులు, అవి గోనాడోట్రోపిన్ ఇంజెక్షన్లు (gonadotropin injections) మరియు క్లోమిఫేన్ సిట్రేట్ (clomiphene citrate) మాత్రలను కలిగి ఉంటాయి
  • అధికంగా కదలికలు ఉండే వీర్యకణాల కోసం ఇంసెమినషన్ (వీర్యనిక్షేపం), మరియు దానిని కడిగి (వాషింగ్) యుటిరైన్ క్యావిటీలోకి నేరుగా పెట్టడం (ఎక్కించడం) జరుగుతుంది.
  • ఇన్ విట్రో ఫెర్టిలైసెషన్ (IVF, In vitro fertilisation) లో దీనిలో అండాలు వీర్య కణాలతో శరీరం వెలుపల ఫలదీకరణం చేయబడతాయి
  • సరోగసి (అద్దెగర్భం) దీనిలో మూడో వ్యక్తి వీర్యకణాలను లేదా అండాలను దానం చేస్తారు లేదా స్త్రీ పిండాన్ని మోయడానికి ((అద్దెగర్భానికి)సిద్ధంగా ఉంటుంది
  • అబ్డోమినల్ మీమెక్టమీ (bdominal myomectomy) ద్వారా శస్త్రచికిత్స చేసి గర్భాశయంలోని యుటిరైన్ ఫైబ్రాయిడ్లు తొలగించబడతాయి.



వనరులు

  1. American College of Obstetricians and Gynecologists. Evaluating Infertility. Washington, DC; USA
  2. National Institutes of Health. How is infertility diagnosed?. Eunice Kennedy Shriver National Institute of Child Health and Human Development. [internet].
  3. Mentalhelp. Introduction to Infertility. American addiction center. [internet].
  4. MedlinePlus Medical: US National Library of Medicine; Infertility
  5. University of California. Infertility. Los Angeles. [internet].

సంతానలేమి (ఇన్ఫెర్టిలిటీ) కొరకు మందులు

Medicines listed below are available for సంతానలేమి (ఇన్ఫెర్టిలిటీ). Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.