కడుపుల్లో మంట వ్యాధి అంటే ఏమిటి?
కడుపులో మంట లేక పేగుల్లో మంట వ్యాధి (Inflammatory bowel disease-IBD) అనేది జీర్ణశయాంతర లేక జీర్ణనాళం యొక్క దీర్ఘకాలిక అనారోగ్యం. ఇది వాపు లేదా మంటలతో కూడుకున్న జీవితాంత దశలవారీ వ్యాధి లక్షణాలతో అపుడపుడూ ఉపశమిస్తూ ఉంటుంది. సుదీర్ఘకాలంపాటు కొనసాగే “కడుపులో మంట” జీర్ణానాళాన్ని (GI ట్రాక్ట్) దెబ్బ తీస్తుంది. క్రోన్స్ వ్యాధి మరియు అల్సరేటివ్ కొలిటిస్ అనేవి కడుపులో మంట వ్యాధి (IBD)లోనే సంభవించే రెండు రకాల మంట నమూనాలు. పెద్ద పెగ్గులో పుండ్లు (ulcerative colitis) పెద్దప్రేగులనే దెబ్బతీస్తుంది. అయితే క్రోన్'స్ వ్యాధి నోటి నుండి జీర్ణాశయం యొక్క ఏ భాగాన్నైనా దెబ్బతీస్తుంది.
కడుపుల్లో మంట వ్యాధి ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
ఎక్కువగా, 15 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసులో ఉన్నవారికి IBD వ్యాధితో బాధపడుతుంటారు. వ్యాధి లక్షణాలు వ్యక్తుల్లో మారుతుంటాయి. కొన్ని లక్షణాలు క్రింద పేర్కొనబడ్డాయి:
- నొప్పి లేదా కడుపులో తిమ్మిరి.
- బరువు నష్టం.
- అలసట.
- రక్తం లేదా చీముతో కూడిన అతిసారం లేదా రక్తం-చీము లేకుండా పునరావృతమయ్యే అతిసారం.
- మలవిసర్జనకు తక్షణమే వెళ్లాల్సిన పరిస్థితి.
- వ్యాధి క్రియాశీల దశలో జ్వరం.
IBD నిరంతరంగా ఉన్నప్పటికీ, కడుపులో మంట తీవ్రతపై ఆధారపడి వ్యాధి లక్షణాలు సాధారణంగా వస్తుంటాయి మరియు పోతుంటాయి. మంట తీవ్రంగా ఉన్నప్పుడు, వ్యాధి క్రియాశీల దశలో ఉంటుంది మరియు మంట తగ్గిపోయినప్పుడు, ఈ వ్యాధి తేలికపాటి లక్షణాలతో ఉపశమనం కలిగి ఉంటుంది.
ప్రధాన కారణాలు ఏమిటి?
కడుపులో మంట యొక్క నిజమైన కారణం తెలియదు, కానీ ఈ క్రింది కారణాలు కడుపులో మంట వ్యాధిని కల్గించేందుకు కారణం అవుతున్నాయి.
- జనుపరమైన (Genetic) కారణాలు
మీరు గనుక కడుపులో మంట వ్యాధికి సానుకూల కుటుంబ చరిత్రను కల్గిఉంటే మీరు ఈ వ్యాధిబారిన పడి బాధపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. - బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ
సాధారణంగా, మీ శరీరం వైరస్లు లేదా బ్యాక్టీరియా వంటి విదేశీ జీవులపై దాడి చేస్తుంది. పర్యావరణ లేదా ఇతర కారకాలకు ప్రతిస్పందనగా రోగనిరోధక వ్యవస్థ శరీర కణజాలం, ప్రత్యేకంగా పేగు యొక్క కణజాలం, విరుద్ధంగా ప్రతిస్పందించినపుడు జీర్ణనాళ వాపుకు దారితీస్తుంది.
కడుపులో మంటను ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
భౌతిక పరీక్ష మరియు వివరణాత్మక చరిత్ర తీసుకోవడం కాకుండా కడుపులో మంట వ్యాధి సాధారణంగా ఎండోస్కోపీ లేదా కోలొనోస్కోపీ మరియు ఇమేజింగ్ స్టడీస్ కలయికతో కూడిన పరీక్షలతో గుర్తించబడుతుంది. ఇమేజింగ్ స్టడీస్ లో MRI, CT స్కాన్ మరియు కాంట్రాస్ట్ రేడియోగ్రఫీ ఉన్నాయి. మల పరీక్ష మరియు రక్త పరీక్షలను కడుపులో మంట రోగనిర్ధారణను స్థిరీకరించేందుకు చేస్తారు.
చికిత్స యొక్క ప్రధాన లక్ష్యం పేగుల్లో కలిగే మంటను తగ్గించడం మరియు వ్యాధి లక్షణాల నుండి ఉపశమనం అందించడమే. వ్యాధి ఒకసారి నియంత్రణలోకొస్తే, వ్యాధి పునఃస్థితిని నిరోధించడానికి మరియు ఉపశమనం కాలాన్ని పొడిగించేందుకు మందులసేవనం కొనసాగించబడుతుంది. దీనినే “నిర్వహణ చికిత్స”గా పిలుస్తారు. వ్యాధి తీవ్ర సందర్భాల్లో శస్త్రచికిత్స అవసరం కావచ్చు.