నెత్తి దురద అంటే ఏమిటి?
నెత్తిదురద రుగ్మత రోగుల నుండి వచ్చే ఓ సాధారణ ఫిర్యాదు. ఇది దురదకు కారణమైన ఏ రుజువు లేకుండా తరచుగా సాధారణంగా రావచ్చు. ఇది వైద్యుడు మరియు రోగి-ఇరువురికీ ఒక వ్యధాభరిత పరిస్థితిని కలిగించేదిగా ఉంటుంది. ఇది జుట్టు నష్టం మరియు జుట్టు నష్టం లేకపోవడం లేదా కనబడే గాయాలు మరియూ కనిపించకుండా ఉండే గాయాలు అనే లక్షణాల ఆధారంగా రెండు రకాలుగా వర్గీకరించబడింది.
దీని ప్రధాన సంబంధిత సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
దురద పెట్టే నెత్తి అనేదే ఒక వ్యాధి లక్షణం. ఇది కింద తెలిపిన ఇతర చిహ్నాలు మరియు లక్షణాలతో కూడుకొని ఉంటుంది:
- ఎర్రబడిన లేదా వాపు కల్గిన నెత్తి చర్మం
- చుండ్రు
- నెత్తి మీద విస్తారమైన పేనుల నివాసం
- నెత్తి మీద ఎరుపుదేలిన త్యాపలు (patches)
- నెత్తిపై పొలుసులు లేవడం (స్కేలింగ్)
- నెత్తిపై చర్మం చీము పట్టడం లేదా గుల్లల్ని (క్రస్టీ) కల్గి ఉండడం
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
దురద పెట్టే నెత్తి రుగ్మత ఓ రోగలక్షణం, ఇది క్రింది పరిస్థితుల్లో దేనివల్లనైనా సంభవించవచ్చు:
- తలపై చర్మం, సోరియాసిస్, తామర మరియు ఇతరుల ఫంగస్ సంక్రమణల వంటి చర్మసంబంధమైన వ్యాధులకు గురవడం
- తలలో పేన్లు
- నరాల సంబంధమైన రుగ్మతలు (న్యూరోపతిక్), ఇది అంతర్వాహకమైన నరాల యొక్క లోపాల నుండి ఉత్పన్నమవుతుంది
- సిస్టమిక్ వ్యాధులు, ఈ రుగ్మతలు మొత్తం శరీరాన్ని ముఖచర్మరోగం (లూపస్) లాగా దెబ్బ తీస్తుంది.
- మానసికసంబంధమైన మరియు మనశ్చర్మ సంబంధి రుగ్మతలు, మానసిక మరియు మనశ్చర్మ సంబంధమైన (భౌతిక అనారోగ్యం లేదా మనోవిక్షేప కారకం ద్వారా వ్యాపిస్తాయి) వ్యాధులు
నెత్తి దురద రుగ్మతను ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
నెత్తి దురదకి కారణమయ్యే అంతర్లీన పరిస్థితి నిర్ధారణలో “SCALLP” అనే సంక్షిప్తపదంతో సూచించేది ఉపయోగకరంగా ఉంటుంది. దురద పెట్టె నెత్తి రుగ్మత పూర్తి అంచనాకు ఐదు దశలు పడుతుంది. ఈ దశలు:
- వినండి: రోగి చరిత్రను జాగ్రత్తగా వినడం
- చూడండి: రుగ్మత దెబ్బ తీసిన నెత్తి (శరీర భాగాల) పూర్తి భౌతిక విశ్లేషణ
- తాకడం (టచ్): దురద పెట్టే నెత్తి ఉపరితలాన్ని తాకి అనుభూతి చెంది తెలుసుకోవడం
- మాగ్నోఫై: సూక్ష్మదర్శిని క్రింద చర్మం పరిశీలించడం
- నమూనా సేకరణ: కొన్ని సందర్భాల్లో, రోగ నిర్ధారణను ధృవీకరించడానికి సూక్ష్మదర్శిని క్రింద పరీక్ష కోసం టిష్యూ నమూనాను సేకరించవచ్చు
నెత్తి దురదకి చికిత్స:
- దీర్ఘకాలిక వెంట్రుకల కుదుళ్ళ వాపు (ఫోలిక్యులిటిస్) లేదా పొడి చర్మం లేదా మోటిమలు కారణంగా నెత్తి దురద పెడుతూ ఉంటే టెట్రాసైక్లిన్ (డోక్సీసైక్లిన్, మినాసైక్లిన్), PAR-2 ప్రతిరోధకాలు లేదా వ్యతిరేకమందులు (antagonists) ఉపయోగించబడతాయి.
- ఇది సోరియాసిస్, లేదా సెబోరోహెయిక్ డెర్మటైటిస్ కారణంగా ఏర్పడినప్పుడు, యాంటీ-హిస్టమైన్లు వాడబడతాయి.
- నెత్తి చర్మం యొక్క తామరవ్యాధి (రింగ్వార్మ్) చికిత్సకు యాంటీ ఫంగల్ మందులు సిఫార్సు చేయబడుతాయి.
- నెత్తికి సంభవించే తామర మరియు సోరియాసిస్ కైతే స్థానిక స్టెరాయిడ్లను సూచించవచ్చు.
- నరాలవ్యాధి దురదకైతే, పైపూతగా వాడే “క్యాన్నబినాయిడ్ రిసెప్టర్ అగోనిస్టులు” చికిత్సగా ఉపయోగిస్తారు.
- తల పేన్లకు పర్మేత్రిన్ (permethrin) పైపూత మందుతో కూడిన శాంపూలు లేక పేన్లను వాటి గుడ్లను చంపే శాంపూలు లేక ద్రావకాలు అవసరం. ఈ చికిత్సా పద్ధతి నియమావళిని కొన్ని రోజులపాటు పాటించాల్సి ఉంటుంది.